ATM Centre
-
ఈ సెక్యూరిటీ గార్డ్ పని చూస్తే శభాష్ అనాల్సిందే!
ఈ హైటెక్ యుగంలో చదువు పెద్ద ఆర్భాటంగా తయారైంది. ఇష్టంతో కాకుండా ఇంట్లోవాళ్ల పోరు తట్టుకోలేక కష్టంగా చదువున్నవాళ్లే అధికం. అందులోనూ సకల సౌకర్యాలు కల్పిస్తేనే చదుకు కొనసాగిస్తామని తల్లిదండ్రులకు పోరు పెట్టే విద్యార్థులు ఎంతోమంది. కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో మాత్రం చదవుకు కావల్సింది ఆసక్తి, శ్రద్ధ మాత్రమేనని చాటి చెబుతోంది. లక్ష్యాన్ని చేరకోవాలంటే కావాల్సింది ఏకాగ్రత, పట్టుదలేనని నిరూపిస్తూ ఓ యువకుడు తన ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తూనే తనకిష్టమైన చదువును కోనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. తన కుటుంబానికి చదివించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఓ యువకుడు ఏటీఎం కేంద్రంలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. అయితే రాత్రి పూట కస్టమర్ల తాకిడి పెద్దగా ఉండదు కాబట్టి ఆ సమయంలో ఖాళీగా ఉండడం కన్నా చదువుకోవడం బెటర్ అని భావించాడు. ఇంకేముంది ఏటీఎం కేంద్రంలోనే చదవడం షురూ చేశాడు. చదవాలనే కోరిక ఉంటే చాలు కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని చదుకునే వీలుంటుందని నిరూపించాడు. ఈ ఫోటోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఫోటోతో పాటు హిందీలో ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. "హో కహిన్ భీ ఆగ్, ఆగ్ జల్ని చాయే’’ (నిప్పు ఎక్కడున్నా నిప్పే, ఎందుకంటే తన మండే స్వభావాన్నిమార్చుకోదు కాబట్టి). ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఇలాంటి విద్యార్థి ఉన్నాడా అంటూ కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ‘నీ డెడికేషన్ లెవల్‌కి నా సలాం’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ( చదవండి: నడి రోడ్డుపై ఈ అమ్మడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా ) हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए. (साभार) pic.twitter.com/auLrv7GIso— Awanish Sharan (@AwanishSharan) April 6, 2021 -
విమానంలో వచ్చి ఏటీఎంలో చోరీ
సాక్షి, విశాఖపట్నం: నగరానికి విమానంలో వచ్చారు. హోటల్లో దిగి పక్కా ప్లాన్ రూపొందించుకున్నారు. ఒక స్కూటీ అద్దెకు తీసుకొని నాలుగు రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. ఓ ఏటీఎంని ఎంపిక చేసుకున్నారు. చోరీకి కావల్సిన సామగ్రిని కొనుగోలు చేశారు. గ్యాస్ సిలిండర్ అద్దెకు దొరక్కపోవడంతో దొంగిలించారు. ఆ తర్వాత సినీ ఫక్కీలో చోరీ చేసి ఎంచక్కా చెక్కేశారు. ఖరీదైన వస్తువులు కొన్నారు. జల్సా చేద్దామనేలోగా పోలీసుల చేతికి చిక్కారు. ఆదర్శనగర్ ప్రాంతం సుందర్‌నగర్‌లో ప్రధాన రహదారి పక్కన ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను విశాఖ క్రైం పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్‌లో క్రైం డీసీపీ సురేష్‌బాబు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రం ముత్సర్ కోట్లిరోడ్డు–4కు కెందిన సమర్ జ్యోత్‌సింగ్, కేరళ రాష్ట్రం కేసరగుడ్ జిల్లా చీరువుత్తురు నగరానికి చెందిన జాఫర్ సాధిక్ కలిసి ఈనెల 16న హైదరాబాద్ నుంచి విశాఖ నగరానికి విమానంలో చేరుకున్నారు. ఇక్కడ ఒక హోటల్లో దిగారు. మర్నాడు ఒక స్కూటీ నలంద బైక్ రెంటల్ షాపు వద్ద అద్దెకు తీసుకున్నారు. నగరంలోని విశాలాక్షినగర్, మిదిలాపూరికాలనీ(మధురవాడ), మురళీనగర్, ఆదర్శనగర్ దరి సుందర్‌నగర్‌లోని ఏటీఎంల వద్ద రెక్కి నిర్వహించారు. సుందర్‌నగర్‌లోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలో చోరీ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. 20వ తేదీన గ్యాస్ సిలిండర్ కోసం అల్లిపురంలోని ఓ గ్యాస్ సిలిండర్ షాపులో సంప్రదించగా వారు నిరాకరించారు. దీంతో అదే రోజు రాత్రి ఆ షాప్‌లోనే గ్యాస్ సిలిండర్లు దొంగిలించారు. గ్యాస్ సిలిండర్లతోపాటు గుణపం, గ్యాస్ కట్టర్‌తో పలు వస్తువులను సుందర్‌నగర్ ఏటీఎం ప్రాంతంలో పార్కు వద్ద ఉంచారు. 21వ తేదీ రాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు ఏటీఎం కేంద్రంలోకి వస్తువులను చేర్చారు. జాఫర్ సాధిక్ బయట ఉండి అటువైపు వచ్చిన వారిని పరిశీలించాడు. సమర్ జ్యోత్ సింగ్ ఏటీఎం లోపలకి వెళ్లి సీసీ కెమెరా కనెక్షన్ కట్ చేశాడు. తరువాత గ్యాస్ కట్టర్‌తో నగదు బాక్స్‌ని కట్ చేసి రూ. 9,59,500 నగదును బ్యాగ్‌లో సర్దుకున్నాడు. అనంతరం వారు నగదుతో హోటల్‌కు చేరుకున్నారు. 22వ తేదీ ఉదయం 10.30 గంటల సమయంలో వారు అద్దెకు తీసుకున్న స్కూటర్ని నలంద షాపులో పెట్టి విశాఖ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లిపోయారు. (ముసుగులు.. గ్యాస్‌కట్టర్లు.. మారణాయుధాలు!) జల్సా ఇలా.. శామ్సంగ్ ఫోన్ రూ.59,999 ఒప్పో ఫోన్ రూ. 30,000 బెల్ట్ రూ. 10,000 లోదుస్తులు ఒక్కొక్కటి రూ. 3,000 షూ రూ. 8,000 పోలీసులు ఛేదించారిలా.. 22వ తేదీ ఉదయం స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఆరిలోవ సీఐ ఇమాన్యుయేల్‌రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. క్రైం డీసీపీ సురేష్‌బాబు, క్రైం ఏసీపీ పెంటారావు, సీఐలు, ఎస్ఐలు అక్కడకు చేరుకున్నారు. క్లూస్ టీమ్‌ను రప్పించి, గ్యాస్ సిలిండర్‌పై ఉన్న వేలిముద్రలను గుర్తించారు. అల్లిపురంలోని గ్యాస్ షాపు యజమాని వద్ద సమాచారం తీసుకున్నారు. అక్కడ నుంచి సీసీ ఫుటేజ్ సేకరించి, నేరస్తులు ఎటువైపు వెళ్లారు అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. 23న బెంగళూరు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నగర పోలీస్ కమిషనర్ సిన్హా ఆదేశాల మేరకు ఆరు బృందాలుగా ఏర్పడి బెంగళూరు వెళ్లారు. అక్కడి పోలీసుల సహకారంతో నిందితులు ఒక హోటల్ వద్ద ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులను 35 గంటల్లో పట్టుకున్న పోలీస్ సిబ్బందిని డీసీపీ సురేష్‌బాబు అభినందించారు. నగరంలో ఈ తరహాలో ఏటీఎం దొంగతనం జరగడం ఇదే మొదటిసారని తెలిపారు. ఈ సమావేశంలో క్రైం ఏసీపీ పెంటారావు,ï సీÜఐలు అవతారం, సూర్యనారాయణ, వెంకునాయుడు, సింహద్రినాయుడు, రాము, ఎస్ఐలు లూధర్బాబుతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. నగదు, విలువైన వస్తువుల సీజ్ నగదుతో పాటు విలువైన వస్తువులను క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.1.32,500 నగదు, రూ.4,500 (కాలిన 5 వందల నోట్లు), శామ్సంగ్ ఫోన్ (రూ.59,999), ఒప్పో ఫోన్ (రూ.30 వేలు), బెల్ట్ (రూ.10 వేలు), లోదుస్తులు ఒక్కొక్కటి (రూ.3 వేలు), షూ (రూ.8 వేలు)తోపాటు విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సమర్ జ్యోత్‌సింగ్ యాక్సిస్ బ్యాంక్ నుంచి తన సోదరుడు అకౌంట్‌కు బదిలీ చేసిన రూ.3 లక్షల నగదు రసీదులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కేసులు ► ఏటీఎం దొంగతనం కేసులో ప్రధాన నిందితుడు సమర్ జ్యోత్ సింగ్ 2019లో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం దొంగతనం కేసులో నేరస్తుడు. బెంగళూరులోని పరపరా అగ్రహంలో కెనరా బ్యాంక్ ఏటీఎం దొంగతనం కేసులోను, 2020 బెంగళూరు బైటాస్పురం ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనం కేసులో నేరస్తుడు. ఓ హత్య కేసులోను నిందిడుతుగా ఉన్నాడు. ► జాఫర్ సాధిక్ గతంలో బెంగళూరు జలహలీ పోలీస్‌స్టేషన్ పరిధిలో కెనరా బ్యాంక్ ఏటీఎంలో దొంగతనం చేశాడు. హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి చందానగర్‌లో ఎస్బీఐ ఏటీఎం దొంగతనం కేసులో నేరస్తుడు. -
క్యాష్ డిపాజిట్ చేస్తానంటూ
సాక్షి, విజయవాడ : ఏటీఎం సెంటర్లలో చోరికి పాల్పడుతున్న ఇంటిపల్లి రామారావు అనే వ్యక్తిని నగర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. 21 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతని వద్ద నుంచి రూ. 8,32,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ రాజకుమారి మాట్లాడుతూ.. క్యాష్ డిపాజిట్, ఏటీఎం మెషిన్ సెంటర్లను కేంద్రంగా చేసుకుని దొంగతనానికి పాల్పడతాడు. క్యాష్ తీసుకుని డిపాజిట్ చేస్తానని చెప్పి నకిలీ మెసేజులు పంపిస్తాడు. ఆ తరువాత డబ్బు తీసుకుని ఉడాయిస్తాడని తెలిపారు. బయట ఎవరైనా క్యాష్ తీసుకుని డిపాజిట్ చేస్తామని చెప్తే నమ్మకండని ప్రజలను హెచ్చరించారు. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు ఎంతో కష్టపడి కేసును పరిష్కరించారని ఆమె తెలిపారు. -
ఆమె 17 రోజులుగా ఏటీఎంకు వస్తూనే ఉంది..
ముంబై : తనను మోసం చేసి రూ.10వేలు ఎత్తుకెళ్లిన దొంగను 17 రోజలుగా మాటువేసి పట్టుకుని పోలీసులకు అప్పగించారు ముంబైకి చెందిన ఓ మహిళ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గత ఏడాది డిసెంబర్ 18న ముంబైకి చెందిన రెహనా షేక్ తన ఆఫీస్ దగ్గర్లో ఉన్న ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లారు. తన ఏటీఎం కార్డుతో రూ.10వేలు డ్రా చేశారు. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఆ డబ్బులు ఏటీఎం యంత్రం నుంచి బయటకు రాలేదు. ఇదంతా గమనించిన భూపేంద్ర మిశ్రా అనే వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. తాను ఒక్కసారి చూస్తానని చెప్పి ఆమె ఏటీఎం వివరాలు అడిగి తెలుసుకున్నాడు. నిందితుడు భూపేంద్ర మిశ్రా తాను ట్రై చేసిన డబ్బులు రావడంలేదని చెప్పి ఆమెకు కార్డు ఇచ్చి వెళ్లాడు. ఆమె కూడా టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల డబ్బులు రాలేదనుకొని ఆఫీస్‌కు వెళ్లింది. కాసేపటి తర్వాత ఆమె ఫోన్‌కు రూ.10 వేలు డ్రా తీసినట్లు మెసేజ్ వచ్చింది. అంతే అక్కడి వెళ్లి చూస్తే ఆ వ్యక్తి కనబడలేదు. ఏటీఎం వచ్చిన డబ్బులు భూపేంద్ర మిశ్రా తీసుకొని అక్కడి నుంచి హుటాయించాడు. విషయం తెలుసుకున్న రెహనా స్థానికి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రతి రోజు ఆ ఏటీఎం దగ్గరుకు వెళ్లి చుట్టు పక్కల వెతికారు. అలా 17 రోజులుగా ఆ ఏటీఎం దగ్గర మాటు వేసి చివరకు ఆ మోసగాన్ని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. భూపేంద్ర మిశ్రాపై ఇప్పటికే నాలుగు చీటింగ్ కేసులున్నాయని, ఆ పదివేల రూపాయలను కూడా మిశ్రానే దొంగిలించారని పోలీసులు తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పేర్కొన్నారు. -
రైతుల ఖాతాల్లో ..నగదు మాయం
మడకశిర: పలువురు రైతుల ఖాతాల్లోని పంటనష్టపరిహారం సొమ్ము మాయమైంది. అమాయక రైతులను ఏటీఎం కేంద్రం వద్ద అపరిచిత వ్యక్తులు ఏమార్చి.. ఏటీఎం కార్డు మార్పు చేసి.. అనంతరం ఖాతాల్లోంచి డబ్బు కాజేశారు. వివరాలిలా ఉన్నాయి. మడకశిరలోని ఏడీసీసీ బ్యాంకులో నియోజకవర్గంలోని పలువురు రైతులకు ఖాతాలు ఉన్నాయి. పంటనష్టపరిహారం డబ్బు ఇటీవల రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. అయితే ఈ డబ్బును బ్యాంకులో డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించలేదు. ఏటీఎం కేంద్రాలకు వెళ్లి తీసుకోవాలని బ్యాంకు అధికారులు సూచించారు. అమరాపురం మండలం నిద్రఘట్టకు చెందిన రైతు నాగేంద్ర తన ఖాతాలో జమ అయిన మొత్తాన్ని డ్రా చేసుకునేందుకని ఈ నెల 24న మడకశిరలోని ఓ ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అక్కడ పక్కనే ఉన్న అపరిచిత వ్యక్తి సాయంతో రూ.2వేలు డ్రా చేయించుకున్నాడు. ఆ వ్యక్తి రైతును ఏమార్చి వేరొక ఏటీఎం కార్డు ఇచ్చి పంపించాడు. అనంతరం పిన్ నంబర్ గుర్తు పెట్టుకుని రూ.28వేలను అదే రోజు డ్రా చేసేశాడు. ఇదే తరహాలోనే మడకశిర మండలం డి.అచ్చంపల్లికి చెందిన సుబ్బరాయప్ప ఖాతా నుంచి కూడా రూ.4800, గుడిబండ మండలం కేఎన్ పల్లికి చెందిన హనుమంతప్ప ఖాతా నుంచి రూ.20 వేల నగదును ఎవరో డ్రా చేసేశారు. బాధిత రైతులు శుక్రవారం ఏడీసీసీ బ్యాంకు వద్దకు వచ్చి మేనేజర్ గోపాల్‌రెడ్డి వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. అనంతరం ఎస్ఐ లింగన్నను కలిసి తాము మోసపోయిన తీరును వివరించి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఆదేశాల మేరకు ఏఎస్ఐ బాబు ఏడీసీసీ బ్యాంకుకు వెళ్లి బాధిత రైతుల ఖాతాలను పరిశీలించారు. అపరిచితులు కర్ణాటక, ఎస్బీఐ ఏటీఎంల ద్వారా డబ్బు డ్రాచేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. -
ఏటీఎంలో మంటలు : దగ్ధమైన నగదు
ఒంగోలు : ప్రకాశం జిల్లా పొదిలి బస్టాండ్ సమీపంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో గురువారం రాత్రి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని... మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బ్యాంకు అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఏటీఎంలో ఎంత నగదు కాలిపోయిందీ అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరెంట్ షాక్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేపట్టారు. -
ఏటీఎం కేంద్రంలో అగ్నిప్రమాదం
చిత్తూరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఇండియన్ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. తేరు వీధిలో ఉన్న ఏటీఎంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేసింది. -
ఏటీఎం..
తిమ్మాజీపేట మండలం ఆవంచకు చెందిన మన్సూరు అవసరానికి డబ్బులు తీసుకునేందుకు ఫిబ్రవరి ఏడో తేదీన జడ్చర్లలోని ఎస్బీహెచ్ ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. అతని వెంట కొందరు కేంద్రంలోకి వెళ్లి మాటల్లో పెట్టారు. అతని వద్దనుంచి ఏటీఎం కార్డు దొంగిలించారు. అనంతరం అతని ఖాతానుంచి 30వేల రూపాయలు కాజేశారు... జిల్లాలోని ఏటీఎం సెంటర్లలో జరుగుతున్న మోసాలకు ఒక ఉదాహారణ మాత్రమే.. ప్రతి రోజూ ఇలాంటి వారు ఎందరో మోసాలకు బలవుతూ.. లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో ఏటీఎం సెంటర్ల నిర్వహణ అత్యంత దారుణంగా తయారైంది. ఎక్కడా సెక్యూరిటీ గార్డులు ఉండడం లేదు. వాటి నిర్వహణను గాలికొదిలేశారు. ఇదే అదునుగా భావించి మోసకారులు రెచ్చిపోతున్నారు. మాయమాటలతో అమాయకులను బుట్టలో వేసుకొని ఏటీఎం కార్డులను మార్చేసి... వేల రూపాయలు దండుకుంటున్నారు. జిల్లాలో ప్రతినెల నాలుగైదు దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా బ్యాంకులనే లూటీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ఆర్థిక నేరాలు రోజురోజుకు శృతిమించుతున్నా బ్యాంకు యాజమాన్యాలు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో బ్యాంకులు పోటాపోటీగా ఆటోమెటిక్ టెల్లర్ మిషిన్ (ఏటీఎం)లను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిని ఆర్భాటంగా ప్రారంభిస్తున్నా... రక్షణ చర్యలు మాత్రం విస్మరిస్తున్నారు. నిత్యం లక్షలాది రూపాయలు డ్రా చేసే ఈ కేంద్రాల వద్ద కనీసం సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయలేకపోవడంతో వినియోగదారులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో మొత్తం 210 ఏటీఎం కేంద్రాలున్నాయి. వీటి నుంచి ప్రతిరోజూ కోటి నుంచి కోటిన్నర రూపాయల వరకు నగదు డ్రా చేస్తున్నట్లు సమాచారం. అయితే వీటివద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత సంబంధిత బ్యాంకుల పైనే ఉంటుంది. కానీ ఏ ఒక్క కేంద్రం వద్ద సెక్యూరిటీ గార్డులుండటం లేదు. పైగా ఏటీఏం కేంద్రాల లోపల సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. దీని కారణం చాలా వరకు బ్యాంకులు ఆర్థికభారం పడుతుందనే ఉద్దేశంతో నియమించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఒకటి, రెండు ముఖ్యమైన పాయింట్ల వద్ద మాత్రమే సెక్యూరిటీ గార్డులను నియమించి చేతులు దులుపుకుంటున్నాయి. ముఖ్యంగా పట్టణ, మండల కేంద్రాల్లో ఉండే ఏటీఎం సెంటర్ల వద్ద భద్రత ఉండడం లేదు. ఏటీఎం సెంటర్లకు ఆటోమెటిక్‌గా మూసుకునే గ్లాస్ డోర్ ఉండాలి. జిల్లాలో ఇలాంటివి ఎక్కడా కనిపించవు. ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటున్నాయి. దీంతో ఆగంతకులు నేరుగా లోనికి ప్రవేశించి డబ్బులు డ్రా చేసే సమయంలో మిస్‌గైడ్ చేయడంతో పాటు వారి ఏటీఎం కార్డులను తస్కరిస్తున్నారు. జిల్లాలో ఇలాంటివి ఎన్ని దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నా వాటి కేసుల్లో పురోగతి ఉండడం లేదు. మూతపడే దర్శనం... జిల్లాలోని ఏటీఎం సెంటర్ల భద్రత ఒక ఎత్తయితే... వాటి నిర్వహణ వినియోగదారులకు మరింత చికాకు కల్పిస్తున్నాయి. చాలా వరకు సెంటర్లు ఎప్పుడు చూసినా ‘‘సాంకేతిక కారణాల వల్ల తాత్కాలికంగా పనిచేయడం లేదు’’ అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల కేంద్రాల్లో అవసరం మేరకు నగదు నిల్వ ఉంచడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ పరిస్థితి నెల మొదటి వారంలో మరింత జఠిలంగా మారనుంది. ఏటీఎంలలో డబ్బుల నిల్వకు సంబంధించి బ్యాంకులు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తాయి. డబ్బుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు సరిపడా నిల్వ ఉండేలా సంబంధిత ఏజెన్సీ నిర్వహించాలి. కానీ ఎక్కడా కూడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. బ్యాంకులకు, ఏజెన్సీలకు మధ్య సమన్వయం లేకపోవడంతో ఏటీఎంలలో డబ్బులు లేకుండా రోజుల తరబడి ఉండిపోతున్నాయి. బ్యాంకులను హెచ్చరిస్తున్నాం: మల్లారెడ్డి, అడిషనల్ ఎస్పీ, మహబూబ్‌నగర్ ఇటీవల బ్యాంకు దోపిడీలు, ఏటీఎం సెంటర్ల వద్ద అంగతకుల మోసాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా బ్యాంకులను పదే పదే హెచ్చరిస్తున్నాం. అంతేకాదు సీసీ కెమెరాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని, వాటి రికార్డింగ్ ఒక రహస్య ప్రదేశంలో నిల్వ ఉండేట్లుగా చూడాలని సూచించాం. మా సిబ్బంది కూడా బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నారు. బ్యాంకుల వద్ద పాయింట్ బుక్‌లు ఏర్పాటు చేశాం. -
ఏటీఎం సెంటర్లో హత్య
-
సెక్యూరిటీ గార్డులా వచ్చి.. సొమ్ము కొట్టేశాడు!!
ఏటీఎంకు వెళ్లినప్పుడు అక్కడ డబ్బులు రావట్లేదా? అయినా కూడా సెక్యూరిటీ గార్డులను డబ్బులు తీసివ్వమని పొరపాటున కూడా అడగొద్దు. ఎందుకంటే, అమలాపురంలో ఇలాగే సెక్యూరిటీ గార్డు వేషంలో వచ్చిన వ్యక్తి.. ఓ అమాయకుడి దగ్గర ఏటీఎం కార్డు తీసుకుని ఏకంగా 40 వేలు కొట్టేశాడు!! ఈ సంఘటన అమలాపురం హైస్కూలు సెంటర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో జరిగింది. అమలాపురానికి చెందిన బిళ్ల కొల్లాపురి అనే వ్యక్తి హైస్కూలు సెంటర్లో ఉన్న ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ అతడు ఎంత ప్రయత్నించినా నగదు రాలేదు. ఏం చేయాలా అని చూస్తుండగా సెక్యూరిటీ గార్డు యూనిఫాంలో ఉన్న ఓ వ్యక్తి లోపలకు వచ్చాడు. తాను ప్రయత్నిస్తానని చెప్పి అతడి నుంచి ఏటీఎం కార్డు, పిన్ నెంబరు అడిగి తీసుకున్నాడు. కాసేపటి తర్వాత సొమ్ము రావట్లేదని కార్డు తిరిగి ఇచ్చేశాడు. దాంతో కొల్లాపురి వేరే ఏటీఎంకు వెళ్లగా అక్కడ ఆ కార్డు సరిగా పనిచేయలేదు. దాంతో బ్రాంచికి వెళ్లి, తన కార్డును బ్లాక్ చేయాలని కోరాడు. అయితే.. అప్పటికే కొంకాపల్లి ప్రాంతంలో ఉన్న ఓ ఏటీఎంలో ఈ ఖాతా నుంచి 40 వేల రూపాయలు డ్రా అయినట్లు బ్యాంకు అధికారులు అతడికి చెప్పారు. దాంతో.. సెక్యూరిటీ గార్డు వేషంలో వచ్చిన వ్యక్తి తనను మోసం చేసి కార్డు మార్చేశాడని, ఆ తర్వాత సొమ్ము డ్రా చేశాడని గుర్తించారు. కొల్లాపురి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
తపాలా: నాయనా, బెరీన లెక్క తీసుకో!
కడప జిల్లా ఉరుటూరు నా స్వస్థలం. ఉద్యోగ నిమిత్తం ఏడాదిన్నర కిందట నెల్లూరు వచ్చాను. నాకు ఇద్దరు కూతుళ్లు. నా ఐదేళ్ల పెద్ద కూతురు ఎల్కేజీ చదువుతోంది. ఒకసారి నా పెద్ద కూతురిని తీసుకుని విజయమహల్ సమీపంలోని ఏటీఎం సెంటర్‌కు పోయాను. బ్యాంక్ సిబ్బంది డబ్బు పెడుతుండటంతో నేను, నా బిడ్డ బయట నిలబడ్డాం. ‘నాయన బెరీన లెక్క తీసుకో. పోయి కొనుక్కుందాం’ అని గోము చేయసాగింది. డబ్బు తీసుకొచ్చిన వాహనానికి సెక్యూరిటీగా వచ్చిన వ్యక్తి ‘మీది కడపనాబ్బీ’ అని వెలుగు నిండిన కళ్లతో ప్రశ్నించాడు. ‘అవునన్నా’ సంభ్రమాశ్చర్యంతో జవాబిచ్చాను. వెంటనే ‘మీది’ అని అడగడంతో పాటు ఎట్లా కనుక్కున్నావు అని అడిగాను. ‘మాది పులివెందులబ్బీ. బెరీనా, లెక్క లాంటివి వాడేది మనమే కదా. నీ బిడ్డ మన యాసలో మాట్లాడ్తాంటే నాకు పాణం లేచొచ్చింది’ అని జవాబిచ్చాడాయన. ‘నీ పేరు’ అని నా కూతురిని అడిగాడు. ‘లక్షణ ప్రజ్వలిక’ అని సమాధానం చెప్పింది. ‘ఓయమ్మో.. అంత పేరు ఎవరు పెట్నారు’ అని మురిపెంగా ప్రశ్నించాడు. ‘మా జేజి లక్షణ అని, నాయన ప్రజ్వలిక అనుకున్యారంటా. ఇద్దరూ కలిసి లక్షణ ప్రజ్వలిక’ అని పెట్టినారు అని జవాబిస్తుంటే ఆయన ఆనందంతో తబ్బిబ్బయ్యాడు. ఇంటికొచ్చాక నా భార్యతో ఈ విషయాలన్నీ చెప్పాను. పిల్లలకు కడప మాండలికంలో మాట్లాడటం నిర్బంధంగా అమలు చేయాలని తీర్మానించాం. అమ్మ భాషలో మనుషులను దగ్గరగా తీసుకునే స్వభావం ఉంటుంది. మా బిడ్డలు మాట్లాడటం వింటాంటే కలిగే ఆనందం అనుభవించాల్సిందే తప్ప చెబితే అర్థం అయ్యేది కాదు. - సొదుం రమణారెడ్డి, నెల్లూరు ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, భీతిగొల్పిన సందర్భాలు, మీ ఊరి విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు, వారు రాసే చిట్టిపొట్టి కవితలు, వేసే రంగురంగుల చిత్రాలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మీ పిల్లలకు సంబంధించిన విశేషాలు పంపేటప్పుడు వాళ్ల ఫొటోలు జతచేయడం మర్చిపోకండి. మా చిరునామా: తపాలా, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
ఆగంతకుడి ఆచూకేదీ?
-
ఆగంతకుడి ఆచూకేదీ?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో జ్యోతి ఉదయ్‌పై వేట కత్తితో దాడి జరిగి ఎనిమిది రోజులైనా ఆగంతకుని ఆచూకీ ఏమాత్రం లభ్యం కాలేదు. అనంతపురం జిల్లా కదిరి ఏటీఎం కేంద్రంలో అచ్చు ఇలాంటి పోలికలే ఉన్న ఆగంతకుడు సీసీ టీవీ కెమెరా దృశ్యాల్లో కనిపించినా, కేసు దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదు. సుమారు 200 మంది పోలీసులు ఆగంతకుని వేటలో ఉన్నారు. నగర పోలీసులు, అనంతపురం జిల్లా పోలీసులతో కలసి పని చేస్తున్నారు. జ్యోతి మొబైల్ ఫోన్‌ను హిందూపురంలో విక్రయించడం ద్వారా ఆగంతకుడు పోలీసుల దృష్టి మళ్లించడానికి ప్రయత్నించాడా... అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. బహుశా అతను సరిహద్దు ప్రాంతానికి చెందిన వాడై ఉంటాడని, బెంగళూరు కూడా అతనికి సుపరిచితమేనని తెలుస్తోంది. జ్యోతిపై దాడి చేయడానికి అర గంట ముందు అతను అక్కడ రెక్కీ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. సిమ్ కార్డు లభ్యం జ్యోతి ఉదయ్ ఫోన్‌ను తీసుకు పోయిన ఆగంతకుడు అందులోని సిమ్ కార్డును బీఎంటీసీ బస్సులో పడేశాడు. మెజిస్టిక్ నుంచి మారతహళ్లికి వెళ్లే బస్సులో రమణ అనే కార్మికునికి సీటు కింద ఈ సిమ్ కార్డు లభించింది. దానిని తన ఫోనులో వాడుకుంటూ అతను పోలీసులకు దొరికి పోయాడు. మారతహళ్లి సమీపంలోని కాడుబీసనహళ్లిలో ఉంటున్న అతనిని సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్న సిల్వర్ జూబ్లీ పార్కు పోలీసులకు అప్పగించారు. ఈ నెల 19న తాను మెజిస్టిక్ నుంచి మారతహళ్లికి వెళుతుండగా బస్సులో సీటు కింద సిమ్ కార్డు లభ్యమైందని అతను పోలీసులకు చెప్పాడు. దానిని తన ఫోనులో వాడుకుంటున్నానని, అంతకు మించి తనకేమీ తెలియదని వివరించాడు. సోమవారం రాత్రి వరకు పోలీసులు అతనిని ప్రశ్నించారు. అనుమానం కలగక పోవడంతో తర్వాత వదిలి వేశారు. ఏటీఎంలో పని పూర్తి చేసుకున్న అనంతరం కార్పొరేషన్ సర్కిల్ నుంచి ఆగంతకుడు అదే బస్సులో మెజిస్టిక్‌కు వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. ఆ సందర్భంలోనే సిమ్ కార్డును ఫోన్ నుంచి తీసి పారేసి ఉంటాడని పోలీసులు అంచనాకు వచ్చారు. హిందూపురంలో మొబైల్ ఫోను పోలీసులకు లభ్యమైన సంగతి తెలిసిందే. దీంతో మొబైల్ ఫోన్, సిమ్ కార్డు ఆధారంగా చేపట్టిన దర్యాప్తునకు ద్వారాలు మూసుకు పోయాయి. దరిమిలా ఈ కేసు దర్యాప్తు మరింత సంక్లిష్టంగా మారింది. ధర్మవరంలో ఓ మహిళను హత్య చేసిన దుండగుడే బెంగళూరులోనూ ఈ అకృత్యానికి పాల్పడి ఉంటాడనే అనుమానంతో ఇరు రాష్ట్రాల పోలీసులు సంయుక్త కార్యాచరణను కొనసాగిస్తున్నారు. కోలుకుంటున్న జ్యోతి ఇక్కడి కెంగేరిలోని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రిలో జ్యోతి కోలుకుంటోంది. ఆమె ఆరోగ్యం కుదుట పడుతోందని, ఒకటి, రెండు రోజుల్లో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించే విషయమై యోచిస్తున్నామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాగా జ్యోతి పళ్ల రసం, ఆహారం తీసుకుంటోందని ఆమె భర్త ఉదయ్ కుమార్ తెలిపారు. ఫిజియో థెరపీ కూడా చేయిస్తున్నారని చెప్పారు. ఏటీఎం కార్డును ఎత్తుకెళ్లిన దుండగుడు పిన్ నంబరును కూడా జ్యోతిని అడిగి తెలుసుకున్నాడా అనే విషయం ఇంకా తెలియలేదన్నారు. ఈ సంఘటనపై ఆమెను ఏమీ అడగవద్దని వైద్యులు సూచించారని తెలిపారు. -
పిల్లాడి పుట్టినరోజు డబ్బుల కోసం వెళ్లి...
ఏటీఎంకు ఎందుకోసం వెళ్తాం? డబ్బులు తెచ్చుకోడానికే కదా.. అలాగే బెంగళూరు మహిళ కూడా తన పిల్లాడి పుట్టినరోజు జరిపేందుకు కావల్సిన డబ్బులు తెచ్చుకోడానికని ఏటీఎం సెంటర్‌కు వెళ్లింది. అక్కడ దుండగుడి బారిన పడి తీవ్రంగా గాయపడి ఐసీయూలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని, ఈ కేసు ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర తెలిపారు. పొరుగునున్న ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు కూడా పోలీసు బృందాలు వెళ్లాయి. బాధితురాలు జ్యోతి ఉదయకుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగాను, ఫుటేజ్ ఆధారంగాను అతడిని పట్టుకోగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ బ్యాంకు వైపు నుంచి తీవ్రమైన భద్రతాలోపాలు ఉన్నాయని, నగరం నడిబొడ్డున ఉన్న ఏటీఎంలో కూడా గార్డులు లేకపోవడం దారుణమని కమిషనర్ అన్నారు. బ్యాంకులన్నీ తప్పనిసరిగా తమ ఏటీఎంలు, శాఖల వద్ద భద్రతను పరిరక్షించుకోవాలని రాఘవేంద్ర తెరలిపారు. ఇదే అంశంపై కర్ణాటక హోం మంత్రి కేజే జార్జి రెండు గంటల పాటు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీప లాల్రోఖుమా పచావు, రాఘవేంద్ర ఔరాద్కర్, ఇతరులు పాల్గొన్నారు. కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని, జ్యోతి విషయంలో జరిగింది చాలా దురదృష్టకరం, దిగ్భ్రాంతికరమని జార్జి అన్నారు. నిందితుడిని ఎదుర్కోవడంలో బాధితురాలు చూపించిన ధైర్యానికి ఆమెను ప్రశంసించారు. స్వయంగా బ్యాంకు మేనేజర్ అయిన 44 ఏళ్ల జ్యోతి.. దాదాపు మూడు గంటల పాటు రక్తపు మడుగులోనే ఏటీఎం సెంటర్లో పడి ఉన్నారు. నిందితుడు ఆమె వద్ద ఉన్న రూ. 2,500 నగదు, మొబైల్ ఫోన్ లాక్కుని వెళ్లిపోయాడు. జ్యోతి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తుండగానే అతడు లోనికి వెళ్లి, షట్టర్‌ను లోపలి నుంచి కిందకి దించేసినట్లు వీడియో ఫుటేజిలో స్పష్టమైంది. అతడి వద్ద నాటు తుపాకి ఒకటి ఉందని, దాంతోపాటు కత్తి కూడా తీశాడని డిప్యూటీ కమిషనర్ డీసీ రాజప్ప తెలిపారు. తప్పించుకోడానికి ప్రయత్నించగా, ఓ మూలకు నెట్టేసి, ముఖంమీద కొట్టి, బ్యాగు లాక్కుని బయటకు పోతూ మళ్లీ బయటనుంచి షట్టర్ కిందకు దించేశాడన్నారు. నిందితుడి చేతుల్లో తీవ్రంగా గాయపడిన బాధితురాలు పక్షవాతానికి గురైంది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమెకు సుదీర్ఘ శస్త్రచికిత్స చేశామని, ఆమె ప్రస్తుతం మాట్లాడగలుగుతున్నారని శస్త్రచికిత్స చేసిన బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఎన్కే వెంటకరమణ తెలిపారు. ఆమె కపాలం పగిలిందని, చిన్న ఎముకముక్క మెదడులోకి వెళ్లడంతో కుడివైపు పక్షవాతం వచ్చిందని వివరించారు. నిందితుడి వివరాలు తెలిస్తే తెలియజేయాల్సిన ఫోన్ నెంబరు: సిల్వర్ జూబ్లీ పార్కు పోలీసు స్టేషన్ - 080- 22942583 -
ఏటీఎం ఘటనలో గాయపడ్డ మహిళ పరిస్థితి విషమం
బెంగళూరు : బెంగళూరులో ఏటీఎం ఘటనలో గాయపడిన మహిళ జ్యోతి ఉదయ్ కోలుకునేందుకు కొన్ని నెలలు పడుతుందని వైద్యుడు వెంకట్రామన్ తెలిపారు. ఆయన ఈరోజు ఉదయం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మహిళ పరిస్థితి విషమంగా ఉందని, ఆమె తలకు శస్త్ర చికిత్స చేశామన్నారు. దుండగుడి దాడిలో మహిళ పుర్రెకు గాయాలు అయినట్లు తెలిపారు. గాయాల కారణంగా ఆమె కుడి భాగానికి పక్షవాతం వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం మహిళకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా దాడికి పాల్పడిన నిందితుడి కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు. అనుమానితులెవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన బెంగళూరులోని స్థానిక బీబీఎంపీ ప్రధాన కార్యాలయం సమీపంలోని కార్పొరేషన్ సర్కిల్లో మంగళవారం జరిగింది. మిషన్ రోడ్డులోని కార్పొరేషన్ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తూ రాజేశ్వరీ నగర్లో నివాసం ఉంటున్న జ్యోతి ఉదయ్ నిన్న ఉదయం 7.10 ప్రాంతంలో డబ్బు డ్రా చేయడానికి కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎంలోకి వెళ్లింది. వెనుకే వచ్చిన దుండగుడు హఠాత్తుగా లోపలికి వచ్చి ఏటీఎం సెంటర్ షట్టర్ మూసివేశాడు. హఠాత్పరిణామాన్నుంచి తేరుకుని తప్పించుకోవడానికి ఆమె ప్రయత్నించగా.. అరవద్దంటూ గొంతునొక్కి, రివాల్వర్ చూపిస్తూ దుండగుడు బెదిరించాడు. తర్వాత డబ్బు డ్రా చేసి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో ఒక మూలకు నెట్టివేసి వేటకత్తితో ఆమెపై మూడు సార్లు దాడి చేశాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. ప్రస్తుతం జ్యోతి ఉదయ్ బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.