ఏటీఎంలో మంటలు : దగ్ధమైన నగదు | Major fire averted at ATM centre in podili | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో మంటలు : దగ్ధమైన నగదు

Published Thu, Dec 31 2015 8:18 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

ఏటీఎంలో మంటలు : దగ్ధమైన నగదు - Sakshi

ఏటీఎంలో మంటలు : దగ్ధమైన నగదు

ఒంగోలు : ప్రకాశం జిల్లా పొదిలి బస్టాండ్ సమీపంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో గురువారం రాత్రి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని... మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బ్యాంకు అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.

అయితే ఏటీఎంలో ఎంత నగదు కాలిపోయిందీ అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరెంట్ షాక్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement