
సాక్షి, విజయవాడ : ఏటీఎం సెంటర్లలో చోరికి పాల్పడుతున్న ఇంటిపల్లి రామారావు అనే వ్యక్తిని నగర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. 21 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతని వద్ద నుంచి రూ. 8,32,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ రాజకుమారి మాట్లాడుతూ.. క్యాష్ డిపాజిట్, ఏటీఎం మెషిన్ సెంటర్లను కేంద్రంగా చేసుకుని దొంగతనానికి పాల్పడతాడు. క్యాష్ తీసుకుని డిపాజిట్ చేస్తానని చెప్పి నకిలీ మెసేజులు పంపిస్తాడు. ఆ తరువాత డబ్బు తీసుకుని ఉడాయిస్తాడని తెలిపారు. బయట ఎవరైనా క్యాష్ తీసుకుని డిపాజిట్ చేస్తామని చెప్తే నమ్మకండని ప్రజలను హెచ్చరించారు. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు ఎంతో కష్టపడి కేసును పరిష్కరించారని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment