గురుమూర్తి
చిత్తూరు , బి.కొత్తకోట: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఏటీఎం కేంద్రాల వద్ద కాపుకాసి నగదు ఉపసంహరణతో అమాయకులను మోసం చేస్తున్న కర్ణాటక వాసిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం బి.కొత్తకోట ఎస్‌ఐ రాంభూపాల్ కథనం..స్థానిక రంగసముద్రం రోడ్డుకు చెందిన ఎస్.షాహీదా బుధవారం సాయంత్రం తన భర్త ఏటీఎం కార్డు తీసుకుని నగదు కోసం జ్యోతిచౌక్ సమీపంలోని ఏటీఎం కేంద్రానికి వచ్చింది. అక్కడే తచ్ఛాడుతున్న ఓ యువకుడిని నగదు తీసి ఇవ్వమని ఆమె కోరింది.
ఆ యువకుడు ఏటీఎంలో కార్డుపెట్టి, పిన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత నగదు రాలేదని, ఇంకో ఏటీఎంకు వెళ్లమని చెప్పాడు. నిజమే కాబోలని నమ్మిన వాహీదా దిగువ బస్టాండ్‌లోని ఏటీఎం వద్దకు వెళ్తుండగా రూ.4,500 నగదు డ్రా చేసినట్లు సెల్‌ఫోన్‌కు మెస్సేజి రావడంతో ఆమె బిత్తరపోయింది. తనను గుర్తు తెలియని యువకుడు మోసం చేసి డబ్బులు డ్రా చేసినట్టు గ్రహించింది. నేరుగావెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన పోలీసులు ఏటీఎం కేంద్రాల వద్ద నిఘా వేశారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేసేసరికి అతడి బండారం బట్టబయలైంది. అతగాడి పేరు ఎల్.గురుమూర్తి (24). కర్ణాటక రాష్ట్రం చింతామణి తాలూకా యనమలపుడి పంచాయతీ ముస్తురి వాసి అని తేలింది.షాహీదాను మోసం చేయడమే కాకుండా కర్ణాటకలోని హోటకోటలో ఏటీఎంలలో మోసాలకు పాల్బడటంపై అతడిపై రెండు కేసులు నమోదైనట్టు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి గురుమూర్తిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment