
కమలాపూర్: ఏటీఎంలో రూ.వెయ్యి డ్రా చేసేందుకు యత్నిస్తే రూ.2,200 నగదు వచ్చింది. ఇది దావానలంలా వ్యాపించడంతో జనం ఏటీఎం కేంద్రానికి ఎగబడ్డారు. ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో సోమవారం సాయంత్రం జరిగింది. కమలాపూర్‌లోని బస్టాండ్ వద్ద ఉన్న ఇండియా వన్ ఏటీఎం సెంటర్‌లో రూ.వెయ్యి డ్రా చేయాలని యత్నిస్తే రూ.2,200 వచ్చాయి. మళ్లీ యత్నించినా అలా రూ.1,200 ఎక్కువగా రావడం.. రూ.2 వేలకు రూ.4,400, రూ.3 వేలకు రూ.6,600, రూ.4 వేలకు రూ.8,800 చొప్పున వచ్చాయి. ఆ నోటా ఈనోట బయటకు పొక్కడంతో కార్డుదారులు బారులు తీరారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఏటీఎంను మూసేశారు.