World First ATM Machine History And Interesting Facts In Telugu - Sakshi
Sakshi News home page

ATM History: ఏటీఎం పుట్టుక.. ‘ఎనీ టైం మనీ’ గురించి ఈ వివరాలు మీకు తెలుసా?

Published Sat, Jan 1 2022 4:12 PM | Last Updated on Sat, Jan 1 2022 5:03 PM

ATM History World India First ATM Details Interesting Facts - Sakshi

కొత్త ఏడాదిలో మొదటి రోజునే ఆర్బీఐ ఏటీఎం విత్‌డ్రా కొత్త రూల్స్‌ను అమలులోకి తీసుకొచ్చింది. ఉచిత ట్రాన్‌జాక్షన్స్‌ పరిధి గనుక అయిపోతే.. 21రూ. చొప్పున ఛార్జీలు ఖాతాదారుల అకౌంట్ల నుంచి బాదేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఈ విషయం పక్కనపెడితే.. మొట్టమొదటి  ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషిన్‌ అలియాస్‌ ఏటీఎం Automated teller machine ఎక్కడ నెలకొల్పారో తెలుసా?



1987లో హెచ్‌ఎస్‌బీసీ ముంబైలో తొలి ఏటీఎంను నెలకొల్పింది. 

ఆ తర్వాత పన్నెండేళ్లకు దేశవ్యాప్తంగా 1,500 ఏటీఎంలు ఏర్పాటయ్యాయి. 

మార్చ్‌ 31, 2021 నాటికి మన దేశంలో 1,15,605 ఆన్‌సైట్‌ ఏటీఎంలు, 97, 970 ఆఫ్‌సైట్‌ ఏటీఎంలు ఉన్నాయి. 

2021, మార్చ్‌ నెల చివరినాటికి.. మొత్తం బ్యాంకులన్నీ కలిపి 90 కోట్ల డెబిట్‌ కార్డులు కస్టమర్లకు జారీ చేశాయి.

 ఏటీఎంను ఎవరు రూపొందించారనే విషయంపై రకరకాల వాదనలు, థియరీలు, వివిధ దేశాల వెర్షన్‌లు వినిపిస్తుంటాయి. 

► పేటెంట్‌ విషయంలో అమెరికా సహా పలు దేశాలు వాదులాడుకుంటాయి. 

అయితే బ్రిటన్‌ ఆవిష్కరణకర్త జాన్‌ షెపెర్డ్‌ బారోన్‌ ప్రపంచంలో మొట్టమొదటి ఏటీఎంను రూపొందించిన వ్యక్తిగా కీర్తి గడించారు.

1965లో నగదును అందించే స్వీయ సేవ పరికరాన్ని ఈయన ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. 

1967లో నార్త్‌ లండన్‌లోని ‘బార్‌క్లేస్‌ బ్యాంక్‌’ ఎన్‌ఫీల్డ్‌ టౌన్‌ బ్రాంచ్‌ బయట జూన్‌ 27న మొట్టమొదటిసారి ఏటీఎంను ఏర్పాటు చేశారు.

విశేషం ఏంటంటే.. ఆయన పుట్టింది భారత్‌లోనే!. 1925లో మేఘాలయాలో ఓ ఆస్పత్రిలో జన్మించారాయన. 

ప్రతిగా 53 ఏళ్ల తర్వాత ఎస్‌బీఐ బ్యాంక్‌ 2021 ఆగష్టులో ఆయన జన్మించిన ఆస్పత్రిలో ఏటీఎంను ఏర్పాటు చేసింది.  \

అమెరికాలో ఏటీఎం(ఆటోమేటిక్‌ టెల్లర్‌ మెషిన్‌), కెనడాలో ఆటోమేటెడ్‌ బ్యాంకింగ్‌ మెషిన్‌(ABM), బ్రిటిష్‌ నేలపై క్యాష్‌ పాయింట్‌, క్యాష్‌ మెషిన్‌, హోల్‌ ఇన్‌ ది వాల్‌ అని కూడా పిలుస్తుంటారు. 

క్యాష్‌లైన్‌, ఏనీ టైం మనీ, టైమీ మెషిన్‌, క్యాష్‌ డిస్పెన్సర్‌, క్యాష్‌ కార్నర్‌, బ్యాంకోమాట్‌ అని పిలుస్తారు. 

ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్‌ ఆధీనంలో ఉండని వాటిని వైట్‌ లేబుల్‌ ఏటీఎంలు అని పిలుస్తారు. 

2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3.5 మిలియన్ల ఏటీఎంలు ఉన్నట్లు ఏటీఎం ఇండస్ట్రీ అసోషియేషన్‌ వెల్లడించింది. 

అయితే క్యాష్‌లెస్‌ పేమెంట్లు పెరుగుతుండడంతో ఏటీఎంల నిర్వహణ క్రమంగా తగ్గిపోతోంది. 

ఏటీఎంల కంటే ముందు 1960ల్లో కంప్యూటర్‌ లోన్‌ మెషిన్‌ అనే డివైజ్‌ జపాన్‌లో ప్రాచుర్యంలో ఉండేది. 

ఏటీఎంలను ఎక్కడపడితే అక్కడ నెలకొల్పడానికి అనుమతులు ఉన్నాయి. 

క్రూయిజ్‌ షిప్స్‌, యూఎస్‌ నేవీ షిప్స్‌లో కూడా ఏటీఎంలను ఏర్పాటు చేశారు.

 

ఈమధ్యకాలంలో సోలార్‌ పవర్డ్‌ ఏటీఎంలను నెలకొల్పుతున్నారు. 

 ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఏటీఎం పాకిస్థాన్‌ ఖున్‌జెరబ్‌ పాస్‌లో ఉంది.  సుమారు 15వేల అడుగుల ఎత్తులోలున్న ఈ ఏటీఎం.. మైనస్‌ 40 డిగ్రీల సెల్సియస్‌లోనూ పని చేస్తుంది. 

సాధారణంగా ఏటీఎంలకు సెక్యూరిటీ గార్డులు, టెక్నికల్‌ సిబ్బందితో పాటు ఇతర సిబ్బందిని సైతం నియమిస్తుంటారు. శుభ్రం చేయడం, ఇతర మెయింటెనెన్స్‌ ఇందులో భాగంగా ఉండేవి. ఏటీఎంలు నెలకొల్పిన తొలినాళ్లలో ఈ తరహా ఉద్యోగాలు పెరుగుతాయని భావించారంతా. 2010 నాటికి ఆరు లక్షల మందిని ఈ తరహా ఉద్యోగాల్లో నియమించుకున్నారు. కానీ, సెక్యూరిటీ గార్డులకే ఆ పని అప్పగించడం, పైగా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వల్ల ఈ తరహా నియామకాలు గణనీయంగా తగ్గిపోయాయి. 

 

-సాక్షి, వెబ్‌స్పెషల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement