కరోనా వైరస్ ప్రేరిత లాక్‌డౌన్ ప్రభావం కరెన్సీ నోట్లపై పడింది. లాక్‌డౌన్ విధింపు నేపథ్యంలో ఈ ఏప్రిల్‌లో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ సగానికి పైగా తగ్గింది. దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంల నుంచి ఈ ఏప్రిల్‌లో రూ.1.27లక్షల కోట్ల నగదును మాత్రమే ఉపసంహరించుకున్నట్లు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. అంతకు ముందు నెల మార్చిలో ఏటీఎంల ద్వారా రూ.2.51లక్షల కోట్ల ఉపసంహరణ జరిగినట్లు తెలుస్తోంది. మార్చిలో కంటే ఏప్రిల్‌లో పాయింట్ ఆఫ్ సేల్ వద్ద నగదు విత్‌డ్రా వాల్యూమ్స్ స్వల్పంగా పెరిగాయి. ఈ ఏప్రిల్‌లో పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) నుంచి రూ.110 కోట్ల నగదు ఉపసంరణ జరిగినట్లు ఆర్‌బీఐ గణాంకాలు తెలిపాయి. ప్రజలు నిత్యావసర కొనుగోళ్లకు అత్యధికంగా డిజిటల్ చెల్లింపులకే మొగ్గుచూపారు.
- ఏటీఎంల్లో డెబిల్ కార్డుల వినియోగం సైతం సగానికి పైగా పడిపోయింది. ఈ ఏప్రిల్‌లో డెబిట్ కార్డులను ఉపయోగించి రూ.28.52 కోట్లను ఉపసంహరించుకున్నారు. మార్చిలో ఇవే కార్డుల ద్వారా రూ.54.41 కోట్లను విత్‌డ్రా చేసుకున్నారు.
- ఈ ఏప్రిల్ నాటికి దేశంలో మొత్తం 88.68 కోట్ల కార్డులున్నాయి. ఇందులో 82.94 కోట్ల డెబిట్ కార్డులు, 5.73 కోట్ల క్రిడెట్ కార్డులున్నాయి. అంతకుముందు నెల మార్చిలో 88.63 కోట్ల కార్డులున్నాయి.
- ఇదే ఏప్రిల్ నాటికి దేశ వ్యాప్తంగా మీద 2.34లక్షల ఏటీఎంలు, 50.85లక్షల పీఓఎస్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment