ఈ మధ్య మన దగ్గర ఏటీఎంల దొంగతనాలు ఎక్కువయ్యాయి కదా.. అసలు ఏటీఎం అంటే గుర్తుకొచ్చింది.. ఈ ప్రపంచానికే ఏటీఎం రాజధాని ఏమిటో మీకు తెలుసా? దక్షిణ కొరియా.. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం.. అక్కడ ప్రతి లక్ష మందికి 267 ఏటీఎంలు ఉన్నాయి. తర్వాతి స్థానంలో కెనడా ఉంది.. అమెరికాది నాలుగో స్థానం.. ఇంతకీ మన పరిస్థితి ఏంటనేగా మీ డౌటు.. ఇక్కడ ప్రతి లక్ష మందికి 21 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. చెప్పుకోవాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. క్యాష్‌లెస్ పేమెంట్స్ విషయంలోనూ దక్షిణ కొరియావాళ్లే ముందున్నారు.. వాళ్లు నగదు లావాదేవీలకు పెద్దగా మొగ్గు చూపడం లేదని ఇటీవల జరిపిన ఓ సర్వే తేల్చింది.. అదే సమయంలో అక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఏటీఎంలు ఉండటం విశేషం..
Comments
Please login to add a commentAdd a comment