తనపై పోలీసులు కేసు నమోదు చేశారేమోననే భయానికి గురయిన ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అశ్వారావుపేట గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసు సిబ్బంది ధనదాహానికి తమ బిడ్డ బలయ్యాడని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. కానిస్టేబుళ్లు అడిగిన లంచం ఇచ్చామని, అయినా కొట్టారని, ఆ దెబ్బలకు, కేసుకు భయపడి బాలుడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు ఆరోపించారు.