ఏటీఎం సెంటర్‌లో యువతి.. సడన్‌గా ఏమైందో అలా ప్రవర్తించింది! | Viral Video: Girl Dances Withdrawing Money From Atm | Sakshi
Sakshi News home page

Viral Video: ఏటీఎం సెంటర్‌లో యువతి.. సడన్‌గా ఏమైందో అలా ప్రవర్తించింది!

Published Sun, Oct 3 2021 11:22 AM | Last Updated on Sun, Oct 3 2021 2:42 PM

Viral Video: Girl Dances Withdrawing Money From Atm - Sakshi

ఇటీవల సోషల్‌మీడియోలో వీడియోల హవా పెరిగిపోయింది. ముఖ్యంగా పెళ్లికి సంబంధించినవి నెట్టింట ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ఇక కొన్ని వీడియోలైతే అందులోని ఫన్నీ కంటెంట్‌తో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ యువతి ఎటీఎం సెంటర్‌లో చిందేసిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..  ఏటీఎం సెంటర్‌లోకి డబ్బులు విత్‌డ్రా కోసం మాస్క్‌ ధరించి ఓ యువతి వచ్చింది. అయితే అందరిలా డబ్బు తీసుకుని వెళ్లలేదు. హఠాత్తుగా ఏమైందో తెలియదు గానీ అక్కడ ఆ యువతి డ్యాన్స్‌ వేయడం ప్రారంభించి, మాస్‌ స్టెప్పులతో ఇరగదీసింది. కాసేపు గ్యాప్‌ ఇచ్చి డబ్బులు విత్‌డ్రా పెట్టింది.  ఏటీఎం మెషీన్‌ నుంచి డబ్బులు రాగానే లెక్కపెట్టుకుని మరోసారి డ్యాన్స్‌ దులిపేసింది.

చివరగా, ఏటీఎం కేంద్రం నుంచి వెళ్తూ తలవంచి నమస్కారం చేసి వెళ్లిపోయింది. అయితే ఆ యువతి అలా ఎందుకు ప్రవర్తించిందో వివరాలు తెలియదు. ఈ వీడియోను ‘ఘంటా’ అనే యూజర్ ‘ఖుషి దేఖ్ రహే హో సాలరీ కి’ అని టైటిల్‌ పెట్టి నెట్టింట షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి 12 లక్షల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. దీన్ని చూసి.. తన జీవితంలో తొలి సాలరీ అందుకుందేమో, అందుకే అలా చేసిందని కొందరు కామెంట్‌ చేయగా, డ్యాన్స్‌ ఇరగదీసిందని మరికొందరు కామెంట్‌ చేశారు.

చదవండి: Viral: ‘వధువును అవమానించిన వరుడు.. విడిపోవటం మంచిది’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement