వైరల్‌ వీడియో: ఏటీఎంలో అనుకోని అతిథి | Large Snake Filmed Slithering Into ATM | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో చొరబడ్డ భారీ పాము

Published Tue, May 12 2020 11:57 AM | Last Updated on Tue, May 12 2020 12:03 PM

Large Snake Filmed Slithering Into ATM - Sakshi

లక్నో : లాక్‌డౌన్‌ కారణంగా రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారడంతో అడవి జంతువున్నీ జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇటీవల ఓ కోతి ఏటీఎం మెషిన్‌ను ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే అలాంటి మరో ఘటన చోటుకేసుకుంది. అయితే ఈసారి కోతికి బదులు ఓ భారీ పాము ఏకంగా ఏటీఎం మెషిన్‌లోకి చొరబడింది. పామును చూసి డబ్బు డ్రా చేసుకోవడానికి వచ్చిన వారంతా భయాందోళనకు గురయ్యారు. చేసేదేమీ లేక దూరం నుంచి తమ మొబైల్ కెమేరాల్లో బందించారు. అనంతం అటవీశాక అధికారులకు సమాచారం ఇచ్చారు.  ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ ఐసీఐసీఐ ఏటీఎంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా... అదికాస్తా వైరల్‌గా మారింది. వేసవి నేపథ్యంలో ఈ పాము చల్లదనం కోసం ఏటీఎంలోకి దూరి ఉంటుందని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement