సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొనేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏటీఎం ఛార్జీలను మరింత పెంచే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఏటీఎం ట్రాన్సక్షన్‌లో 5వేలు మాత్రమే విత్‌డ్రాకు అవకాశం ఇచ్చేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సమచారం. ఒకవేళ ఇదే అమల్లోకి వస్తే అంతకు మించి విత్ డ్రా చేసుకుంటే అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఇటీవల ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించింది. పలు రకాల ఛార్జీలు పెంచుతూ కమిటీ నివేదికను రూపొందించింది. (వడ్డీమీద వడ్డీనా..?)
ఏటీఎంలల్లో జరిపే అన్ని లావాదేవీలపై ఇంటర్ ఛేంజ్ ఛార్జీలను పెంచాలని సూచించినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలకు ఇది వర్తించేలా చేయాలని ఆర్బీఐని కోరింది. అలాగే 10 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏటీఎం చార్జీలను 24శాతం పెంచాలని నివేదికలో పేర్కొంది. కమిటీ సమర్పించిన రిపోర్టును బ్యాంకు అత్యున్నత స్థాయి అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో కమిటీ నివేదిక అమలుకే రిజర్వ్ బ్యాంక్ మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏటీఎం యూజర్లపై మరింత భారం పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment