కూకట్‌పల్లి పరిధిలోని జయరాంనగర్‌లో గల యాక్సిస్‌బ్యాంక్ ఏటీఎంలో చోరీ జరిగింది.
కూకట్‌పల్లి పరిధిలోని జయరాంనగర్‌లో గల యాక్సిస్‌బ్యాంక్ ఏటీఎంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఏటీఎం మెషిన్‌ను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. మనీ డ్రా చేయడానికి వచ్చిన వారు ఏటీఎం ధ్వంసమైనదని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎంతమొత్తంలో నగదు చోరికి గురైందనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.