నకలీ నోట్లను చలామని చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : నకలీ నోట్లను చలామని చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2. 65 లక్షల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. మోమిన్పేట మండలం సోమ్లానాయక్ తండాకు చెందిన రవీందర్, ప్రకాశ్ ఇద్దరు దొంగ నోట్లు చలామణి చేస్తున్నట్లు పోలీసులకు ఆగంతకులు సమాచారం అందంచారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి వెల్లడించారు.