న్యూఢిల్లీ: ఆర్‌బీఐకు చేరిన పాత రూ.500, రూ.1,000 నోట్లలో నకిలీవి ఎన్ని ఉన్నాయో గుర్తించేందుకు 12 యంత్రాలను ఆర్‌బీఐ అద్దెకు తీసుకోనుంది. పాత నోట్లను ఇంకా లెక్కిస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఇటీవల పార్లమెంటరీ కమిటీకి చెప్పారు. కరెన్సీ నోట్ల తనిఖీ, ప్రాసెసింగ్ కోసం 18 యంత్రాలు అద్దెకు కావాలంటూ మే నెలలో ఆర్‌బీఐ గ్లోబల్ టెండర్లను పిలిచింది. అనంతరం దానిని రద్దు చేసి, 12 యంత్రాల కోసం తాజాగా మరోసారి టెండర్లను ఆహ్వానించింది.
‘పాత’ నకిలీల గుర్తింపునకు 12 యంత్రాలు!
Published Mon, Jul 24 2017 1:46 AM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM
Advertisement