machines
-
యాంత్రీకరణతోనే రైతులకు ఆదాయం
సాక్షి, మచిలీపట్నం/పెనమలూరు: వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను అందుబాటులోకి తెచ్చి రైతులు మంచి ఆదాయం పొందేలా చూస్తామని, పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి పూర్తిన్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరు, కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. గంగూరు రైతు సేవాకేంద్రంలో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పులు జరగకూడదన్నారు. తేమ శాతంలో కచ్చితత్వం ఉండాలని ఆదేశించారు. తేమ శాతం సమస్య పరిష్కరించేందుకు డ్రైయ్యర్లను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే మొబైల్ డ్రైయర్లను పొలాల వద్దే అందుబాటులో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. ఎరువులు, పురుగు మందులు అధిక మోతాదులో వాడొద్దన్నారు. డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయని, మొబైల్ యాప్ ద్వారా పంటలో పురుగుల మందు, ఎరువులు ఎక్కడ వాడాలో తెలుసుకుని డ్రోన్ టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో సమస్య అధిగమించే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ధాన్యం డబ్బును 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. మిల్లర్లు నాణ్యమైన గోనె సంచులు ఇవ్వాలన్నారు. దళారులు లేకుండా రైతులకు న్యాయం చేస్తామని, అవసరమైతే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా.. సాగునీటి కాలువలు మురుగుతో పూడుకుపోయాయని, పంటలకు నీళ్లందటం లేదని రైతులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, టార్పాలిన్లు ఇవ్వాలని కోరారు. రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉంచాలని, గోనె సంచుల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ధాన్యం రవాణాకు వాహనాలు జాప్యం లేకుండా ఏర్పాటు చేయాలని, తమలపాకు తోటలకు సబ్సిడీపై కర్రలు ఇవ్వాలని కోరారు. సెంటు భూమి పోయినా ఇప్పిస్తాం అన్ని హక్కులు ఉండి సెంటు భూమి పోయినా ఇప్పించే బాధ్యత తమదని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈడుపుగల్లులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం భూకబ్జాలతో మొదలుపెట్టి వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేసిందన్నారు. ఇప్పటివరకు 1.57 లక్షల అర్జీలు తనకు వచ్చాయని, రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం 78,854 దరఖాస్తులు, ఇంటి జాగా కోసం 9,830, ల్యాండ్ గ్రాబింగ్ ఫిర్యాదులు 9,528, ప్రభుత్వ భూమి కోసం 8,366 ఆక్రమణలకు సంబంధించి 8,227, అధికారులపై 8 వేలు ఫిర్యాదులు వచ్చాయని సీఎం వివరించారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి, రాజముద్ర ఉండాల్సిన చోట వైఎస్ జగన్ సొంత బొమ్మ వేసుకున్నారన్నారు. ప్రజల్లో ఆందోళన కారణంగా తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసినట్టు చెప్పారు. గతంలో భూమిని కబ్జా చేసినా, 22ఏలో పెట్టినా, భూమి మీది కాదని చెప్పినా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. 6,698 గ్రామాల్లో రీసర్వే చేయగా తప్పుడు సర్వే జరిగిందంటూ దాదాపు 2,79,148 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. -
అందానికి హై ఫ్రీక్వెన్సీ మెషిన్! ఇదొక మంత్రదండంలా..
అందాన్ని అరచేతుల్లో కోరుకునే ఆడవారికి ఈ హై ఫ్రీక్వెన్సీ మెషిన్ ఓ మంత్రదండంలా పని చేస్తుంది. ఇది మచ్చలు, ముడతలు, మొటిమలు, కళ్ల కింద నల్లటి వలయాలు వంటి లోపాలను మాయం చేసేస్తుంది. చర్మాన్ని బిగుతుగా, నవయవ్వనంగా మారుస్తుంది. దీనిలో మూడు ట్యూబ్స్ లభిస్తాయి.వాటిలో రెండు స్కిన్ ట్యూబ్స్ చర్మానికి, ఒక స్కాల్ప్ ట్యూబ్ తలకు అనువుగా ఉంటాయి. ఒక స్కిన్ ట్యూబ్ మృతకణాలను తొలగించి, ముడతలను దూరం చేస్తుంది. మరో స్కిన్ ట్యూబ్ మొటిమలను, వాటి వల్ల ఏర్పడే మచ్చలను మాయం చేస్తుంది. ఇక స్కాల్ప్ ట్యూబ్ హెయిర్ గ్రోత్‌ను పెంచుతుంది. దీని వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరిగి, జుట్టు ఊడటం తగ్గుతుంది.ఈ డివైస్ 90% నియాన్, 10% ఆర్గాన్ తో కూడిన హై ఫ్రీక్వెన్సీ ఫేషియల్ మెషిన్. ఇది అన్ని రకాల చర్మాలకు అనువుగా ఉంటుంది. స్కిన్ కేర్, హెయిర్ కేర్లను కోరుకునే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ఇది చక్కటి బహుమతి అవుతుంది. పైగా దీన్ని వినియోగించడం చాలా తేలిక. దీని ధర 60 డాలర్లు. అంటే నాలుగువేల తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు.ఇవి చదవండి: ప్రస్తుతం ఇంట్లో గోడలకు.. ట్రెండ్‌గా మారిన వాల్‌పేపర్ డిజైన్స్..! -
క్లీనింగ్ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: క్లీనింగ్ యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ప్రారంభించారు. క్యాంప్ ఆఫీసు వద్ద జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మురుగునీరు, చెత్త నిర్మూలన వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. స్వచ్ఛత ఉద్యమి యోజన పథకం కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు100 మురుగు శుద్ది వాహనాలను ఏపీ ప్రభుత్వం అందజేసింది. రేపు నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో సీఎం పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లాలో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి అవుకు రెండో టన్నెల్ వద్దకు చేరుకుని నీటిని విడుదల చేసి.. ఆ టన్నెల్‌ను జాతికి అంకితం చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన అనంతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటారు. సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుంటారు. -
మెషీన్స్‌కూ..మదర్‌టంగ్ కావాలోయ్!
స్కూలు నుంచి కాలేజీ దాకా సెకండ్ లాంగ్వేజ్‌గా ఉండే మాతృభాషను మొక్కుబడిగా చదివేవారే ఎక్కువ. ఆ.. మనకు తెలిసిందే కదా? దీనికి ఎందుకు ఎక్కువ సమయం కేటాయించాలని లైట్ తీసుకుంటుంటారు. కానీ మాతృభాషతో కూడా సాఫ్ట్వేర్ ఇంజినీర్స్లా ఐటీ కంపెనీల్లో పనిచేయవచ్చు. వాళ్లలా డాలర్లు సంపాదించవచ్చని చెబుతోంది రాధి దాట్ల. హిందీ మాత్రమే చదువుకుని అమెరికా వెళ్లిన రాధికి ఒక్క ఉద్యోగం కూడా దొరకలేదు. అయినా నిరాశపడకుండా తనకు తగిన ఉద్యోగాన్ని వెతికి పట్టుకుంది. ఇప్పుడామె ఏకంగా ఏఐ యంత్రాలకే హిందీ నేర్పిస్తోంది. అంతర్జాతీయ హిందీ టీచర్‌గా రాణిస్తోన్న రాధి గురించి ఆమె మాటల్లోనే..... అమ్మా వాళ్లు తెలుగు వాళ్లే. ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో పుట్టాను. నాన్న ఎయిర్ ఫోర్స్‌లో ఉత్తరభారత దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేయడంతో... కేంద్రీయ విద్యాలయాల్లో చదివాను. అలా నా చదువంతా హిందీలోనే సాగింది. రాయ్‌పూర్ నుంచి విశాఖపట్నం వచ్చినప్పటికీ, యూపీ, పంజాబ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు వైజాగ్‌లో ఉండడంతో నా మొదటి భాష హిందీగా మారింది. హిందీ తరువాత తెలుగు, ఇంగ్లీష్ నేర్చుకున్నాను. కానీ హిందీ వచ్చినంతగా ఇంగ్లిష్, తెలుగు రాదు. కెరీర్‌గా అనుకోలేదు... డిగ్రీ వరకు హిందీని ఒక లాంగ్వేజ్‌గా మాత్రమే చూశాను. అయితే హిందీనే కెరీర్‌గా మారుతుందని అప్పుడు అనుకోలేదు. ఆ తరువాత మాస్టర్స్ చేసేటప్పుడు లింగ్విస్టిక్స్ చదివే అవకాశం రావడంతో హైదరాబాద్ యూనివర్శిటీలో హిందీకి అప్లైచేశాను. హిందీ కోర్సు చేసేటప్పుడు హిందీ మీద మక్కువ ఏర్పడింది. దీనికితోడు మా ప్రొఫెసర్ ‘‘నీకు తెలిసిన సబ్జెక్టుని కెరీర్‌గా ఎంచుకో’’ అని సలహా ఇచ్చారు. అప్పుడు నేను హిందీనే కెరీర్‌గా మలుచుకోవాలనుకున్నాను. ఆ తర్వాత పీహెచ్డీ చేస్తోన్న సమయంలో పిట్స్ బర్గ్, క్యాలిఫోర్నియా యూనివర్శిటీ విద్యార్థులు, బయాలజీ, ఎకనమిక్స్ తోపాటు హిందీ నేర్చుకునేవారు. అప్పుడు వారికి హిందీ చెప్పేదాన్ని. అమెరికాలో.. హిందీ ఉద్యోగం 2003లో పెళ్లి అయ్యింది. నా భర్త ఉద్యోగ రీత్యా రెండేళ్ల తరువాత అమెరికా వెళ్లాము. అక్కడ ఉద్యోగం చేద్దామని ఉద్యోగాల కోసం వెతికాను. కానీ ఎక్కడా దొరకలేదు. చాలా మంది అమెరికా వచ్చాక... ఉద్యోగం కోసం కంప్యూటర్ సైన్స్, కోడింగ్, ప్రోగ్రామింగ్‌లు నేర్చుకుంటుంటారు. నేను మాత్రం హిందీ టీచర్‌గా పనిచేసేందుకే ప్రయత్నించాను. అనేక వ్యయప్రయాసల తర్వాత అమెరికాలో బాగా పాపులర్ అయిన ‘బెర్లిట్జ్’ లాంగ్వేజ్ కార్పోరేషన్లో తొలి ఉద్యోగం దొరికింది. అక్కడ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి హిందీ నేర్పించాలి. అలా డిఫెన్స్ వారికి హిందీ నేర్పించాను. ఐదు నెలల బిడ్డను వదిలి... డిఫెన్స్ వాళ్లకు పాఠాలు చెబుతూనే 2008లో జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీకి అప్లై చేసాను. కొన్నాళ్ల తరువాత ఇంటర్వ్యూ కాల్ వచ్చి, హిందీ టీచర్‌గా సెలక్ట్ అయ్యాను. అప్పుడు నాకు ఐదు నెలల బాబు. వాడిని వదిలి వెళ్లాలంటే చాలా కష్టంగా అనిపించింది. ఆయన మేరీలాండ్ యూనివర్శిటీలో రీసెర్చర్‌గా చేసేవారు. ఆయన ఇంటికి వచ్చాక నేను క్లాసులు చెప్పడానికి వెళ్లేదాన్ని. సాయంత్రం ఆరు నుంచి తొమ్మిదిన్నర వరకు క్లాసులు చెప్పేదాన్ని. ఇంట్లో కూర్చుని... యూనివర్శిటీలో తరగతులు చెబుతూ ఫారిన్ సర్వీసెస్‌కు అప్లై చేశాను. వివిధ దేశాల్లో నివసిస్తోన్న అమెరికన్లకు హిందీ నేర్పించడానికి ఆఫర్ వచ్చింది. దీంతో అమెరికా ఫారిన్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ ద్వారా హిందీ బోధించేదాన్ని. కోవిడ్ సమయంలో ఎడ్యుకేషన్ అంతా ఆన్లైన్ అయ్యింది. ఇదే సమయంలో మేరీలాండ్ యూనివర్శిటీ ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి ఆఫర్ ఇవ్వడంతో 2021 నుంచి ఆన్లైన్ క్లాసులు చెబుతున్నాను. ఆ తర్వాత ఐటీ కంపెనీ ఆర్కిల్లో భాషా విభాగంలో పనిచేశాను. అక్కడ హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, మరాఠీ, నేపాలీ భాషలను నేర్పించేవారు. ఆ తరువాత అమేజాన్‌లో సీనియర్ లింగ్విస్ట్గా, యాపిల్ కంపెనీలో హిందీ ప్రాజెక్టులో పనిచేశాను. ఇప్పుడంతా డేటా అన లిస్టు, మెషిన్ లెర్నింగ్ గురించే మాట్లాడుతున్నారు. మెషిన్ లెర్నింగ్ ఒక్క ఇంగ్లిష్‌లోనే లేదు. ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి వస్తోంది. మెషిన్‌కి అన్ని భాషలు తెలియవు. అందువల్ల ప్రతి భాషను మెషిన్‌కు నేర్పించాల్సిందే. అప్పుడు మాత్రమే కోడింగ్ చేయగలరు. కోడింగ్ ద్వారానే అన్నిరకాల యాప్‌లు క్రియేట్ చేస్తారు. ఒక యాప్ తయారవడానికి కచ్చితంగా భాషా నిపుణులు అవసరం. అందుకే సైన్స్, మ్యాథ్స్లకున్న ప్రాముఖ్యత భాషకూ ఉంది. ఇది మనం గ్రహించాలి. ప్రపంచంలో ఇండియా పెద్ద మార్కెట్. చాలా కంపెనీలు మన దేశం వైపు చూస్తున్నాయి. అందువల్ల భవిష్యత్ తరాలకు హిందీతోనే ఎక్కువసంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇంగ్లీష్‌తోపాటు, హిందీ కూడా అవసరమే. ఇంగ్లీష్‌తో పాటు హిందీ కూడా చక్కగా నేర్చుకోండి ఓపికగా వెతికితే మంచి అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి.’’ అని నేటి యువతరానికి రాధి చెబుతోంది. (చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే..ఎవరు తీసుకొచ్చారు?) -
వ్యవసాయం పరిశ్రమగా వర్ధిల్లాలి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధి ల్లాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించా రు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అయోవా రాష్ట్రంలోని లాంగ్ వ్యూ ఫార్మ్ అనే భారీ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. నూతన టెక్నాలజీ వినియోగంలో లాంగ్ వ్యూ ఫార్మ్ వ్యవసాయ క్షేత్రం ఎంతో పురోగతి సాధించింది. జీపీఎస్ ద్వారా ఒక్క సెంటీమీటర్ తేడా లేకుండా విత్తడం, భారీ యంత్రాల సాయంతో దున్నడం నుంచి పంట నూర్పిళ్ల వరకూ పనులు చేయడం, హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా క్రిమి సంహారక మందుల స్ప్రేయింగ్, మొ క్క ఎదుగుదలను ప్రతి దశలో డేటా సేకరించి మానిటర్ చేయడం వంటి వాటిని మంత్రి నేతృత్వంలోని బృందం పరిశీలించింది. లాంగ్ వ్యూ ఫార్మ్ సందర్శించిన బృందానికి సీఈఓ స్టీవ్ హెన్రీ అన్ని వివరాలతో కూడిన ప్రెజెంటేషన్ చేశారు. తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రధానంగా మొక్కజొన్న (కార్న్), సోయాబీన్ పండిస్తామని తెలిపా రు. మేలురకమైన విత్తనాలను కూడా ఉత్పత్తి చేస్తామని, ఆహార ధాన్యాలతో పోలిస్తే విత్తన ఉత్పత్తి వల్ల లాభాలు మూడు రెట్లు ఎక్కువగా వస్తున్నాయని వివరించారు. ప్రపంచస్థాయికి తెలంగాణ వ్యవసాయం: తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని నిరంజన్‌రెడ్డి చెప్పారు. భవిష్యత్ తరాలు వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించే పరిస్థితులు రావాలన్నారు. అమెరికాలో వ్యవసాయ పరిస్థితులు భారతదేశ వ్యవసాయంతో పోలిస్తే కొంత భిన్నమన్నారు. ఇక్కడ భారీ కమతాలు, మానవ వనరుల కొరత వలన పెద్ద ఎత్తున యాంత్రీకరణ అనివార్యమయిందన్నారు. తెలంగాణలో చిన్న కమతాలు ఎక్కువ కాబట్టి భారీ యంత్రాల వినియోగం వ్యక్తిగత స్థాయిలో సాధ్యపడదని అందుకే రైతులు సహకార సమాఖ్యలుగా సంఘటితమై యాంత్రీకరణ ఫలాలు అందుకోవాలని మంత్రి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రైతాంగం కూడా యంత్ర శక్తిని విరివిగా వినియోగించుకోవడానికి అవసరమయ్యే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామన్నారు. అనంతరం ఇల్లినాయిస్ రాష్ట్రం డికెటర్ నగరంలోని అతిపెద్ద ఫార్మ్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. ఆయన వెంట వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ఉన్నారు. -
TTD: డిసెంబరు నాటికి ఆటోమేటిక్ లడ్డూ యంత్రాల ఏర్పాటు
సాక్షి, తిరుపతి: తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల మ్యూజియాన్ని డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనవరి 28న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారని అన్నారు. లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు, టి, కాఫీ, పాలు, అల్పాహారాలు అందించాం. తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభం కానుంది స్పష్టం చేశారు. తిరుమలలో స్వామివారి హుండీ కానుకలు లెక్కించడానికి బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన పరకామణి భవనం నిర్మించామని ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నాం. త్వరలో మరో తేదీ నిర్ణయించి తెలియజేస్తాన్నారు. ‘‘తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోంది. తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్ టెండర్లకు వెళుతున్నాం. ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశాం. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటిదేవస్థానమ్స్ పేరుతో మొబైల్ యాప్‌ను ఇటీవల ప్రారంభించాం’’ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్ చేసుకోవడంతోపాటు విరాళాలు కూడా అందించవచ్చు. పుష్ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చు. ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చునని ధర్మారెడ్డి పేర్కొన్నారు. యువతకు ధార్మిక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో తిరుమల ఆస్థానమండపంలో యువ ధార్మికోత్సవం నిర్వహిస్తాం. దాదాపు 2 వేల మంది యువతీ యువకులు పాల్గొంటారన్నారు. ఫిబ్రవరి 5న రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 18న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహా శివరాత్రి పర్వదినం ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఈఓ పేర్కొన్నారు. జనవరి నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 20.78 లక్షలు కాగా, హుండీ ద్వాతా రూ.123.07 కోట్లు ఆదాయం చేకూరింది. విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.07 కోట్లు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 37.38 లక్షలు, కాగట కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 7.51 లక్షలు. చదవండి: ఏకో ఇండియాతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఎంవోయూ -
ఈ లక్షణాలు ఉన్నాయా?.. ఇలా చేసి నోటి క్యాన్సర్ నుంచి కాపాడుకోండి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రజల ఆరోగ్యంపై జగన్ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. అధునాతన పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చి మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటోంది. పేదలకు ప్రభుత్వాస్పత్రుల్లోనే ఉచితంగా ఖరీదైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోంది. తాజాగా నోటి క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి.. వ్యాధికి చెక్ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది. వైద్యులకు శిక్షణ ఇచ్చిన అనంతరం వెల్‌స్కోప్ మెషీన్లు ఏర్పాటు చేసి క్యాన్సర్ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పొగాకు, పొగాకు మసాలాలతో పాటు బీడీలు, సిగరెట్ తాగుతున్న వారిలో నోటి క్యాన్సర్ తీవ్రమవుతోంది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకుంటున్న క్యాన్సర్ బాధితుల్లో ఆరు శాతం మంది నోటి క్యాన్సర్ (ఓరల్ క్యాన్సర్) వారే ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రోజురోజుకూ దీని తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందే ఓరల్ క్యాన్సర్‌ను పసిగట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీతో నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. ప్రాథమిక క్యాన్సర్ దశకు రాకముందే.. లేదంటే అలాంటి లక్షణాలు కనిపించకముందే క్యాన్సర్ స్థితిని ఓ పరికరం ద్వారా అంచనా వేస్తారు. ఇలాంటి పరికరాలను ఏపీ సర్కారు అందుబాటులోకి తెచ్చింది. చదవండి: సోలో బ్రతుకే సో 'బెటరు' వెల్‌స్కోప్ మెషీన్ ద్వారా పరీక్షలు.. వెల్‌స్కోప్ మెషీన్ అంటేనే ఇదొక అత్యాధునిక వైద్యపరికరం. తరంగ దైర్ఘ్యాల నీలి కాంతిని ప్రేరేపణ చేసి నోటిలో ఉన్న పరిస్థితులను అంచనా వేస్తుంది. క్యాన్సర్ వచ్చే లక్షణాలను ముందే పసిగట్టగలిగే సామర్థ్యం ఉంటుంది. ప్రీ క్యాన్సర్ లక్షణాలే క్యాన్సర్‌కు దారి తీస్తాయి. వాటిని ముందే గ్రహించి చెప్పగలదు. ఇలాంటి వెల్‌స్కోప్ మెషీన్లను వైజాగ్, విజయవాడ, కడపలో ఏర్పాటు చేశారు. కడపలో ఏర్పాటు చేసిన ఈ మెషీన్ పరిధిలో 9 జిల్లాల వైద్యులకు శిక్షణ ఇస్తారు. ఇందులో శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలు ఉన్నాయి. అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో... పీహెచ్సీ వైద్యులకు, దంతవైద్యులకు వెల్‌స్కోప్ మెషీన్ ద్వారా శిక్షణ నిచ్చిన అనంతరం అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోనూ వెల్‌స్కోప్ మెషీన్లు ఏర్పాటు చేస్తారు. మెషీన్ల ఏర్పాటు అనంతరం భారీ స్థాయిలో నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఇలా ముందే లక్షణాలను గుర్తించి చికిత్స చేస్తే వేలాదిమంది ప్రాణాలను కాపాడవచ్చనేది వైద్యుల అభిప్రాయం. ఓ వైపు నిర్ధారణ పరీక్షలు చేస్తూనే అదే ప్రాంతంలో మరోవైపు పొగాకు ఉత్పత్తుల వాడకం నియంత్రణపై కౌన్సెలింగ్ ఇస్తారు. ప్రస్తుతం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వైద్యులకు ఈ మెషీన్ ద్వారా నిర్ధారణ పరీక్షలు ఎలా చేయాలో శిక్షణ ఇస్తున్నారు. క్యాన్సర్ బారినుంచి కాపాడవచ్చు నోటి క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉంది. ముందస్తు లక్షణాలు గుర్తించి చికిత్స అందిస్తే వ్యయభారం తగ్గుతుంది. భవిష్యత్‌లో ఇది అన్ని చోట్లా విస్తరిస్తే మరింతగా లబ్ధి కలుగుతుంది. ముఖ్యంగా పొగాకు వాడకంతో క్యాన్సర్‌కు గురయ్యేవారిని క్యాన్సర్ బారినుంచి కాపాడచ్చు. – డాక్టర్ శ్రీనివాసన్, క్యాన్సర్‌కేర్ నోడల్ ఆఫీసర్ -
అబ్బురం.. వించ్ వే
ఆంధ్ర– ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో వేల అడుగుల ఎత్తులో కొండల మధ్యనున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం చారిత్రాత్మకం. ఇక్కడికి ఉద్యోగులు, కార్మికులు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన వించ్ వేకు ఎంతో ప్రత్యేకత ఉంది. 1948లో ఏర్పాటుచేసిన నిర్మాణం దేశంలోనే మొట్టమొదటిదిగా చెబుతుంటారు. ముంచంగిపుట్టు: మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో అవసరమైన సామగ్రి, యంత్రాలను తరలించేందుకు 2,750 అడుగుల ఎత్తులో వించ్ హౌస్‌ను నిర్మించారు. ఇందుకు అప్పటిలో ప్రభుత్వం రూ.60 లక్షలు వెచ్చించినట్టు అధికారవర్గాలు చెబుతుంటాయి. 1955 ఆగస్టు 19న విద్యుత్ కేంద్రానికి అప్పటి రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్ ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. అప్పటి నుంచి ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది వించ్ ద్వారా చేరుకుంటున్నారు.రెండుకొండల నడుమ లోయలో ఉండే మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి దిగేందుకు 18 నిమిషాలు, పైకి వచ్చేందుకు 13 నిమిషాలు సమయం పడుతోంది. ఆరోజుల్లోనే జీపీఎస్.. వించ్ ఏర్పాటు చేసినప్పుడే రోప్‌వేలో ఎక్కడుందో తెలుసుకునేలా జీపీఎస్‌ను ఏర్పాటు చేయడం విశేషం. వించ్ కదలిక బట్టి జీపీఎస్ సూచిక కదులుతూ ఉంటుంది. వించ్ ఎక్కడుందో సూచించే ముల్లు మలుపుల దగ్గరకు చేరుకోగానే కంట్రోల్‌రూమ్‌లోని డ్రైవర్ వేగాన్ని నియంత్రిస్తుంటారు. గతంలో పర్యాటకులు, సిబ్బంది వించ్‌లో ప్రయాణించేవారు.అప్పుడు అధికారులు పర్యాటకుల వించ్ ప్రయాణానికి అనుమతి ఇచ్చేవారు. సందర్శకుల నిరాశ గత కొన్నేళ్లుగా వించ్ ప్రయాణానికి అనుమతులు ప్రాజెక్టు అధికారులు ఇవ్వడం లేదు. పలు రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు వించ్‌ను చూసి ఆనందపడుతున్నారు తప్ప ప్రమాణించేందుకు అవకాశం లేకపోవడం తీవ్ర నిరాశ చెందుతున్నారు. వించ్ ప్రయాణానికి అధికారులు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. వించ్ ప్రయాణ విషయాన్ని ప్రాజెక్టు ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించగా ప్రాజెక్టు భద్రత దృష్ట్యా, ఉన్నతాధికారుల అదేశాలతో అనుమతులు ఇవ్వడం లేదని తెలిపారు. దేశంలో రెండే.. దేశంలో రెండే రెండు చోట్ల వించ్‌వేలు ఉన్నాయి. ఇక్కడి వించ్‌వే మొదటిది కాగా, రెండోది తమిళనాడు రాష్ట్రంలోని పళని సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రంలో ఉంది. భారీ సామర్థ్యం ఉన్న మోటార్ సాయంతో స్టీల్ రోప్ ద్వారా వించ్‌ని లోయలోకి దించడం, ఎక్కించడం జరుగుతుంది. స్టీల్ రోప్‌ను ప్రతి ఐదేళ్లకోసారి మారుస్తుంటారు. దీనికి సంబంధించిన డ్రైవర్ కంట్రోల్ రూంలో ఉండి వించ్‌ను నడుపుతుంటారు. ట్రాలీగార్డు మలుపుల దగ్గర వించ్ పట్టాలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వించ్ ఏర్పాటు చేసి ఇప్పటికి 74 సంవత్సరాలు అవుతోంది. ఇన్నేళ్లలో కేవలం ఒకే ఒక్కసారి వించ్ అదుపుతప్పిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో సిబ్బంది కేవలం గాయాలతోనే బయటపడ్డారు. -
అక్షయపాత్ర సిద్ధం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం పూట వేడి వేడిగా నాణ్యమైన భోజనం అందించేందుకు ఏర్పాటు చేసిన అధునాతన వంటశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు గంటల్లో 50,000 మందికి భోజనం అందించేలా ఈ వంటశాలను నిర్మించారు. ఈ కేంద్రీకృత వంటశాలను ఆసాంతం పరిశీలించిన సీఎం జగన్.. బటన్ నొక్కి ప్రారంభించారు. హరేకృష్ణ హరేరామ మూమెంట్ నేషనల్ ప్రెసిడెంట్ (బెంగళూరు) మధు పండిట్ దాస్, ఆంధ్రా తెలంగాణా అధ్యక్షుడు సత్యగౌరి చందన దాస్‌లు ఈ వంటశాల పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం అక్కడ ఉన్న పాఠశాల విద్యార్థులను సీఎం ఆప్యాయంగా పలకరిస్తూ.. వారితో గ్రూపు ఫొటో దిగారు. ఈ విద్యార్థులకు ఆయన స్వయంగా వడ్డించడమే కాకుండా, మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకు అందించే చిక్కీలను రుచి చూశారు. ఈ వంటశాలలో తయారైన ఆహార పదార్థాలు వేడి తగ్గకుండా, నాణ్యత దెబ్బతినకుండా వేగంగా పాఠశాలలకు అందించడానికి ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా ఎయిర్ ఇండియా సహకారంతో అక్షయపాత్ర ఫౌండేషన్ ఈ కేంద్రీకృత వంటశాలను (సెంట్రలైజ్డ్ కిచెన్) అభివృద్ధి చేసింది. తిరునామంతో పార, పలుగు పట్టి.. తాడేపల్లి మండలం కొలనుకొండలో ఇస్కాన్ ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంలోనే అతిపెద్ద హరేకృష్ణ గోకుల క్షేత్ర నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేశారు. సుమారు ఆరున్నర ఎకరాలలో జాతీయ రహదారి పక్కన రూ.70 కోట్ల వ్యయంతో ఈ గోకుల క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్షేత్రం కోసం కొలనుకొండలో దేవదాయ శాఖ భూమిని లీజుకు ఇచ్చారు. ఇందులో రాధాకృష్ణ, వెంకటేశ్వరస్వామి ఆలయాలు, కల్చరల్ ఎక్స్పో, సంస్కార హాల్, కృష్ణ లీలాస్, గోశాల, అన్నదానం హాల్, యోగా, ధ్యాన మందిరాలు, ఆశ్రమం, భగవద్గీత మ్యూజియం, యువత కోసం శిక్షణ కేంద్రం నిర్మించనున్నారు. ఈ క్షేత్ర భూమి పూజ కార్యక్రమం కోసం వచ్చిన ముఖ్యమంత్రికి ఇస్కాన్ ప్రతినిధులు నుదుటిపై తిరునామం దిద్ది స్వాగతం పలికారు. భూమి పూజ సందర్భంగా నిర్వహించిన భూ వరాహ స్వామి యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం గోపాలకృష్ణ ఆలయం నిర్మించే చోట గునపంతో మట్టిని తవ్వడం ద్వారా నిర్మాణ పనులను వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన బాల గోపాలకృష్ణుడు, రాధాకృష్ణులకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరేకృష్ణ హరేరామ మూమెంట్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి ఆధ్యాత్మిక గ్రంథాలను కానుకగా అందజేశారు. గుడి నిర్మాణ ఆకృతులు, ఇక్కడ ఏర్పాటు చేసే సౌకర్యాల గురించి వివరించారు. హరేకృష్ణ గోకుల క్షేతం నమూనా చిత్రాలను, శంకుస్థాపన శిలాఫలకాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం దేవదాయ శాఖ రూపొందించిన క్యాలండర్‌ను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు శ్రీరంగనాథరాజు, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు పాల్గొన్నారు. -
ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం.. వరి రైతులకు రాయితీపై వరికోత యంత్రాలు
సాక్షి, అమరావతి: కూలీల కొరతతో వరి రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ సమస్యను అధిగమించేందుకు యాంత్రీకరణను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. అలాగే వరి సాగును మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో వరి కోత యంత్రాల(కంబైన్డ్ హార్వెస్టర్స్)ను అందుబాటులోకి తీసుకురానుంది. డిసెంబర్‌లోగా 500 కేంద్రాలు, మిగిలిన వాటిని వచ్చే ఏడాది మార్చిలోగా అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఏటా వరి విస్తీర్ణంలో దాదాపు 60 శాతం తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే సాగవుతుంది. ఈ జిల్లాల్లో పంట మొత్తం ఒకేసారి కోతకొస్తుండటం, ఆ సమయంలో కూలీలు దొరక్క, సరిపడా వరి కోత యంత్రాల్లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి యంత్రాలను ఎక్కువ మొత్తంలో అద్దె చెల్లించి పంట కోత, నూర్పిడి చేయిస్తున్నారు. దీనివల్ల రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం రైతు సంఘాలను ఏర్పాటు చేసి.. వాటి ఆధ్వర్యంలో కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో కూడిన యంత్ర సేవా కేంద్రాలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది. తద్వారా గ్రామాల్లోనే తక్కువ అద్దెకు యంత్ర పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. 5 యూనిట్లు మండలానికి.. ► ప్రభుత్వం అనుభవం కలిగిన ముగ్గురు రైతులతో ఒక్కో రైతు సంఘాన్ని ఏర్పాటు చేసి వారిని కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో పాటు బేలర్(గడ్డిమోపు యంత్రం) కొనుగోలు చేసేలా ప్రోత్సహించనుంది. వారి ఆధ్వర్యంలోనే ఈ యంత్ర సేవా కేంద్రాన్ని నిర్వహిస్తుంది. ► ఇందుకోసం 40 శాతం రాయితీ ఇస్తుండగా, 50 శాతం బ్యాంకు ద్వారా రుణం అందిస్తుంది. ► మొత్తం నాలుగు జిల్లాల్లో 1,035 క్లస్టర్లలో యంత్ర సేవా కేంద్రాల కోసం ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస యోజన కింద రూ.103.50 కోట్లు కేటాయించింది. ► 3,706 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్న గ్రామాలను ఒక క్లస్టర్‌గా తీసుకుంటుంది. అలాగే మండలానికి ఐదు యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ► రైతులకు రూ.10 లక్షల రాయితీ వస్తుండగా, బ్యాంకు ద్వారా 12.50 లక్షల రుణం మంజూరు చేయనున్నారు. ► మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి నిర్దేశించిన మేరకు యంత్రాల అద్దెలను వసూలు చేయాల్సి ఉంటుంది. యువతకు స్వయం ఉపాధి యంత్ర సేవా కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎంపిక చేసిన యువతకు కంబైన్డ్ హార్వెస్టర్ల డ్రైవింగ్, నిర్వహణ, మరమ్మతులపై వివిధ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ శిక్షణ కేంద్రాల(ఎఫ్‌ఎంటీటీఐ) ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. దీని ద్వారా వారు కంబైన్డ్ హార్వెస్టర్లను నడపడంలో ప్రావీణ్యం పొందనున్నారు. తద్వారా యంత్ర సేవా కేంద్రాలకు అనుబంధంగా స్వయం ఉపాధి సాధించనున్నారు. రైతులకు మేలు వరి ఎక్కువగా పండిస్తున్న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రస్తుతం 640 వరికోత యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పంట కోత సమయంలో డిమాండ్ పెరిగిపోతోంది. పక్క రాష్ట్రాల నుంచి యంత్రాలు తీసుకొస్తున్న రైతులకు ఖర్చు మోయలేని భారం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొస్తున్న యంత్ర సేవా కేంద్రాల ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. – హెచ్.అరుణ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ -
సిటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సిటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లను ప్రారంభించారు. నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రుల్లో సిటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లను సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రులను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో 16 టీచింగ్ ఆస్పత్రులను ఆందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. వీటన్నింటినీ ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..: బోధన ఆస్పత్రులు–డయాగ్నస్టిక్ సేవలు ‘ఈరోజు రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రులలో కేవలం ఏడింటిలో మాత్రమే సీటీ స్కాన్, ఎంఆర్ఐ పరికరాలు ఉన్నాయి. అవి కూడా పీపీపీ పద్ధతిలో ఉన్నాయి. వాటిలో టెక్నాలజీ, క్వాలిటీ అప్‌గ్రెడేషన్ కూడా లేదు. ఈ పరిస్థితి మారాలని పలు చర్యలు తీసుకుంటున్నాము. కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే ఉన్న 11 టీచింగ్ ఆస్పత్రులను నాడు–నేడు కింద అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, కొత్తగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కొత్తగా టీచింగ్ ఆస్పత్రితో పాటు, నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. వాటిలో టాప్ ఆఫ్ ది లైన్ డయాగ్నస్టిక్ సర్వీసులు అందించే దృక్పథంతో అడుగులు వేస్తున్నాము’. ఆరోగ్యశ్రీ కింద సేవలు ‘టీచింగ్ ఆస్పత్రులలో ఆ సదుపాయాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి, పథకం లబ్ధిదారులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తాము. ఆ విధంగా డయాగ్నస్టిక్ సేవలు అందిస్తాము. మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్టు వాటి నిర్వహణ వ్యయం భరిస్తుంది. ఆ విధంగా రాబోయే రోజుల్లో అప్‌గ్రేడ్‌తో ఆ పరికరాలు, నిరంతరం బాగా పని చేసేలా చర్యలు చేపడుతున్నాము’. జాతీయస్థాయి ప్రమాణాలతో.. ‘నాడు–నేడులో ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాము. ఆస్పత్రులను జాతీయస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాము. ఇప్పుడు రూ.67 కోట్ల వ్యయంతో శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలో సీటీ స్కాన్లు, కడప మినహా మూడు చోట్ల ఎంఆర్ఐ పరికరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి మూడేళ్ల వారంటీ ఉంది. మరో ఏడేళ్లు సర్వీసు బాధ్యతను ఆ కంపెనీలు నిర్వహిస్తాయి. ఏ పేదవాడికైనా ఉచితంగా సేవలందించేలా, ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రులలో అన్ని సదుపాయాల ఏర్పాటు చేస్తాం’. మిగిలిన ఏడింటిలో కూడా ‘రాష్ట్రంలోని 11 టీచింగ్ ఆస్పత్రులలో నాలుగు చోట్ల సీటీ స్కాన్, ఎంఆర్ఐ పరికరాలు లేవు కాబట్టి ఇప్పుడు శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలో ఏర్పాటు చేస్తున్నాము. మిగిలిన ఏడు చోట్ల ఆ సదుపాయాలు పిపిపి విధానంలో ఉన్నాయి. కాబట్టివాటిని ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేస్తుంది. ఇంకా కొత్తగా ఏర్పాటు చేసే 16 టీచింగ్ ఆస్పత్రులలో కూడా ఈ సదుపాయాలన్నీ కల్పిస్తాము’. వారి సేవలకు వందనం ‘ఈ కోవిడ్ సంక్షోభంలో ప్రతి ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బందితో పాటు, గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు. వలంటీర్లు పగలు రాత్రి కష్టపడుతున్నారు. ప్రజలకు సేవలందిస్తున్నారు. వీరి సేవల గురించి ఎంత పొగిడినా తక్కువే. కోవిడ్ సమయంలో ఎంతో మంచి సేవలందిస్తున్న మీ అందరికీ మా అభినందనలు’. ఆగ్రహం వద్దు ‘ఈ సందర్భంగా కలెక్టర్లు, జేసీలు, డీహెచ్‌ఎంఓలకు కొన్ని సూచనలు. ఫీవర్ సర్వే కొన్ని చోట్ల అనుకున్న విధంగా జరగలేదని కొందరు అధికారులు దిగువ స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారని నా దృష్టికి వచ్చింది. కరోనా మహమ్మారితో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడిలో ఉన్నారని అందరూ గుర్తుంచుకోవాలి. అందుకే అధికారులంతా మంచితనంతో తమ సిబ్బందితో పని చేయించుకోవాలని కోరుతున్నాను’. నా విజ్ఞప్తి ‘మీ అందరికీ నా తరపున ఒక విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిళ్లలో పని చేస్తున్నారు. కాబట్టి కింది వారికి నచ్చ చెప్పి పని చేయించుకోండి. ఆగ్రహిస్తే వచ్చేదేమీ లేదు. ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, వార్డుబాయ్స్, చివరకు శానిటేషన్ సిబ్బంది.. ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడి మధ్య పని చేస్తున్నారు. నా దగ్గర నుంచి పారిశుద్ధ్య కార్మికుడి వరకు కోవిడ్ వల్ల ఎదురయ్యే అనూహ్య పరిస్థితులను ఎదుర్కునే ఒత్తిడిలో ఉన్నారు’. అందుకే సాధ్యమైంది ‘ప్రతి రోజూ 20 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. నిజానికి అందరూ చాలా బాగా పని చేస్తున్నారు. అందుకే మన దగ్గర టయర్–1 సిటీ, ఆ స్థాయిలో ఆస్పత్రులు లేకపోయినా, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. మీరంతా ఆస్పత్రుల్లో బా«ధ్యతను తీసుకోవడమే కాకుండా, ఎంత ఒత్తిడి ఉన్నా చిరునవ్వుతో పని చేస్తున్నారు కాబట్టే ఇది సా«ధ్యమైంది. అదే విధంగా కోవిడ్‌ను కూడా ఎదుర్కోగలుగుతున్నాము. కాబట్టి ఎవ్వరూ సహనం కోల్పోవద్దు. అధికారులు మంచితనంతో పని చేయించుకోవాలని కోరుతున్నాను’డ అని విజ్ఞప్తి చేసిన సీఎం జగన్ ఈ మంచి కార్యక్రమంతో ప్రజలకు ఇంకా మేలు జరగాలని మనసారా కోరుకుంటున్నానంటూ ప్రసంగం ముగించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: 100కు పైగా ఆక్వా హబ్‌లు -
చెరకు రసం వ్యాపారం: రైతులకు లాభాల తీపి..
సాక్షి, అమరావతి: పండించిన పంటను రైతే నేరుగా వినియోగదారుడికి అమ్ముకోగలిగితే అధిక ఆదాయం పొందవచ్చు. రాష్ట్రంలో విస్తరిస్తున్న చెరకు రసం వ్యాపారం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 265 మంది వరకు రైతులు తాము పండించిన చెరకు నుంచి రసం తీసి విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య ధర ఉన్న అధునాతన చెరకు రసం యంత్రాలు అందుబాటులోకి రావడంతో చిన్న, సన్నకారు రైతులు అనేక మంది ఈ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. చెరకు ధర బాగా పతనమైన దశలో చేపట్టిన ఈ వ్యాపారం లాభసాటిగా ఉందని రైతులు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన రైతు వీరారెడ్డి, నెల్లూరుకు చెందిన మరో రైతు రామమోహన్‌రెడ్డి చెప్పారు. ఈ వ్యాపారం రైతులకు ఏటీఎం తరహాలో నిత్యం ఆదాయాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. నాబార్డు రుణం పొందవచ్చు నాబార్డ్‌లోని నాబ్–కిసాన్ విభాగం వ్యక్తుల జీవనోపాధి, ఆదాయ పెంపు కార్యకలాపాలకు రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవోలు) ద్వారా రుణం ఇస్తుంది. ఎఫ్‌పీవోలో ఉండే మూలధనానికి ఐదు రెట్ల రుణాన్ని ఎటువంటి పూచీకత్తు లేకుండా ఇస్తుంది. సక్రమ చెల్లింపుల అనంతరం వడ్డీ రాయితీ కూడా వర్తింప చేస్తుంది. వ్యక్తులకు నేరుగా నాబార్డు రుణం ఇవ్వదని నాబార్డు ఏపీ సీజీఎం సుధీర్‌కుమార్ చెప్పారు. ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ చిరు వ్యాపారులకు 35 శాతం సబ్సిడీపై రుణాలు ఇస్తోంది. యంత్రం ఎలా పని చేస్తుందంటే.. ఆధునిక చెరకు రసం తీసే యంత్రం ఏటీఎం మెషిన్ తరహాలో ఉంటుంది. చెరకు ముక్కల్ని ఉంచితే గ్లాస్‌లోకి రసం వస్తుంది. నిమ్మకాయ, అల్లాన్ని కూడా మెషిన్లోనే కలిపి ఇవ్వొచ్చు. టన్ను చెరకు నుంచి 500 లీటర్ల వరకు రసాన్ని తీయొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లీటర్ రూ.60 నుంచి రూ.80 వరకు అమ్ముతున్నారు. రైతులే ఈ వ్యాపారంలోకి దిగితే దాన్ని రూ.50కి అమ్మినా 500 లీటర్లకు రూ.25 వేల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో ఖర్చులు పోగా టన్ను చెరకుకు నికరంగా రూ.17 వేల నుంచి రూ.18 వేలు మిగులుతాయి. ప్రస్తుతం టన్ను చెరకును రూ.7 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. చదవండి: ‘యానాం’ రైతులకూ ‘వైఎస్సార్ రైతు భరోసా’ ఆవాల సాగు.. లాభాలు బాగు -
వారెవ్వా గోరేమియా..!
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు... మహాపురుషులవుతారు.. అన్నాడో సినీ కవి.. దానిని నిజం చేశాడు చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన మహ్మద్ గోరేమియా. నేటి సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందాలంటే చదువు, ఉద్యోగం, రాజకీయం, డబ్బు ఇలాంటి అంశాల్లో తమ ఉంటేనే ప్రత్యేకతను చాటుకుంటారు. పై అంశాలు ఏమీ తన వద్ద లేకున్నా తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని చాటుకున్నాడో సాధారణ మెకానిక్. తాను చదివింది కేవలం 9వ తరగతే అయినా పనికిరాని పాత సామగ్రితో నూతన యంత్రాల ఆవిష్కరణలు చేస్తున్నాడు. ప్రధానంగా వ్యవసాయ రంగానికి తోడుగా ఉండాలని నిరంతరం ఏదో ఒక యంత్రం, పనిముట్లు సాధారణ ధరల్లోనే తయారు చేస్తూ ఓరా అనిపిస్తున్నాడు. గ్రామీణ ఇంజనీర్‌గా పిలువబడుతున్న మహ్మద్ గోరేమియాపై ప్రత్యేక కథనం. సాక్షి చౌటుప్పల్(నల్గొండ): చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన గోరేమియా కుటుంబం చాలా సంవత్సరాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో నివాసం ఉంది. గోరేమియా తండ్రి వ్యవసాయశాఖలో ఉద్యోగం చేస్తుండగా ఆ రాష్ట్రానికి బదిలీ కావడంతో అక్కడకు వెళ్లారు. సుమారు 18ఏళ్ల క్రితం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. తన ముగ్గురు సోదరుల్లో అందరూ మెకానిక్ వృత్తిలోనే ఉన్నారు. సోదరులంతా హైదరాబాద్‌లో ఉంటుండగా గోరేమియా తన భార్యాపిల్లలతో లక్కారంలోనే నివాసం ఉంటున్నాడు. వినూత్నంగా యంత్రాలు, పనిముట్ల తయారీ.. జీవనోపాధి కోసం మెకానిక్‌గా ఉన్నప్పటికీ అందులో తనకు తృష్తి లేకపోవడంతో ఇంకా ఏదో సాధించాలని తపించేవాడు. అందులో భాగంగా వ్యవసాయ రంగంలో వినియోగించే యంత్రాలు, పనిముట్లు తయారు చేయాలని భావించాడు. ఆ క్రమంలో పొలం దున్నేందుకు, కలుపు తీసేందుకుగాను మినీ ట్రాక్టర్లు, మెట్ట పంటలకుగాను బైక్తోగుంటుక, కూరగాయల సాగులో కలుపు తీసేందుకు యంత్రాలు, వరి, గడ్డి కోసేందుకు కోత మిషన్లు, దూర ప్రాంతాల నుంచి నీటిని తీసుకువచ్చేందుకు వినూత్న మోటార్లు తయారు చేశాడు. చాలా లోతులో ఉన్న బోరుబావుల్లో మోటార్లు చెడిపోయినప్పుడు, పడిపోయినప్పుడు బయటకు తీసేందుకు ప్రత్యేక యంత్రం, తోటల్లో మొక్కలు నాటేందుకుగాను గుంతలు తీసేందుకు, స్తంభాలు నిలబెట్టేందుకుగాను ప్రత్యేక పరికరాన్ని రూపొందించాడు. ప్రస్తుతం మ్యాగ్నటిక్‌తో పని చేయించే పనిలో ఉన్నాడు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు.. గోరేమియా రూపొందించిన నూతన యంత్రాలు, పని ముట్లకు స్థానిక గ్రామాలతోపాటు వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ధర తక్కువ ఉండడం, పని తీరు, సామర్థ్యం మార్కెట్లో లభించే యంత్రాలతో సమానంగా ఉండడంతో రైతులు కొనుగోలుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు రంగారెడ్డి, వరంగల్, మెదక్, హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సైతం తన యంత్రాలను ఎగుమతి చేస్తుంటాడు. రైతులు ముందస్తుగా ఆర్డర్ ఇవ్వకపోకపోయినా, తన వద్ద స్టాక్ ఉండేలా చూసుకుంటున్నాడు. దూర ప్రాంతాలకు నీటిని తరలించేందుకు ఎయిర్‌కూల్డ్ ఇంజన్.. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోరు, బావి, కాలువలు, చెరువుల నుంచి నీటిని ఇతర మార్గాల ద్వారా తమ వ్యవసాయ పొలాల వద్దకు తరలించాలంటే రైతులకు చాలా ఇబ్బందే. అలాంటి రైతుల కోసం ఎయిర్‌కూల్డ్ మోటారును తయారు చేశాడు. దీనిని రేడియేటర్ లేకుండా రూపొందించాడు. ఇది డీజిల్, కిరోసిన్‌తో నడుస్తుంది. ఒక లీటరు గంటన్నర సమయానికి పని చేస్తుంది. ఈ యంత్రం బహిరంగ మార్కెట్లో రూ. 20–25వేల వరకు విక్రయిస్తుండగా ఇతను రూ. 10వేలకే విక్రయిస్తున్నాడు. తక్కువ ధరలకే గడ్డికోత యంత్రాలు.. రైతులకు అందుబాటులో ఉండే విధంగా వరి, పశువుల గడ్డి కోత యంత్రాన్ని తయారు చేశాడు. ఒకే యంత్రం రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఈ సెట్ షోరూంలల్లో రూ. 60వేలు ఉండగా ఇతను రూ. 18వేలల్లో రైతులకు అందుబాటులో ఉంచాడు. ఎకరన్నర పొలంలోని గడ్డిని గంట సేపట్లో కోస్తుంది. పొలం దున్నేందుకు మినీ ట్రాక్టర్.. చిన్న, సన్నకారు రైతుల కోసం మినీట్రాక్టర్ను తయారు చేశాడు. భారీ వాహనాలు నడిపిన అనుభవం లేని వ్యక్తులు సైతం దీన్ని నడుపవచ్చు. బురద, మెట్టు పొలాల్లో పని చేస్తుంది. బురదలో అలాయ్‌వీల్స్ వేయాల్సి ఉంటుంది. ఇదే ట్రాక్టర్ ద్వారా తోటలు, కూరగాయల సా గుల్లో మందు రసాయనాలు స్ప్రే చేయవచ్చు. ద్విచక్రవాహనంతో గుంటుక యంత్రం మెట్టపంటల్లో కలుపు తీసేందుకు ద్విచక్రవాహనంతో సరికొత్తగా గుంటుకను తయారు చేశాడు. తన వద్ద ఉన్న వాహనానికి గుంటుకను అమర్చాడు. లీటరు డీజిల్‌తో సుమారు రెండు గంటలసేపు పని చేస్తుంది. ఇది రూ. 40వేలకే అందిస్తున్నాడు. వినూత్న పరికరాల తయారీ నేర్చుకున్న ఎనిమిదేళ్లుగా ఇక్కడ పని చేస్తున్నా. వినూత్న యంత్రాలు, పనిముట్ల తయారీ నేర్చుకున్నా. ఇక్కడ తయారయ్యే యంత్ర సామగ్రిని ఎంతో మంది మెచ్చుకుంటారు. రైతులు ఇక్కడికే వచ్చి కొనుగోలు చేస్తుంటారు. – కరంటోతు కృష్ణ, చిల్లాపురం ప్రభుత్వం ప్రోత్సహించాలి వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే రైతాంగం కోసం ఏదో చేయాలని అనుకున్నా. అందులో భా గంగానే ఇవన్నీ తయారు చేస్తున్నా. ప్రభుత్వం రైతులకు ప్రతి కొనుగోలుపై సబ్సిడీ అందివ్వాలి. నా లాంటి వారిని ప్రోత్సహించాలి. – గోరేమియా, యంత్రాల తయారీదారుడు -
ప్లాస్టిక్ బాటిల్ వేస్తే ముక్కలే
సాక్షి, కాజీపేట : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ మేరకు కేంద్రప్రభుత్వం రైల్వే స్టేషన్లలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు చేపడుతోంది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ రైల్, స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తోంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్‌ను క్రమక్రమంగా నిర్మూలించేందుకు కృషి జరుగుతోంది. ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్పరిణామాలు, నష్టాల గురించి విస్తృత ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లలో ఇటీవల ‘బాటిల్ క్రషింగ్ మిషన్’లను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు ఈ మిషన్లు పని చేస్తాయి. అలవాటు చేసేందుకు.. రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన యంత్రాల వాడకాన్ని ప్రయాణికులకు అలవాటు చేసేందుకు రైల్వే అధికారులు కృషి చేస్తున్నారు. పూణే రైల్వే స్టేషన్లో ఏర్పాటుచేసిన ఈ యంత్రంలో బాటిల్ వేసినట్లయితే పేటీఎం ద్వారా రూ.5 జమ అవుతున్నాయి. ఇదే విధాన్ని అన్ని స్టేషన్లలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ప్లాస్టిక్ వల్ల అనర్థాలపై ప్రజలకు అవగాహన కలుగుతున్నందున చాలా మంది రైల్వే స్టేషన్లలోని యంత్రాల్లో ఈ బాటిళ్లు వేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడే.. నిత్యం రైళ్ల ద్వారా వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈక్రమంలో తాము నీళ్లు తాగిన ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడవేస్తున్నారు. దీంతో చెత్త గుట్టలుగా పేరుకుపోతుంది. దీనిని నివారించేందుకు రైల్వే స్టేషన్లలో బాటిల్ క్రషింగ్ యంత్రాలు ఏర్పాటుచేశారు. ఎవరైనా తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ బాటిల్‌ను ఇందులో వేస్తే బాటిల్ చూరచూర అవుతుంది. తద్వారా చెత్త పేరుకుపోదని భావిస్తున్నారు. ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు, కప్పులు, గ్లాస్లు, ప్లేట్లు ఇతర ప్లాస్టిక్ వస్తువులను ఈ యంత్రంలో వేస్తే కింది భాగానికి చేరి చిన్నచిన్న ప్లాస్టిక్ ముక్కలుగా మారుతోంది. ఆ ముక్కలను ప్లాస్టిక్ వ్యర్థాలు కరగదీసే ఫ్యాక్టరీకి పంపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. బాటిల్ క్రషింగ్ యంత్రాలకు ఏర్పాటుచేసిన స్క్రీన్ ద్వారా ప్లాస్టిక్ వల్ల అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ స్క్రీన్‌పై ఆడియో, వీడియో చిత్రాలు ప్రదర్శితమవుతుంటాయి. ప్లాస్టిక్ వస్తువులను ఏ విధంగా వేయాలి, వేసిన ప్లాస్టిక్ వస్తువులు ఏమైవుతున్నాయి, ప్లాస్టిక్ పేరుకుపోవడం వల్ల వచ్చే అనర్థాలు, ప్లాస్టిక్‌తో దేశ భవిష్యత్‌కు ఉన్న ముప్పు వివరాలను ఇంగ్లిష్ భాషలో వివరిస్తుంటారు. -
చార్మినార్‌కు స్కానింగ్
సాక్షి, హైదరాబాద్: చారిత్రక చార్మినార్‌కు భారీగా సూక్ష్మపగుళ్లు.. పై‘పెచ్చు’నిర్లక్ష్యం.. వెరసి కాలుష్యం బారి నుంచి ఆ కట్టడానికి రక్షణ కరువైంది. నాలుగు రోజులక్రితం మక్కా మసీదు వైపు ఉన్న మినార్ నుంచి పెద్ద పెచ్చు ఊడి పడేందుకు భారీగా ఏర్పడ్డ సూక్ష్మపగుళ్లే కారణమని నిపుణులు నిర్ధారించారు. ఇటీవల భారీ వర్షాలు కురిసినప్పుడు సూక్ష్మపగుళ్ల నుంచి నీళ్లు లోనికి చేరి ఆ భాగం ఒక్కసారిగా బరువెక్కి కట్టడం నుంచి ఊడిపోయిందని ప్రాథమికంగా కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం(ఏఎస్ఐ) నిపుణులు గుర్తించారు. మరికొద్ది రోజుల్లో వానాకాలం మొదలవుతున్నందున, కట్టడం మిగతా ప్రాంతాల్లో పగుళ్లుంటే వాననీళ్లు లోనికి చేరి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆ పగుళ్ల తీవ్రతను గుర్తించేందుకు చార్మినార్‌ను ఇన్ఫ్రారెడ్ థెర్మోగ్రఫీ పరికరంతో అణువణువూ స్కాన్ చేయాలని ఏఎస్ఐ నిర్ణయించింది. తొలిసారి టాప్ టూ బాటమ్ స్కాన్ చేసి చార్మినార్‌పై ఉన్న పగుళ్లను గుర్తించి వెంటనే మరమ్మతు చేయాలని నిర్ణయించారు. థెర్మోగ్రఫీతో పగుళ్ల జాడలు... ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాల వయసున్న కట్టడాలకు థెర్మోగ్రఫీ యంత్రంతో స్కాన్ చేసి ముందస్తుగా ప్రమాదాన్ని పసిగట్టి ధ్వంసం కాకుండా జాగ్రత్తపడుతున్నారు. మనదేశంలో కేవలం తాజ్‌మహల్ లాంటి కొన్ని కట్టడాలకే దాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పటివరకు చార్మినార్‌ను దానితో స్కాన్ చేయలేదు. వాతావరణ ప్రభావంతో పెద్ద పెచ్చులూడి కిందపడ్డ నేపథ్యంలో ఇక అలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయని, ఇది క్రమంగా కట్టడం ప్రధాన నిర్మాణానికి కూడా ప్రమాదకరంగా మారుతుందని అధికారులంటున్నారు. పెచ్చు ఊడిపడ్డ తర్వాత ఏఎస్ఐ జాయింట్ డైరక్టర్ (కన్జర్వేషన్) జాన్‌విజ్ శర్మ వచ్చి కట్టడాన్ని పరిశీలించారు. పెచ్చు ఊడిపడ్డ ప్రాంతంలో కెమెరాతో ఫొటోలు తీసి పరిశీలించారు. మినార్‌పై గోటితో గట్టిగా గిల్లితే సున్నం ఊడొస్తుందని గుర్తించారు. అదే దిగువ భాగంగా గోటితో ఎంత గట్టిగా గిల్లినా సున్నం రాలటం లేదు. దీంతో పైభాగానికి వెంటనే ప్రత్యేక చర్యలు అవసరమని ఆయన తేల్చి మొత్తం కట్టడాన్ని ఇన్ఫ్రారెడ్ థెర్మోగ్రఫీతో స్కాన్ చేయాలని సిఫారసు చేశారు. ఆ పరికరాన్ని ఢిల్లీ నుంచి తెప్పించి వానాకాలం వచ్చే లోపు స్కాన్ చేసి అవసరమైన చోట్ల వెంటనే మరమ్మతు చేయాలని నిర్ణయించారు. పైభాగం ప్రమాదకరం... చార్మినార్ ప్రధాన కట్టడం రాతితో నిర్మించారు. దానిపై 40 సెంటీమీటర్ల మందంతో డంగు సున్నం, కరక్కాయ, రాతిపొడి, నల్లబెల్లం, గుడ్డు సొన తదితర పదార్థాల మిశ్రమంతో పూతపూసి నగిషీలద్దారు. దీనిపై మళ్లీ ప్రత్యేక పూత ఉంటుంది. అది నీటిని పీల్చకుండా కోట్ లాగా ఉపయోగపడుతుంది. చార్మినార్ చుట్టూ కొన్ని దశాబ్దాలుగా వాహనాలు అతి చేరువగా తిరుగుతూ ఆ ప్రాంతంలో విపరీతమైన కలుషితాలను నింపేశాయి. దీంతోపాటు వాతావరణంలో పేరుకుపోయిన ధూళి కణాలు కట్టడంపై తేమతో కలిసి క్రమంగా సన్నటి పొరలాగా పేరుకున్నాయి. వాటి వల్లే కట్టడం పైభాగం లేత గోధుమరంగులోకి మారింది. ఇది కట్టడానికి రక్షణగా ఉన్న పైపూతను క్రమంగా ధ్వంసం చేస్తూ వచ్చింది. వాతావరణానికి ఎక్కువగా ప్రభావితమయ్యే చార్మినార్ పైభాగంలో ఈ నష్టం ఎక్కువగా ఉందని తాజాగా గుర్తించారు. వాహనాలు, సమీపంలో భారీ యంత్రాలతో పని తదితరాల వల్ల వచ్చిన తరంగాలు అక్కడ పగుళ్లకు కారణమయ్యాయని ప్రాథమికంగా తేల్చారు. పైపూత తొలగి సన్నటి పగుళ్లేర్పడటంతో తేమను అతి సులభంగా డంగు సున్నం పీల్చుకుంది. వాన నీటిని ఎక్కువగా పీల్చుకుని ఆ భాగం రెండింతల బరువెక్కింది. మినార్లకు భారీ నగిషీలు కనిపిస్తాయి. ఆ భాగంలో సున్నం బరువెక్కి కట్టడం నుంచి విడిపోయి తాజాగా కిందపడిందని గుర్తించారు. ఇప్పుడు ఈ ప్రమాదం ఇంకా ఎక్కడెక్కడ పొంచి ఉందనే విషయాన్ని వెంటనే గుర్తించాల్సి ఉంది. వర్షాకాలం ముగిసేవరకు చార్మినార్ చేరువలో భారీ యంత్రాలతో పనులు చేయించకుండా చూడాలని అధికారులు నిర్ణయించి విషయాన్ని జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకెళ్లారు. -
ముగ్గురిని బలిగొంది..
సాక్షి, నాగర్‌కర్నూల్ రూరల్: మండలంలోని నల్లవెల్లిలో వేరుశనగ నూర్పిడి యంత్రం కిందపడి ముగ్గురు కూలీలు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ భగవంత్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బిజినేపల్లి మండలం లింగసానిపల్లి వెంకట్‌రెడ్డికి చెందిన వేరుశనగ నూర్పిడి యంత్రం మండలంలోని నల్లవెల్లిలో వేరుశనగ చెత్తను నూర్పిడి చేసేందుకు బుధవారం గ్రామానికి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ రైతు ఆంజనేయులు పొలంలో వేరుశనగ పంటను నూర్పిడి చేసేందుకు వెళ్లారు. సాయంత్రం వరకు పనిపూర్తి చేసి యంత్రం వెంబడి వెళ్లిన కూలీలను తీసుకొని వస్తుండగా కేఎల్ఐ సబ్‌కెనాల్ వద్ద చిన్నపాటి గుంత రావడంతో నూర్పిడి యంత్రం ఒక వైపు ఒరిగి అటువైపుగా ఉన్న నలుగురు కూలీలు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో లింగసానిపల్లికి చెందిన గడ్డమీది జయమ్మ(35), పరకాల బాలరాం (50), శాంతమ్మ (35) నూర్పిడి యంత్రం కింద మృతిచెందారు. బోనాసి సత్యమ్మకు కాలు విరిగి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆ సందర్భంలో మరోవైపు వున్న ఆరుగురు కూలీలకు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. విషయం తెలుసుకున్న నల్లవెల్లి గ్రామస్తులు ప్రమాదసంఘటన స్థలానికి చేరుకుని నూర్పిడి యంత్రం కిందపడి మృతిచెందిన మృతదేహాలను బయటకు తీసి జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్దలానికి చేరుకుని ప్రమాద సంఘటనపై విచారణ చేస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ భగవంత్‌రెడ్డి తెలిపారు. -
గాలిలో నుంచి నీరు – యంత్రానికి రూ.10 కోట్ల బహుమతి!
గాలిలోని తేమను నీరుగా మార్చే యంత్రానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. భూతాపోన్నతి నేపథ్యంలో భవిష్యత్తులో గుక్కెడు నీరు కూడా దక్కదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్‌ప్రైజ్ సంస్థ కొన్నేళ్ల క్రితం ఓ పోటీ పెట్టింది. గాలిలో ఉండే తేమను నీటిగా మార్చడం మాత్రమే కాకుండా, రోజుకు కనీసం రెండు వేల లీటర్ల నీళ్లు ఉత్పత్తి చేయాలన్నది పోటీలోని ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా.. పెట్రోలు, డీజిల్ లాంటి సంప్రదాయ ఇంధన వనరులను వాడకుండా ఈ పని సాధించాలి. లీటర్ నీటికి రెండు రూపాయల కంటే ఎక్కువ ఖర్చవకూడదు కూడా. ఈ నేపథ్యంలో ‘సమృద్ధిగా నీరు’ పేరుతో మొదలైన ఈ పోటీలో మొత్తం 25 దేశాల నుంచి 98 బృందాలు పాల్గొన్నాయి. ఏడాది క్రితం కొంతమంది ఫైనలిస్టులను ఎంపిక చేయగా.. గత నెలలో మొత్తం ఐదుగురు ఫైనలిస్టుల్లో ఇద్దరిని నమూనా యంత్రం తయారుచేసి చూపాల్సిందిగా ఎక్స్‌ప్రైజ్ ఫౌండేషన్ కోరింది. చివరకు అమెరికాలోని లాస్ ఏంజెలిస్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైవాటర్ అలయన్స్ ఈ పోటీలో మొదటి బహుమతి సాధించింది. రెండో స్థానంలో హవాయికి చెందిన జేఎంసీసీ వింగ్ నిలిచింది. మొదటి బహుమతిగా పది కోట్ల రూపాయలు లభించగా, రెండో బహుమతి కింద కోటి రూపాయలు దక్కాయి. -
‘పాత’ నకిలీల గుర్తింపునకు 12 యంత్రాలు!
న్యూఢిల్లీ: ఆర్బీఐకు చేరిన పాత రూ.500, రూ.1,000 నోట్లలో నకిలీవి ఎన్ని ఉన్నాయో గుర్తించేందుకు 12 యంత్రాలను ఆర్బీఐ అద్దెకు తీసుకోనుంది. పాత నోట్లను ఇంకా లెక్కిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఇటీవల పార్లమెంటరీ కమిటీకి చెప్పారు. కరెన్సీ నోట్ల తనిఖీ, ప్రాసెసింగ్ కోసం 18 యంత్రాలు అద్దెకు కావాలంటూ మే నెలలో ఆర్బీఐ గ్లోబల్ టెండర్లను పిలిచింది. అనంతరం దానిని రద్దు చేసి, 12 యంత్రాల కోసం తాజాగా మరోసారి టెండర్లను ఆహ్వానించింది. -
ఆవిష్కరణలు అదరహో..!
పాణ్యం: ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో మోకానికల్ చివరి సంవత్సరం విద్యార్థులు పలు ఆవిష్కరణలు చేశారు. ఎక్స్పో 2017 పేరుతో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో తాము తయారు చేసిన కొత్త పరికరాలు, యంత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ జయచంద్రప్రసాద్ ప్రారంభించారు. ఒకే సారి నాలుగు చెక్క ముక్కలు కొలతల ప్రకారం కటింగ్ చేసే యంత్రాన్ని లిఖిత్, పృధ్వీ,హరినాథ్ , రమేష్‌లు తయారు చేశారు. ఈ యంత్రం తయారీకి రూ.10వేలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. మెట్లపై నడవడానికి సులవుగా ఉండే పరికం .. మెట్లపై రోగులను తీసుకెళ్లే సందర్భంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సమస్యకు పరిష్కారంగా స్టేర్ కయింబ్లర్ అనే పరికరాన్ని ఇర్ఫాన్, విక్రమ్, ఎనోస్, శివరామిరెడ్డి, కిరణ్ తయారు చేశారు. గైడ్ భార్గవి ఆధ్వర్యంలో రూ.10వేలు ఖర్చు చేసి దీనిని తయారు చేశౠమని, 120 కేజీల బరువును దీనితో సునాయాసంగా మెట్లపై తీసుకెళ్లవచ్చన్నారు. ఒకే యంత్రం..మూడు పనులు పంటలకు మందులు పిచికారీ చేయడానికి.. పొలంలో కలుపులు తీయడానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నదాత కష్టాలను తీర్చేందుకు సునీల్, హరికృష్ణారెడ్డి, వెంకటేష్.. తదితరులు మల్టీ పర్పస్ ఫార్మా ఎక్స్వేట్ యంత్రం తయారు చేశారు. దీనిని రూ.20వేలతో తయారు చేశామని..దీనితో దుక్కి దున్నుకోవచ్చని, బోదెలు తీసుకోవచ్చని, మందుల పిచికారీ చేసుకోవచ్చని తెలిపారు. కేవలం ఒకే ఒక మనిషితో ఈ పనులు చేసుకోవచ్చని వివరించారు. నీటిని తోడే పరికరంతో విద్యుత్త్ ఉత్పత్తి ... వర్షం కురిసినప్పుడు ఇళ్ల ముందు నీరు నిల్వ ఉంటుంది. ఈ నీటిని తొడేందు చిన్న పాటి పరికరాన్ని కునుగొన్నారు ప్రసాద్, మహేష్, అస్లాం, ఈష్‌కుమార్, హరీష్‌లు. ఈ పరికరంతో పొలంలో నీటిని గుంతలో నుంచి నీటిని తొడుకోవచ్చు. అంతేకాక ఈ పరికరం నుంచి విద్యుత్త్ ఉత్పత్తి అవుతుంది. ఈ పరికరం వ్యయం రూ. 16వేలు. స్ప్రేయర్ దింపకుండా పిచికారీ.. సోలార్ ఆగ్రి స్ప్రేయర్..దీని విలువ రూ.6వేలు. దీనిని శివకృష్ణ, రేణుక, జ్యోతి, సుదర్శన్ మౌనికలు రూపొందించారు. పురుగు మందును ఒక టబ్‌లో కలిపి పెట్టుకున్న తర్వాత పదేపదే స్ప్రేయర్ దించకుండా సోలార్‌తో నడిచే ఒక మోటార్‌ను అతికించారు. అటోమాటిక్‌గా ఇది ఆ టబ్‌లో నుంచి పురుగు మందను స్ప్రేయర్లోకి పంపింగ్ చేస్తుంది. దీంతో పిచికారీకి తక్కువ సమయం పడుతుంది. -
స్వైపింగ్ మెషీన్లు అలంకారప్రాయమే
రిజస్ట్రేషన్ శాఖకు 32 మెషీన్ల అందజేత దాదాపు అన్నిచోట్లా వినియోగించని సిబ్బంది పట్టించుకోని డిఐజీ కాకినాడ లీగల్ (కాకినాడ సిటీ) : నగదు రహిత లావాదేవీల కోసమంటూ స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ శాఖలో స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు చేసినా, వాటి వినియోగించింది లేదు. స్థిరాస్థి హక్కుదారులు, వాటి కొనుగోలుదారులు ఈసీలు, నకళ్లు తీసుకునేందుకు, ఇతర సేవలు పొందేందుకు జిల్లాలోని 32 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ లక్ష్మీకుమారి ఈ నెల 3న ఈ స్వైపింగ్ మెషీన్లు అందజేశారు.ఈసీలు, నకళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి తీసుకున్న నగదుకు రసీదు ఇవ్వాలి.అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఉద్యోగులు వాటిని ఇవ్వడం లేదు. దీనివల్ల ఈసీ, నకలు కోసం దరఖాస్తు చేసుకున్న వారు వారం రోజులపాటు ఈ కార్యాలయం చుట్టూ తిరగక తప్పడం లేదు. స్వైపింగ్ మిషన్ వినియోగంలో ఉంటే లాభమేమిటి? స్వైపింగ్ మెషీన్ రిజిస్ట్రేషన్ శాఖలో వినియోగంలో ఉంటే నగదు లావాదేవీలు జరిపే సమయం బిల్లులో వస్తుంది. సిటిజన్ చార్ట్ ప్రకారం ఈ బిల్లు తీసుకున్న కక్షిదారుడికి కంప్యూటర్ ఈసీ గానీ, నకలు గానీ గంటలోగా ఇవ్వాలి. అదే మాన్యూల్ ఈసీగానీ, నకలు కానీ 24 గంటల్లో అందజేయాలి. ఈ కారణంగా రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు స్వైపింగ్ మెషీన్‌ను పక్కన పెట్టి నగదు రూపంలో సొమ్ము తీసుకుంటున్నారు. నిర్ధేశిత సమయానికి ఇవ్వకపోతే పరిహారం సిటిజన్ చార్ట్ ప్రకారం నకళ్లు, ఈసీలు ఇవ్వాల్సిన సమయాన్ని ఖరారు చేస్తూ 2013లో జీవో నంబర్ 1054ను ప్రభుత్వం జారీచేసింది. ఈ జీవో ప్రకారం కక్షిదారుడు కంప్యూటర్ ఈసీగానీ, నకలుకుగానీ దరఖాస్తు చేసుకున్న గంటలోగా ఇవ్వకపోతే ఆ ఉద్యోగి ప్రతి గంటకు రూ.10 చొప్పున కక్షిదారుడికి చెల్లించాలి. అలాగే మాన్యూల్ ఈసీగానీ, నకలు గానీ 24 గంటల్లో తిరిగి ఇవ్వకపోతే రూ.50 ఇవ్వాలి. స్వైపింగ్‌ను ఎందుకు ఉపయోగించడం లేదంటే... జిల్లాలో కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్వైపింగ్ మెషీన్ ద్వారా ఈసీలు, నకళ్లు ఇవ్వడం లేదు. కారణం ఏమిటని కక్షిదారులు ప్రశ్నిస్తుంటే.... స్వైపింగ్ మెషీన్ ద్వారా ఈసీలు, నకళ్లు ఇస్తుంటే డైరెక్టుగా కక్షిదారులు ఇచ్చే సొమ్ము ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుందని సిబ్బంది బదులిస్తున్నారు. ఆడిట్ జరిగినపుడు ప్రభుత్వ ఖాతాలో ఉన్న సొమ్ము జమ అయినట్టు ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ ఖాతాకు వెళ్లక పోవడంవల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు చెబుతున్నారు. దీంతో కొన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది స్వైపింగ్ మెషీన్లను పక్కన పెట్టేశారు. ప్రభుత్వ ఖజానాకు ఇలా చిల్లు... 30 ఏళ్ల పైబడినవారు ఈసీ తీసుకుంటే రూ.520 రిజిస్ట్రేషన్‌శాఖకు చెల్లించాలి. 30 ఏళ్ల లోపు వారు ఈసీ తీసుకుంటే రూ.220 చెల్లిస్తే సరిపోతుంది. అయితే నగదు రూపంలో కొన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కక్షిదారుల వద్ద నుంచి రూ.520 ఈసీకు తీసుకుని ప్రభుత్వ ఖాతాకు 30 ఏళ్ల లోపు వ్యక్తి తీసుకున్నట్టు చూపించి రూ.220 మాత్రమే జమ చేస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. గతంలో తాళ్లరేవు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇలాంటి సంఘటనలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా కక్షిదారుడికి ఈసీ కానీ, నకలు కానీ ఇస్తున్నారు. అయితే వారి వద్ద నుంచి తీసుకున్న నగదును ప్రభుత్వ ఖాతాకు జమ చేయకుండా సిబ్బంది జేబుల్లో వేసుకుంటున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. స్వైపింగ్ మెషీన్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే కక్షిదారుడికి నష్టం ఉండదు. ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడదు. జిల్లాలో అందజేసిన 32 స్వైపింగ్ మెషీన్లను ఆయా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వినియోగిస్తున్నారా? లేదా? అనే అంశాన్ని డీఐజీ పట్టించుకుంటే ఈ అక్రమాలను అరికట్టవచ్చు. -
జిల్లాలో 10 వేల ఈ పోస్ మెషీన్లు
డిసెంబర్ మొదటి వారానికి ఏర్పాటు వీటి కోసం 3,500 దరఖాసులు జన్‌ధన్ ఖాతాదారులకు రుపే కార్డులు కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ సిటీ : జిల్లాలో డిసెంబర్ మొదటి వారానికి 10 వేల ఈ పోస్ మెషీన్లను అందుబాటులోకి తేనున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. ప్రజల లావాదేవీలు అధికంగా ఉండే జనరల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఎరువుల దుకాణాలు, వైన్ షాపులు తదితర దుకాణాల్లో ఈ మెషీన్లను బ్యాంకులు అందుబాటులోకి తేనున్నాయని చెప్పారు. కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగదు కొరత నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. నగదు రహిత లావాదేవీల పట్ల ప్రజలను ఆకర్షితులను చేసేందుకు ఈ పోస్ మెషీన్లను గ్రామ, మండల స్థాయిల్లో అన్ని రకాల వ్యాపారులు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ వ్యాపారుల నుంచి ఈ మెషీన్ల కోసం సుమారు 3,500 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఎస్బీఐ, ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంక్‌ల ద్వారా ఈ నెల 27లోగా వాటిని ఆయా వ్యాపార సంస్థల్లో నెలకొల్పనున్నారని తెలిపారు. జిల్లాలో జన్‌ధన్ ఖాతాలు తెరిచిన వారిలో చాలా మంది రూపే డెబిట్ కార్డును తీసుకోలేదని, వారందరికి వాటిని పంపిణీ చేసి నగదు రహిత లావాదేవీలకు వినియోగించుకునేలా చైతన్యపరుస్తామన్నారు. నగదు కొరత నేపథ్యంలో ప్రజల ఇబ్బందుల నివారణకు జిల్లా స్థాయిలో అధికారులు, బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమన్వయ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించి యుద్ధ ప్రాతిపదికన అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. -
నిలువెల్లా నిర్లక్ష్యం
* కాలువ చివరి భూముల రైతులకు నీటి కష్టాలు * దొంగలపాలైన యంత్ర పరికరాలు * నిరుపయోగంగా గార్డ్ రూములు * పట్టించుకోని అధికారులు వినుకొండ రూరల్ : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మేజర్ల పరిధిలోని రైతుల చివరి భూములకు నీరందేందుకు వీలుగా ఏర్పాటుచేసిన కెనాల్ ఆటో మిషన్లు కనుమరుగవుతున్నాయి. సాగర్ కుడి కాలువ నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్టు కింద 2005లో సుమారు రూ.30 లక్షల వ్యయంతో గార్డ్ రూములు నిర్మించారు. నియోజకవర్గంలో 16 మేజర్లు ఉండగా ఎనిమిది మేజర్లపై గార్డు రూములు నిర్మించారు. అవి ఇప్పుడు అలంకారప్రాయంగా మిగిలాయి. ఇనిమెళ్ల, అంగలూరు, పెరుమాళ్లపల్లి, పెదకంచర్ల మైనర్, పేరూరపాడు, దొండపాడు, చీకటీగలపాలెం, పలుకూరు మేజర్ కాలువలపై అప్పటి అధికారులు గార్డ్ రూములు నిర్మించారు. వీటి వద్ద మేజర్లకు వచ్చే నీటి వివరాలు నమోదుచేసేందుకు తొట్లు ఏర్పాటు చేశారు. ఇవి అందించే వివరాలతో వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం కావడంతో ఏ మేజర్లలో ఎంత పరిమాణంలో నీరు ప్రవహిస్తుంది.. అవసరమైన మేజర్లకు ఎంతమేర నీరు విడుదల చేయాలనేది స్పష్టంగా తెలియడంతో సమస్యను అధికారులు పరిష్కరించేవారు. ఏ మేజర్‌కు ఎంతెంత.. ఇనిమెళ్ల మేజర్‌కు 23.17 క్యూసెక్కుల నీరందించే లక్ష్యంతో మూడు గార్డ్ రూములు, అంగలూరు 50.71 క్యూసెక్కులకు మూడు, పేరుమాళ్లపల్లి 194.8 క్యూసెక్కులకు 8, పెదకంచర్ల మైనర్ 70.12 క్యూసెక్కులకు మూడు, పేరూరపాడు 30.47 క్యూసెక్కులకు రెండు, దొండపాడు 56.04 క్యూసెక్కులకు రెండు, పలుకూరు 36.39 క్యూసెక్కులకు రెండు గార్డు రూములు నిర్మించారు. వీటి ప్రకారం రైతులకు నీరు సరఫరా చేయాల్సిఉంది. వీటి ఏర్పాటు అనంతరం వరుస కరువు, సిబ్బంది పర్యవేక్షణ కొరవడడంతో అవి మూలనపడ్డాయి. మారుమూల ప్రాంతాల్లోని గార్డ్ రూముల్లోని పరికరాలు దొంగలపాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో కంట్రోల్ రూమ్‌ను సంవత్సరాల తరబడి పట్టించుకోకపోవడంతో యంత్ర పరికరాలు తుప్పుపట్టాయి. గ్రాఫ్ పనిచేయని పరిస్థితి నెలకొంది. సదాశయంతో లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటుచేసినా పట్టించుకునే నాథుడు లేక నిరుపయోగంగా మారాయి. నీటి విడుదలలో అయోమయం.. ప్రస్తుతం తాగు, సాగునీటికి సాగర్ నీరు విడుదలతో మేజర్లకు నీటి విడుదల విషయంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏ మేజర్‌కు ఎంత నీరు విడుదల చేయాలనే విషయంలో అయోమయం నెలకొంది. గతంలో గార్డ్ గదుల్లో ఏర్పాటు చేసిన రీడింగ్ యంత్రాల ద్వారా అధికారులు ఆయా మేజర్లకు నీరు విడుదల చేసేవారు. కొన్ని మేజర్లకు నీటి సరఫరా అధికంగా ఉండగా.. మరికొన్నింటికి సరిపడా సరఫరా కావడం లేదు. దీంతో రైతులు సాగునీటి కోసం అనధికారిక తూములు, గండ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాలువ చివరి భూముల రైతులకు సాగు నీరందక అవస్థలపాలవుతున్నారు. నీటిపారుదల విషయంలో ఎన్ఎస్పీ అధికారులు చోద్యం చూస్తున్నారని చివరి భూముల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు స్పందించి కెనాల్ ఆటోమిషన్‌ను వినియోగంలోకి తెచ్చి రైతులకు నీరందేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రెండేళ్లుగా పనిచేయడం లేదు.. కెనాల్ ఆటో మిషన్ రెండేళ్లుగా పనిచేయడం లేదు. అక్కడక్కడ రీడింగ్ యంత్రాలను స్టోర్ రూమ్స్‌లో భద్రపరిచాం. మరికొన్ని రూమ్స్‌ను పరిశీలించాల్సి ఉంది. రానున్న రోజుల్లో ప్రతి మేజర్‌పై గార్డు రూములు ఏర్పాటుచేస్తాం. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉంది. రూముల్లో దొంగిలించిన యంత్రాలపై ఇప్పటికే 20–30 కేసులు నమోదు చేశాం. అయినా ఫలితం లేదు. – వాసంతి, ఎన్ఎస్పీ ఈఈ -
పల్లె వైద్యానికి గ్రహణం
* ఆస్పత్రి అభివృద్ధి కమిటీల ఏర్పాటులో జాప్యం * రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసిన అధికార పార్టీ * విభేదాలతో పలువురు కోర్టుకు * మూలనపడిన విలువైన యంత్రాలు సాక్షి, గుంటూరు: పల్లె వైద్యానికి అధికార పార్టీ గ్రహణం పట్టింది. మైనింగ్‌లు మొదలుకొని, మద్యం వరకు దేనినీ వదలని తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు వైద్యశాలలపై పడుతున్నారు. కాసుల కక్కుర్తిలో ప్రతి పనికి అడ్డు తగులుతూ సొంత ప్రభుత్వ పథకాలను నీరుగారుస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో ఈ తంతు అధికంగా ఉంది. జిల్లాలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ వాటిలో ఎక్కడా ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయడం కానీ, వాటి ద్వారా నిధులు వినియోగించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడడం గానీ జరగడం లేదు. నిధులున్నా.. వినియోగమేదీ.. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సరిపడా నిధులున్నా వినియోగించేందుకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ లనే ఏర్పాటు చేయలేదు. వాటి అనుమతి ఉంటేనే ఈ నిధులు వినియోగించాల్సిన పరిస్థితుల్లో కమిటీలను ఏడాదిన్నరగా ఏర్పాటు చేయకపోవడంతో అరకొర సౌకర్యాలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మాతా శిశు మరణాలను తగ్గించటమే లక్ష్యంగా ప్రభుత్వం జిల్లాలో 11 ప్రభుత్వ ఆస్పత్రులకు స్కానింగ్ మిషన్లు మంజూరు చేసినా అవి నిరుపయోగంగా మారాయి. ఎనిమిది నెలల క్రితం జిల్లాకు వచ్చిన రూ.1.50 కోట్ల విలువ చేసే స్కానింగ్ మిషన్లు మూలన పడ్డాయి. నిరుపయోగంగా యంత్రాలు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు లేక ప్రసవాలకు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారనే విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఉచిత స్కానింగ్ పరీక్షల సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. రూ.1.50 కోట్లు వెచ్చించి జిల్లాలోని 11 ఆస్పత్రులకు వాటిని స్కానింగ్ మిషన్లను పంపించింది. సత్తెనపల్లి, రేపల్లె, చిలకలూరిపేట, మాచర్ల, నగరం, వినుకొండ, కొల్లిపర, పిట్టలవానిపాలెం, పొన్నూరు, పెదకూరపాడు, ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వాటిని చేర్చారు. స్కానింగ్ మిషన్లు వచ్చి ఎనిమిది నెలలు దాటుతున్నా అవి నిరుపయోగంగా మూలన పడ్డాయి. స్కానింగ్‌లు చేయాలంటే తప్పనిసరిగా డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో స్కానింగ్ మిషన్‌ను రిజిస్ట్రేషన్ చేయించాలి. మిషన్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు రూ.35 వేలు డీడీ రూపంలో డీఎంహెచ్ఓ కార్యాలయానికి చెల్లించాలి. సదరు సొమ్మును హెచ్‌డీఎస్ ఖాతాలో నుంచి డ్రా చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేయకపోవడంతో స్కానింగ్ మిషన్ల రిజిస్ట్రేషన్లు ముందుకు సాగడం లేదు. రాజకీయ జోక్యం వల్లే జాప్యం... రాజకీయ జోక్యం వల్లే హెచ్‌డీఎస్ కమిటీలను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం మండలస్థాయి అధికారులను హెచ్‌డీఎస్ కమిటీలో సభ్యులుగా నియమించింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప మండల స్థాయి అధికారులను తొలగించి వారి స్థానంలో తెలుగు తమ్ముళ్లకు చోటు కల్పించి హెచ్‌డీఎస్ కమిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. దీంతో అధికార పార్టీ నేతల మధ్య సఖ్యత లోపించి విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ విషయంపై వివాదం నెలకొని పలువురు కోర్టులను ఆశ్రయించడంతో హెచ్‌డీఎస్ కమిటీల నియామకాల్లో తెలుగు తమ్ముళ్లను పక్కన బెట్టాలని సూచించారు. అయినప్పటికీ వారి జోక్యం తగ్గకపోవడంతో నేటికీ పలు ఆస్పత్రుల్లో హెచ్‌డీఎస్ కమిటీలు ఏర్పడలేదు. ఒక్కో ఆస్పత్రిలో ఏడాదికి రూ.1.75 లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు వివిధ రకాల అభివృద్ధి పనుల నిమిత్తం హెచ్‌డీఎస్ ఖాతాలకు ప్రభుత్వం ఎన్హెచ్ఎం పథకం ద్వారా విడుదల చేస్తుంది. ఏడాదిగా నిధులు హెచ్‌డీఎస్ ఖాతాలోనే మూలుగుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, పలు మార్లు జిల్లాలో ఆస్పత్రులను తనిఖీ చేస్తున్నప్పటికీ ఆస్పత్రుల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసి రాజకీయ గ్రహణాన్ని తొలగించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కమిటీలు లేకే రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తులు లేవు... జిల్లాలో 11 ఆస్పత్రులకు ఆరు నెలల క్రితం స్కానింగ్ మిషన్లు వచ్చాయి. రిజిస్ట్రేషన్ కాకపోవడంతో స్కానింగ్‌లు జరగడం లేదు. హెచ్‌డీఎస్ కమిటీలు లేక రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయలేకపోతున్నారు. జిల్లాలో 40 శాతం ఆస్పత్రులకు కమిటీలు ఏర్పాటయ్యాయి. మిగతా ఆస్పత్రులకు కమిటీలు ఏర్పడగానే అనుమతులు మంజూరు చేస్తాం. – డాక్టర్ పద్మజారాణి, డీఎంఅండ్‌హెచ్‌వో -
యంత్రాలు ఫర్ సేల్ ?
పీడబ్ల్యూడీ వర్క్‌షాపు యంత్రాలు ఘన చరిత్రకు గ్రహణం టీడీపీ హయాంలో నిర్లక్ష్యపు తుప్పు ప్రకాశం బ్యారేజీ భద్రతపై నీలినీడలు ఉద్యోగుల భవిష్యత్తూ ప్రశ్నార్థకమే తాడేపల్లి రూరల్: ఎంతో చరిత్ర కలిగిన సీతానగరం పీడబ్ల్యూడీ వర్కుషాపును మూసివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు వంద కోట్ల రూపాయల ఖరీదు చేసే యంత్రాల విక్రయానికి సన్నాహాలు చేస్తోంది. దీని కోసం ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని నియమించింది. వర్కుషాపులో యంత్రాలు స్క్రాప్ రూపంలో ఎంత బరువు ఉంటాయి.. వాటిని ఎలా విక్రయించాలనే అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రైవేటు కంపెనీలకు మరమ్మతు బాధ్యతలు... 2002 వరకు పీడబ్ల్యూడీ వర్కు షాపునకు చెందిన సాంకేతిక సిబ్బంది అనేక ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులకు గేట్లు అమర్చేవారు. ఆ తరువాత అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం భారీ నీటి పారుదలకు సంబంధించిన మరమ్మతులన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రక్రియ మొదలు పెట్టింది. అందులో భాగంగానే ప్రకాశం బ్యారేజీ గేట్లను మార్చేటప్పుడు ప్రభుత్వం టెండర్ల ద్వారా రూ. 150 కోట్ల వ్యయంతో పనులను ప్రైవేటు సంస్థకు అప్పగించింది. వర్కుషాపులో సిబ్బంది రూ. 90 కోట్ల వ్యయంతోనే నాణ్యమైన గేట్లను అందజేస్తామన్నా వినిపించుకోలేదు. 12 ఏళ్లకే తుప్పు పట్టిన యంత్రాలు... పీడబ్ల్యూడీ వర్కు షాపులోని సిబ్బంది 1955లో ప్రకాశం బ్యారేజీ ఆనకట్టకు 10.5 ఎత్తు ఉండేలా గేట్లను తయారు చేసి అమర్చారు. 2002 వరకు అవే గేట్లు వాడకంలో ఉండేవి. సుమారు 50 ఏళ్ల పాటు పని చేసే విధంగా గేట్లను డిజైన్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం కాసులకు కక్కుర్తిపడి 2002లో ఏర్పాటు చేసిన గేట్లు 12 ఏళ్లు గడిచే సరికే తుప్పుపట్టాయి. తిరిగి కోట్ల రూపాయలు వెచ్చించి మరమ్మతులు నిర్వహించాల్సి వచ్చింది. విలువైన యంత్రాలు... పీడబ్ల్యూడీ వర్కు షాపు పెన్ స్టాక్‌లో గేట్లను బెండింగ్ చేసే యంత్రం భారతదేశంలో మరెక్కడా లేదు. రెండు నుంచి ఏడు అంగుళాల మందం ఉన్న ఐరన్ షీట్లను సైతం ఎటు కావాలంటే అటు వంచే విధంగా ఆ యంత్రం పని చేస్తుంది. వీటితోపాటు డ్రిల్లింగ్ మిషన్లు, వెల్డింగ్ కట్టర్స్ వర్క్ షాపులోని ప్రత్యేకతలు. ఇప్పుడు అధికార టీడీపీ ఈ వర్కు షాపును తొలగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంటే చరిత్రాత్మక కట్టడమైన ప్రకాశం బ్యారేజీని ఎలా రక్షిస్తారో అర్థంకాని పరిస్థితులు ఏర్పడ్డాయి.