
'గాంధీ' లో పనిచేయని యంత్రాలు
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి రేడియాలజీ విభాగంలోని ఎంఆర్‌ఐ స్కానింగ్ యంత్రం రెండు రోజులుగా పనిచేయడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్కానింగ్ అత్యవసరమైన రోగులను ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. విడిభాగాలు విదేశాల నుంచి రావాల్సి ఉందని... గురువారం నాటికి ఎంఆర్‌ఐ యంత్రాన్ని అందుబాటులోకి తెస్తామని ఆస్పత్రి అధికారులు తెలిపారు.