ఆవిష్కరణలు అదరహో..!
ఆవిష్కరణలు అదరహో..!
Published Fri, Mar 3 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM
పాణ్యం: ఆర్‌జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో మోకానికల్ చివరి సంవత్సరం విద్యార్థులు పలు ఆవిష్కరణలు చేశారు. ఎక్స్‌పో 2017 పేరుతో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో తాము తయారు చేసిన కొత్త పరికరాలు, యంత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ జయచంద్రప్రసాద్ ప్రారంభించారు. ఒకే సారి నాలుగు చెక్క ముక్కలు కొలతల ప్రకారం కటింగ్ చేసే యంత్రాన్ని లిఖిత్, పృధ్వీ,హరినాథ్ , రమేష్‌లు తయారు చేశారు. ఈ యంత్రం తయారీకి రూ.10వేలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
మెట్లపై నడవడానికి సులవుగా ఉండే పరికం ..
మెట్లపై రోగులను తీసుకెళ్లే సందర్భంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సమస్యకు పరిష్కారంగా స్టేర్ కయింబ్లర్ అనే పరికరాన్ని ఇర్ఫాన్, విక్రమ్, ఎనోస్, శివరామిరెడ్డి, కిరణ్ తయారు చేశారు. గైడ్ భార్గవి ఆధ్వర్యంలో రూ.10వేలు ఖర్చు చేసి దీనిని తయారు చేశౠమని, 120 కేజీల బరువును దీనితో సునాయాసంగా మెట్లపై తీసుకెళ్లవచ్చన్నారు.
ఒకే యంత్రం..మూడు పనులు
పంటలకు మందులు పిచికారీ చేయడానికి.. పొలంలో కలుపులు తీయడానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నదాత కష్టాలను తీర్చేందుకు సునీల్, హరికృష్ణారెడ్డి, వెంకటేష్.. తదితరులు మల్టీ పర్పస్ ఫార్మా ఎక్స్‌వేట్ యంత్రం తయారు చేశారు. దీనిని రూ.20వేలతో తయారు చేశామని..దీనితో దుక్కి దున్నుకోవచ్చని, బోదెలు తీసుకోవచ్చని, మందుల పిచికారీ చేసుకోవచ్చని తెలిపారు. కేవలం ఒకే ఒక మనిషితో ఈ పనులు చేసుకోవచ్చని వివరించారు.
నీటిని తోడే పరికరంతో విద్యుత్త్ ఉత్పత్తి ...
వర్షం కురిసినప్పుడు ఇళ్ల ముందు నీరు నిల్వ ఉంటుంది. ఈ నీటిని తొడేందు చిన్న పాటి పరికరాన్ని కునుగొన్నారు ప్రసాద్, మహేష్, అస్లాం, ఈష్‌కుమార్, హరీష్‌లు. ఈ పరికరంతో పొలంలో నీటిని గుంతలో నుంచి నీటిని తొడుకోవచ్చు. అంతేకాక ఈ పరికరం నుంచి విద్యుత్త్ ఉత్పత్తి అవుతుంది. ఈ పరికరం వ్యయం రూ. 16వేలు.
స్ప్రేయర్ దింపకుండా పిచికారీ..
సోలార్ ఆగ్రి స్ప్రేయర్..దీని విలువ రూ.6వేలు. దీనిని శివకృష్ణ, రేణుక, జ్యోతి, సుదర్శన్ మౌనికలు రూపొందించారు. పురుగు మందును ఒక టబ్‌లో కలిపి పెట్టుకున్న తర్వాత పదేపదే స్ప్రేయర్ దించకుండా సోలార్‌తో నడిచే ఒక మోటార్‌ను అతికించారు. అటోమాటిక్‌గా ఇది ఆ టబ్‌లో నుంచి పురుగు మందను స్ప్రేయర్‌లోకి పంపింగ్ చేస్తుంది. దీంతో పిచికారీకి తక్కువ సమయం పడుతుంది.
Advertisement
Advertisement