సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధి ల్లాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించా రు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అయోవా రాష్ట్రంలోని లాంగ్ వ్యూ ఫార్మ్ అనే భారీ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. నూతన టెక్నాలజీ వినియోగంలో లాంగ్ వ్యూ ఫార్మ్ వ్యవసాయ క్షేత్రం ఎంతో పురోగతి సాధించింది.
జీపీఎస్ ద్వారా ఒక్క సెంటీమీటర్ తేడా లేకుండా విత్తడం, భారీ యంత్రాల సాయంతో దున్నడం నుంచి పంట నూర్పిళ్ల వరకూ పనులు చేయడం, హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా క్రిమి సంహారక మందుల స్ప్రేయింగ్, మొ క్క ఎదుగుదలను ప్రతి దశలో డేటా సేకరించి మానిటర్ చేయడం వంటి వాటిని మంత్రి నేతృత్వంలోని బృందం పరిశీలించింది.
లాంగ్ వ్యూ ఫార్మ్ సందర్శించిన బృందానికి సీఈఓ స్టీవ్ హెన్రీ అన్ని వివరాలతో కూడిన ప్రెజెంటేషన్ చేశారు. తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రధానంగా మొక్కజొన్న (కార్న్), సోయాబీన్ పండిస్తామని తెలిపా రు. మేలురకమైన విత్తనాలను కూడా ఉత్పత్తి చేస్తామని, ఆహార ధాన్యాలతో పోలిస్తే విత్తన ఉత్పత్తి వల్ల లాభాలు మూడు రెట్లు ఎక్కువగా వస్తున్నాయని వివరించారు.
ప్రపంచస్థాయికి తెలంగాణ వ్యవసాయం: తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని నిరంజన్‌రెడ్డి చెప్పారు. భవిష్యత్ తరాలు వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించే పరిస్థితులు రావాలన్నారు. అమెరికాలో వ్యవసాయ పరిస్థితులు భారతదేశ వ్యవసాయంతో పోలిస్తే కొంత భిన్నమన్నారు. ఇక్కడ భారీ కమతాలు, మానవ వనరుల కొరత వలన పెద్ద ఎత్తున యాంత్రీకరణ అనివార్యమయిందన్నారు.
తెలంగాణలో చిన్న కమతాలు ఎక్కువ కాబట్టి భారీ యంత్రాల వినియోగం వ్యక్తిగత స్థాయిలో సాధ్యపడదని అందుకే రైతులు సహకార సమాఖ్యలుగా సంఘటితమై యాంత్రీకరణ ఫలాలు అందుకోవాలని మంత్రి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రైతాంగం కూడా యంత్ర శక్తిని విరివిగా వినియోగించుకోవడానికి అవసరమయ్యే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామన్నారు.
అనంతరం ఇల్లినాయిస్ రాష్ట్రం డికెటర్ నగరంలోని అతిపెద్ద ఫార్మ్ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. ఆయన వెంట వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment