అందాన్ని అరచేతుల్లో కోరుకునే ఆడవారికి ఈ హై ఫ్రీక్వెన్సీ మెషిన్ ఓ మంత్రదండంలా పని చేస్తుంది. ఇది మచ్చలు, ముడతలు, మొటిమలు, కళ్ల కింద నల్లటి వలయాలు వంటి లోపాలను మాయం చేసేస్తుంది. చర్మాన్ని బిగుతుగా, నవయవ్వనంగా మారుస్తుంది. దీనిలో మూడు ట్యూబ్స్ లభిస్తాయి.
వాటిలో రెండు స్కిన్ ట్యూబ్స్ చర్మానికి, ఒక స్కాల్ప్ ట్యూబ్ తలకు అనువుగా ఉంటాయి. ఒక స్కిన్ ట్యూబ్ మృతకణాలను తొలగించి, ముడతలను దూరం చేస్తుంది. మరో స్కిన్ ట్యూబ్ మొటిమలను, వాటి వల్ల ఏర్పడే మచ్చలను మాయం చేస్తుంది. ఇక స్కాల్ప్ ట్యూబ్ హెయిర్ గ్రోత్‌ను పెంచుతుంది. దీని వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరిగి, జుట్టు ఊడటం తగ్గుతుంది.
ఈ డివైస్ 90% నియాన్, 10% ఆర్గాన్ తో కూడిన హై ఫ్రీక్వెన్సీ ఫేషియల్ మెషిన్. ఇది అన్ని రకాల చర్మాలకు అనువుగా ఉంటుంది. స్కిన్ కేర్, హెయిర్ కేర్‌లను కోరుకునే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ఇది చక్కటి బహుమతి అవుతుంది. పైగా దీన్ని వినియోగించడం చాలా తేలిక. దీని ధర 60 డాలర్లు. అంటే నాలుగువేల తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు.
ఇవి చదవండి: ప్రస్తుతం ఇంట్లో గోడలకు.. ట్రెండ్‌గా మారిన వాల్‌పేపర్ డిజైన్స్..!
Comments
Please login to add a commentAdd a comment