
సాక్షి, హైదరాబాద్ : నగరంలో నకిలీ నోట్ల గ్యాంగ్ హల్‌చల్ చేసింది. యూఎస్ డాలర్లు మారుస్తామంటూ పాతబస్తీకి చెందిన జాఫర్ నుంచి రూ.20లక్షలు తీసుకొని ఓ ముఠా ఉడాయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. 30వేల యూఎస్ డాలర్లు కావాలని పాతబస్తీకి చెందిన జాఫర్‌తో అహమ్మద్ గ్యాంగ్ 20లక్షలకు బేరం కుదుర్చుకుంది.
గచ్చిబౌలిలో జాఫర్ లక్షరూపాయల యూఎస్ డాలర్లను మార్చాడు. కాగా మరో 20లక్షలు కావాలంటూ జాఫర్‌ను ఔటర్ రింగ్ రోడ్‌కు పిలిపించారు.అక్కడి చేరుకున్న జాఫర్‌పై తుపాకీ గురి పెట్టి నకిలీ యూఎస్ డాలర్లు ఇచ్చి ఈ గ్యాంగ్ కారులో పరారైంది. బాధితుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment