Fake notes gang
-
యూ ట్యూబ్ చూశారు.. ప్రింటింగ్ చేశారు
సాక్షి, సిటీబ్యూరో: తమ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి అరెస్టు కావడంతో నకిలీ కరెన్సీ ప్రింటింగ్ విషయం తెలిసింది.. యూ ట్యూబ్‌లో చూసి ఎలా ముద్రించాలో అధ్యయనం చేశారు.. ఓఎల్ఎక్స్లో స్కానర్ కమ్ ప్రింటర్‌ను ఖరీదు చేసి మొదలెట్టారు.. సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని సంతల్లో సర్క్యులేట్ చేస్తున్నారు.. సిటీలో మార్చేందుకు వచ్చిన అనుచరుల్ని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకోగా మొత్తం గ్యాంగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో వరుసదాడులు చేసిన అధికారులు ముగ్గురు జువైనల్స్తో సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వీరి నుంచి రూ.9.27 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ అరెస్టుతో ఆలోచన... సంగారెడ్డి పట్టణానికి చెందిన ఇబ్రహీం బిన్ సాలేహ్ అక్కడి బసవేశ్వర నగర్లో స్టీలు పాత్రల విక్రయం వ్యాపారం చేస్తుంటాడు. ఇతడి స్నేహితుడైన అక్కడి శ్రీనగర్‌కాలనీ వాసి బండారి గౌతమ్ కంప్యూటర్ సైన్స్‌లోని డిప్లొమో పూర్తి చేసి ప్రస్తుతం రియల్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. మూడేళ్ల క్రితం నకిలీ కరెన్సీ ముద్రిస్తున్నాడనే ఆరోపణలపై సంగారెడ్డి పోలీసులు అక్కడే ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అప్పుడే ఈ ఇద్దరికీ తామూ నకిలీ కరెన్సీ ముద్రించి చెలామణి చేయాలనే ఆలోచన వచ్చింది. కంప్యూటర్ సైన్స్‌లో డిప్లమో చేసిన గౌతమ్ తనకు ఉన్న పరిజ్ఞానానికి యూ–ట్యూబ్‌లో చూసిన అంశాలు జోడించి స్కానర్, ప్రింటర్ వినియోగించి నకిలీ నోట్లు ముద్రించే విధానాన్ని తెలుసుకున్నాడు. దీంతో గత ఏడాది మార్చ్‌లో ఈ ద్వయం ఓఎల్ఎక్స్ ద్వారా స్కానర్ కమ్ కలర్ ప్రింటర్‌ను కొనుగోలు చేసింది. ఇషాక్ బిన్ సాలేహ్ ఇంట్లోనే కంప్యూటర్‌కు వీటిని సెట్ చేసిన రూ.200, రూ.100 డినామినేషన్స్‌లో నకిలీ కరెన్సీ ముద్రించడం మొదలు పెట్టింది. సంతలే టార్గెట్.. ఇలా ముద్రించిన కరెన్సీని చలామణి చేయడానికి సంగారెడ్డికే చెందిన మహ్మద్ సోహైల్ అలీ (వస్త్ర దుకాణంలో సేల్స్‌మెన్), నగరానికి చెందిన మహ్మద్ గౌసుద్దీన్ (ప్రైవేట్ ఉద్యోగి), అబ్రార్ ఖాన్ (డీజే ఈవెంట్స్ నిర్వాహకుడు), సయ్యద్ ఖాసిఫ్ బహదూర్‌లతో (విద్యార్థి) పాటు ముగ్గురు మైనర్లను ఏర్పాటు చేసుకుంది. సంగారెడ్డికే చెందిన సోహైల్ ప్రస్తుతం బంజారాహిల్స్‌లో పని చేస్తుండటంతో ఇక్కడి వారితో ముఠా సూత్రధారులకు పరిచయాలు ఏర్పడ్డాయి. వీరికి ప్రధాన నిందితులు ఇద్దరూ రూ.10 వేల అసలు కరెన్సీకి రూ.30 వేల నకిలీ కరెన్సీ చొప్పున అందించేది. ఈ ముఠా ప్రధానంగా సంగారెడ్డితో పాటు జహీరాబాద్, సదాశివపేట్, మెదక్‌ల్లో జరిగే సంతల్ని టార్గెట్‌గా చేసుకుని నకిలీ కరెన్సీ చెలామణికి పథకం వేసింది. అక్కడ మార్పిడికి తేలికనే ఉద్దేశంతోనే రూ.200, రూ.100 డినామినేషన్స్‌లో ముద్రిస్తోంది. ఆ సంతలతో పాటు గ్రామాల్లో చిన్న చిన్న దుకాణాలు నిర్వహించే నిరక్షరాస్యుల వద్ద ఈ కరెన్సీని మార్చేస్తోంది. చాట్ బండార్ వద్ద దొరికి.. కొన్ని నెలలుగా సంగారెడ్డి, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో చలామణి చేసిన ఈ ముఠా కన్ను ఇటీవల నగరంపై పడింది. చిన్న చిన్న దుకాణాల్లో మార్పిడి చేయడం మొదలెట్టింది. ఈ ముఠాకు చెందిన ముగ్గురు జ్యువైనల్స్ జగదీష్ మార్కెట్లోని ఓ చాట్ బండార్ వద్దకు వెళ్ళి రూ.200 ఇచ్చి చాట్ తిని చిల్లర తీసుకువెళ్ళారు. మళ్ళీ 10 నిమిషాలకే వచ్చిన వీరు మరోసారి చాట్ తిన్నారు. మూడోసారీ అలానే రావడం, రూ.200 ఇవ్వడంతో దాని నిర్వాహకుడికి అనుమానం వచ్చింది. అతడి ద్వారా సమాచారం అందుకున్న ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్, కె.శ్రీకాంత్ తమ బృందాలతో వలపన్ని ఆ ముగ్గురినీ పట్టుకున్నారు. వీరి విచారణలో ఇతర నిందితుల వివరాలు వెలుగులోకి రావడంతో ఆరుగురు నిందితుల్నీ అరెస్టు చేసి వీరి నుంచి రూ.9.27 లక్షల విలువైన నకిలీ కరెన్సీతో పాటు ముద్రణకు ఉపకరించే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. గిఫ్ట్ రేపర్‌తో సెక్యూరిటీ థ్రెడ్ సాక్షి, సిటీబ్యూరో: నకిలీ కరెన్సీ ముద్రించే స్థానిక ముఠాలు నానాటికీ తెలివి మీరుతున్నాయి. ఆ నోట్లు అసలు వాటిని పోలినట్లుగా ఉండేందుకు అనేక ‘జాగ్రత్తలు’ తీసుకుంటున్నాయి. దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన గ్యాంగ్ స్కానర్, ప్రింటర్ ద్వారా రూపొందించిన ఫేక్ నోట్‌కు సెక్యూరిటీ థ్రెడ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాయి. దీనికోసం గిఫ్ట్ రేపర్‌ను కత్తిరించిన వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు చెందిన నలుగురు నిందితుల్ని పట్టుకున్నామని, వీరి నుంచి రూ.8.5 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. సినిమా పెట్టుబడితో నష్టాలు వచ్చి.. నగరంలోని మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన బీవీ శివ సందీప్ ఎంబీఏ పూర్తి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారాడు. సినీ రంగంపై మక్కువ పెంచుకున్న ఇతడు కొన్నాళ్ల క్రితంఓ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఓ సినిమా నిర్మాణం ప్రారంభించిన ఇతగాడు దాదాపు రూ.కోటి పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రాజెక్టు ఆగిపోయింది. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పులు చేస్తూ... పూర్తిగా ఆ ఊబిలో కూరుకుపోయాడు. ఆసిఫ్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అక్బర్ పాషా అక్యుప్రెషర్ విద్యను అభ్యసించి చిన్న క్లినిక్ నిర్వహిస్తున్నాడు. మురాద్‌నగర్‌కు చెందిన మహ్మద్ మొమిన్ ఎంబీబీఎస్‌లో సీటు సాధించినా.. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో దాని బాక్‌లాగ్స్ పూర్తి చేయలేక మెడికల్ రిప్రజెంటేటివ్‌గా మారాడు. ఈ ముగ్గురికీ ఖిల్వత్ గ్రౌండ్స్ ప్రాంతానికి చెందిన పాల సరఫరాదారుడు మహ్మద్ రజియుద్దీన్తో పరిచయం ఏర్పడింది. వీరంతా ఓ ముఠాగా మారి నకిలీ కరెన్సీ ముద్రించి చలామణి చేయాలని పథకం వేశారు. స్కాన్ చేసి ‘గ్రాఫ్’తో సరిచేస్తూ.. కంప్యూటర్‌తో పాటు ప్రింటర్, స్కానర్లను ఖరీదు చేసిన శివ సందీప్ తన ఇంట్లోనే ప్రింటింగ్ ప్రారంభించాడు. అసలు నోటును స్కానర్‌లో స్కాన్ చేసే ఇతగాడు దాన్ని కంప్యూటర్లోకి తీసుకువస్తాడు. నోటు ముందు, వెనుక వేర్వేరుగా స్కాన్ చేస్తుండటంతో ఒకే కాగితంపై రెండూ పక్కాగా ముద్రితం కావడానికి ఇతగాడు కంప్యూటర్లో గ్రాఫ్ పేపర్ మాదిరిగా డిజైన్ చేసి దానిపై స్కాన్ చేసిన నోట్‌ను సెట్ చేస్తున్నాడు. ఇలా ప్రింట్ చేసిన కరెన్సీలో ఎంబోజింగ్‌తో పాటు సెక్యూరిటీ థ్రెడ్, వాటర్ మార్క్ ఉండట్లేదు. మిగిలిన రెండూ తీసుకురావడం కష్టంగా భావించిన ఇతగాడు సెక్యూరిటీ థ్రెడ్‌ని మాత్రం గిఫ్ట్ రేపర్‌తో ‘డిజైన్’ చేయగలిగాడు. దందాల్లో మార్చేస్తూ... ఈ గ్యాంగ్ తమ దందాల్లో కొన్ని అసలు నోట్ల మధ్యలో నకిలీ నోట్లు ఉంచి చలామణి చేస్తున్నారు. దాదాపు ఐదు నెలలుగా ఈ వ్యవహారం సాగిస్తున్న వీరికి సంబంధించిన సమాచారం దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు అందింది. దీంతో ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, మహ్మద్ థకియుద్దీన్, వి.నరేందర్‌లు వల పన్ని నలుగురినీ పట్టుకున్నారు. -
పౌచ్ మార్చి పరారవుతారు
సాక్షి, సిటీబ్యూరో: మనీ ఎక్ఛ్సేంజ్ సంస్థలతో పాటు ట్రావెల్స్‌ను టార్గెట్‌గా చేసుకుని, నిర్వాహకుల దృష్టి మళ్ళించడం ద్వారా ‘జిరాక్సు కరెన్సీ’ అంటగట్టి అందినకాడికి దండుకుంటున్న ముఠాకు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. మొత్తం నలుగురు సభ్యులు ఉన్న ఈ గ్యాంగ్‌లో ఇద్దరిని పట్టుకుని రూ.1.6 లక్షల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ ఆదివారం వెల్లడించారు. నగరంలోని బండ్లగూడ సుభాన్కాలనీకి చెందిన మహ్మద్ సమీరుద్దీన్ అలియాస్ సమీర్ అలియాస్ అజ్జు ప్రస్తుతం కామారెడ్డిలోని రాజీవ్‌నగర్‌లో నివసిస్తూ వంటవాడిగా పని చేస్తున్నాడు. బోధన్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ అబ్దుల్ రిజ్వాన్, కామారెడ్డికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి మహ్మద్ ఆరిఫ్, బిచ్కొండకు చెందిన ముజాహిద్ అలియాస్ మజ్జులతో ఇతడికి స్నేహం ఏర్పడింది. ఈ నలుగురూ కలిసి తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం మార్గాలు అన్వేషించారు. వివిధ మన్సీ ఎక్ఛ్సేంజ్ సంస్థలు, ఆ పని చేసే ట్రావెల్ ఏజెన్సీలను ఎంచుకున్నారు. వారిని మాటల్లో ఉంచి మోసం చేసి అనుకున్న మొత్తం వారి చేతిలో పడగానే ఉడాయిస్తారు. వీరి వ్యవహారాలతో పాటు కదలికలపై ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు జి.శ్రీనివాస్‌రెడ్డి, గోవింద్‌స్వామి, పి.రమేష్, సి.వెంకటేష్ రంగంలోకి దిగారు. పాతబస్తీలో సంచరిస్తున్న సమీరుద్దీన్, రిజ్వాన్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1.6 లక్షల నగదు, ద్విచక్ర వాహనం, ఐదు సెల్ఫోన్లు, మోసాలు చేయడం కోసం నల్లరంగు పౌచ్‌ల్లో సిద్ధంగా ఉంచిన దిరమ్స్ కలర్ జిరాక్సు ప్రతులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ముఠా సభ్యులు ఆరిఫ్, మజ్జు కోసం గాలిస్తున్నారు. సమీరుద్దీన్‌కు గతంలోనూ నేరచరిత్ర ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ గుర్తించింది. ఇతడిపై బికనూర్ పోలీసుస్టేషన్లో దోపిడీ, అబిడ్స్ పోలీసుస్టేషన్లో బెదిరించి వసూళ్ళు, మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్లో అత్యాచారం కేసు ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇలాంటి ముఠాల పట్ల మనీ ఎక్ఛ్సేంజ్ సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. వ్యాపారం లావాదేవీల సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ దృష్టి మళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మోసం చేస్తారిలా.. ఈ నలుగురూ ఇద్దరిద్దరు చొప్పున ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ఉంటారు. ఆ వాహనంపై టార్గెట్ చేసిన దుకాణం వద్దకు వెళ్తారు. ఓ నిందితుడు వాహనం పైనే ఉండి, దాన్ని ఆన్‌లోనే ఉంచి, పారిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. మరో వ్యక్తి చేతిలో నల్లటి పౌచ్‌తో దుకాణంలోకి వెళ్తాడు. తన వద్ద ఉన్న విదేశీ కరెన్సీ దిమర్స్‌ను భారత కరెన్సీలోకి మార్చాల్సి ఉందంటూ ఆ సంస్థ నిర్వాహకుడికి చెప్తాడు. నల్లటి పౌచ్‌తో సహా అందులో ఉన్న దిరమ్స్‌ను సదరు నిర్వాహకుడికి అందిస్తాడు. తొలుత వాటిని బయటకు తీసి, సరిచూసే మనీ ఎక్ఛ్సేంజ్ సంస్థ నిర్వాహకుడు ఆపై లెక్కిస్తాడు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ దిమర్స్‌ను భారత కరెన్సీలోకి మారుస్తూ విలువను క్యాలిక్యులేటర్‌లో లెక్కించి, కమీషన్ మినహాయించి చెప్తాడు. అతడు ఎంత చెప్పినా వెంటనే నిందితుడు అంగీకరిండు. అంత తక్కువ మొత్తం ఇస్తానంటే తాను దిమర్స్‌ను ఇవ్వనంటూ పౌచ్ తీసుకుంటాడు. దుకాణంలోకి వచ్చే ముందే పథకం ప్రకారం అలాంటి మరో పౌచ్‌లో దిమర్స్ కాకుండా వాటి కలర్ జిరాక్సు ప్రతులు తీసుకువస్తాడు. అసలు దిమర్స్ ఉన్న పౌచ్‌ను సంస్థ నిర్వాహకుడి నుంచి చేజిక్కించుకునే నిందితుడు ఆ మాట, ఈ మాట చెప్తూ అతడి దృష్టి మళ్ళిస్తాడు. అదును చూసుకుని ఈ పౌచ్‌ను జేబులో పెట్టేసి, అందులోంచి కలర్ జిరాక్సు ప్రతులతో కూడిన పౌచ్‌ను చేతిలోకి తీసుకుని పట్టుకుంటాడు. కొద్దిసేపు సంస్థ నిర్వాహకుడితో సంభాషించిన తర్వాత తప్పనిసరి పరిస్థితులు అన్నట్లు నటిస్తూ అతడు చెప్పిన మొత్తానికే దిమర్స్ ఎక్ఛ్సేంజ్ చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అలా దిరమ్స్ కలర్ జిరాక్సు ప్రతులతో కూడిన పౌచ్‌ను నిర్వాహకుడికి ఇచ్చేస్తాడు. అంతకు ముందే అసలు దిరమ్స్‌తో ఉన్న పౌచ్‌ను అందుకున్నప్పుడు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు ఈసారి కేవలం లోపల దిమర్స్ ఉన్నాయా? లేదా? అనే విషయం తప్ప మిగిలినవి పట్టించుకునే వారు కాదు. దీంతో ఆ విలువకు తగ్గ భారత్ కరెన్సీకి నిందితుడికి ఇచ్చేసేవాళ్ళు. ఈ నగదు చేతికి అందిన మరుక్షణమే దుకాణం నుంచి బయటకు వచ్చే నిందితుడు అప్పటికే ద్విచక్ర వాహనంపైసిద్ధంగా ఉన్న సహచరుడితో కలిసిక్షణాల్లో ఉడాయిస్తాడు. ఈ పంథాలో హైదరాబాద్, నిజామాబాద్‌ల్లో ఈ గ్యాంగ్ నాలుగు నేరాలు చేసింది. -
గుంటూరు జిల్లాలో నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్ట్
-
నకిలీనోట్ల చలమణి ముఠా అరెస్ట్
-
రెండు చేతులు లేకున్నా.. కంప్యూటర్..సాయంతో నకిలీ
పెద్దపల్లి రూరల్: సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో నకిలీ నోట్లను చలామణి చేసి.. ఏకంగా వాటిని తయారు చేసేందుకు సిద్ధపడ్డ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో పొత్కపల్లి పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు చిక్కగా, ముగ్గురు పరారీలో ఉన్నారు. వివరాలను శనివారం పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ సుదర్శన్‌గౌడ్ వెల్లడించారు. కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన చల్లా రాయమల్లు సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన షేక్ గుంషావలీ నుంచి నకిలీ నోట్లను తెప్పించి రెండే ళ్లుగా చలామణి చేస్తున్నాడు. అసలు రూ. 5 వేల కు నకిలీ నోట్లు మూడు నాలుగింతలు వస్తుండడంతో ఆర్థికంగా లాభపడాలని ఆశించాడు. గుం షావలీ నకిలీ నోట్లను తయారు చేస్తున్న తీరును గమనించి, తానూ తయారు చేసేందుకు ఉపక్రమించాడు. ఇందుకు కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన కొలిపాక శ్రీనివాస్, కందుల ఉదయ్‌కుమార్, దుగ్యాల అనిల్, ఓదెల మండలం పొత్కపల్లికి చెందిన రెడ్డి బాపురావు, కొమిరకు చెందిన నల్లగోని కుమార్, ఇందుర్తికి చెందిన తుమ్మ సదానందం, జీలకుంటకు చెందిన ముంజాల శ్రీధర్, గోనె నవీన్‌ల సహకారం తీసుకున్నాడు. వీరి కదలికలపై అనుమానంతో పొత్కపల్లి పోలీసులు విచారించగా వారి వద్ద నకిలీ కరెన్సీ బయటపడింది. పొత్కపల్లి ఎస్ఐ ఓంకార్‌యాదవ్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విచారణ జరపడంతో రాయమల్లు వద్ద ఉన్న కంప్యూటర్, ప్రింటర్, పేపర్లతోపాటు రూ. 6లక్షల నకిలీ కరెన్సీ పట్టుబడింది. ఎస్ఐ ఓంకార్‌ను డీసీపీ అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీ హబీబ్‌ఖాన్, సీఐ రాములు పాల్గొన్నారు. నకిలీ దందాకు అడ్డురాని వైకల్యం ముఠా సభ్యుల్లో ప్రధాన సూత్రధారి చల్లా రాయమల్లు వికలాంగుడు. తనకు చేతులు లేకున్నా కంప్యూటర్, ప్రింటర్ సాయంతో నకిలీ నోట్లను ఎలా ముద్రించాడో విచారణలో తెలిపిన తీరుకు అధికారులే నివ్వెర పోయారు. -
నగరంలో నకిలీ నోట్ల గ్యాంగ్ హల్చల్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో నకిలీ నోట్ల గ్యాంగ్ హల్చల్ చేసింది. యూఎస్ డాలర్లు మారుస్తామంటూ పాతబస్తీకి చెందిన జాఫర్ నుంచి రూ.20లక్షలు తీసుకొని ఓ ముఠా ఉడాయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. 30వేల యూఎస్ డాలర్లు కావాలని పాతబస్తీకి చెందిన జాఫర్‌తో అహమ్మద్ గ్యాంగ్ 20లక్షలకు బేరం కుదుర్చుకుంది. గచ్చిబౌలిలో జాఫర్ లక్షరూపాయల యూఎస్ డాలర్లను మార్చాడు. కాగా మరో 20లక్షలు కావాలంటూ జాఫర్‌ను ఔటర్ రింగ్ రోడ్‌కు పిలిపించారు.అక్కడి చేరుకున్న జాఫర్‌పై తుపాకీ గురి పెట్టి నకిలీ యూఎస్ డాలర్లు ఇచ్చి ఈ గ్యాంగ్ కారులో పరారైంది. బాధితుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. -
దొంగనోట్ల ముఠా అరెస్ట్
సాలూరు: దొంగనోట్లు మారుస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు పార్వతీపురం ఏఎస్పీ దీపికాపాటిల్ తెలిపారు. పట్టుబడిన ముఠా సభ్యులను సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు చూపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశతో సాలూరులోని గొర్లెవీధికి చెందిన కొండబత్తుల శకుంతల, ఆమె భర్త విశ్వేశ్వరరావు (విజయనగరంలో హోంగార్డు), సాలూ రు మండలం మామిడిపల్లికి చెందిన నల్లి మల్లీశ్వరరావు, నరసింహమూర్తి, సాలూరులో పెదకుమ్మరివీధిలో చెరువుగట్టుకు చెందిన అల్లం శ్యామల మూఠాగా ఏర్పడి దొంగనోట్లను మార్పిడి చేస్తున్నారన్నారు. సాలూరులో ఎలక్ట్రికల్ షాపు నడిపే నల్లి మల్లీశ్వరరావుకు దొంగనోట్ల ముఠా సభ్యులతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. అయితే అతని వద్ద డబ్బులు లేకపోవడంతో శకుంతల, ఆమె భర్త విశ్వేశ్వరావులకు విషయం చెప్పాడన్నారు. వారితో కలిసి ముఠా సభ్యులను విశాఖలో కలిసి రూ. 1.50 లక్షలు ఇచ్చి మూడు లక్షల రూపాయల (500 రూపాయల నోట్లు) నకిలీ నోట్లు తీసుకున్నట్లు చెప్పారు. అక్కడకు రెండు నెలల తర్వాత నరసింహమూర్తి సహకారంతో శ్యామల నకిలీ నోట్లను మారుస్తూ వస్తోందన్నారు. ఇలా 2 లక్షల 80 వేల రూపాయలను మార్చేశారని తెలిపారు. అయితే మార్చిన మొత్తాన్ని పంచుకునే సమయంలో ఏర్పడిన విభేదాలు ఏర్పడడంతో విషయం బయటకు వచ్చిందన్నారు. దీంతో పట్టణ ఎస్సై ఫకృద్దీన్ విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్దనున్న 40 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇందులో కీలకపాత్ర వహించిన ఒడిశాకు చెందిన మరో వ్యక్తిని పట్టుకోవాల్సి ఉందని చెప్పారు. కార్యక్రమంలో పార్వతీపురం సీఐ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. -
దొంగనోట్ల ముఠా అరెస్ట్
దేవరపల్లి: జిల్లాలో నకిలీ నోట్లను తయారు చేసి మారుస్తున్న ముఠా సభ్యులను దేవరపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను మంగళవారం దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐ సి.శరత్‌రాజ్ కుమార్ వెల్లడించారు. గత నెల 21న దేవరపల్లి గురుప్రీత్ హోటల్ వద్ద కొందరు దొంగ నోట్లు మారుస్తుండగా, ఎస్సై పి.వాసు, సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని పట్టుకునే యత్నం చేశారు. ఆ సమయంలో నిందితులు ప్రతిఘటించడంతో ఎస్సై వాసు రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. పారిపోతున్న సుంగారపు చిట్టిబాబు, పోలేపల్లి కిషోర్‌బాబును అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో వారి నుంచి రూ.2 లక్షల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కొవ్వూరు డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సీఐ సి.శరత్‌రాజ్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే దొంగ నోట్లు తయారు చేస్తున్న మరో ముగ్గురు విజయవాడకు చెందిన వారాడ సింహాద్రి నాయుడు, ఏలూరుకు చెందిన డేగల సత్యత్రిమూర్తులు, చీరాలకు చెందిన మన్నెం డేవిడ్‌రాజును అదుపులోకి తీసుకుని వారి నుంచి కంప్యూటర్, స్కానర్, ప్రింటర్, కటింగ్ మిషన్, కలర్ కెమికల్స్, జిరాక్సుకు ఉపయోగించే పేపరుతోపాటు రూ.23 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరు ఒరిజినల్ కరెన్సీ నోట్లను స్కానింగ్ చేసి కలర్ జిరాక్సులు తీసి మారుస్తున్నట్టు సమాచారం. మన్నె డేవిడ్‌రాజు ప్రింటర్‌ను ఉపయోగించి రూ.100, రూ.200, రూ.500, రూ.2000 నోట్లను కలర్ ప్రింట్ చేసి ఏలూరులోని డేగల సత్యత్రిమూర్తులుకు పంపిస్తున్నట్టు, సత్యత్రిమూర్తులు ఈ నోట్లను వారాడ సింహాద్రి నాయుడు, చిట్టిబాబు, కిషోర్ల ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మారుస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. నోట్లను మార్చినందుకు 20 శాతం కమీషన్ ఇస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరు 2017 నవంబరు నుంచి దొంగ కరెన్సీ నోట్లను తయారు చేస్తున్నట్టు కనుగొన్నారు. అశ్వారావుపేటకు చెందిన శ్రీదేవి ద్వారా రూ.4 లక్షలు దొంగనోట్లు మార్చారని, నూజివీడుకు చెందిన గోపి ద్వారా రూ.60 వేలు మార్చారని గుర్తించారు. విజయవాడలో పరిచయం: ఈ ముఠా సభ్యులందరికీ విజయవాడలో పరిచయం అయిందని సీఐ శరత్‌రాజ్‌కుమార్ తెలిపారు. డేవిడ్‌రాజుకు అప్పులు ఎక్కువగా ఉండడం, రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడం, కేసులు ఉండడం వల్ల సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మిగతావారిని కూడగట్టి దొంగనోట్లు తయారు చేస్తున్నట్టు తెలిపారు. డేవిడ్‌రాజు కంప్యూటర్ డిప్లమో చేశాడని, అందుకే నోట్ల తయారీలో నైపుణ్యం వచ్చిందని వివరించారు. విలేకరుల సమావేశంలో ఎస్సై పి.వాసు, ట్రైనీ ఎస్సై సాధిక్, సిబ్బంది పాల్గొన్నారు. -
మాఫియాకు రాచమార్గం
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి అక్రమ రవాణాకు దేవరపల్లి–జీలుగుమిల్లి రోడ్డు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. విశాఖ నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్‌కు వాహనాలు ఇటుగా వెళుతుండటంతో రోడ్డు రద్దీగా ఉంటుంది. దీంతో ఈ మార్గాన్ని అడ్డాగా మార్చుకుని పశువులు, గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాలతోపాటు దొంగనోట్ల మార్పిడి సాగుతోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు: దేవరపల్లి–జీలుగుమిల్లి మార్గంలో అక్రమ రవాణా మాఫియాను పట్టుకోవడానికి పోలీసులు ఏడాదిలో రెండుసార్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. జిల్లాలో గంజాయి సాగు లేకపోయినా విశాఖ ఏ జెన్సీ నుంచి జిల్లా మీదుగా గంజాయి అ క్రమ రవాణా సాగుతోంది. రవాణాలో కీలకపాత్రధారులు జిల్లావారు కావడంతో గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. అయితే అప్పుడప్పు డు పోలీసులకు వచ్చిన సమాచారంతో భారీగా గంజాయి పట్టుపడుతోంది. విశా ఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పండించిన గంజాయిని హైదరాబాద్, మహారాష్ట్రకు వయా పశ్చిమగోదావరి జిల్లా నుంచి సరిహద్దు దాటిస్తున్నారు. దీని కోసం ప్ర త్యేకమైన రూట్లను స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు. దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మీదుగా ఒక రూట్లోను, దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకాతిరుమల, కామవరపుకోట, చింతలపూడి మీదుగా మరో రూట్లో రాష్ట్ర సరి హద్దులు దాటిస్తున్నారు. దీనిలో జిల్లాకు చెందిన స్థానిక వ్యక్తులతో పాటు పోలీసులలో కూడా కొందరు సహకరిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల గంజా యి వ్యవహారంలో చింతలపూడి సీఐపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. పశువుల అక్రమ రవాణా విషయానికి వస్తే జిల్లాలో ఇప్పటివరకూ 24 కేసులు నమోదు కాగా సుమారు 1,850 ఆవులను పోలీసులు పట్టుకుని గోసంరక్షణ సమితికి అప్పగించారు. జిల్లా మీదుగా ప శువుల అక్రమ రవాణా చాలా కాలంగా జరుగుతోంది. జిల్లా సరిహద్దులు దాటిం చేందుకు ఏకంగా ఒక ముఠా పనిచేస్తోం ది. దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మీదుగా వీటి ని తరలించేవారు. అప్పుడప్పుడు రూ ట్ మార్చి నల్లజర్ల, కామవరపుకోట, చిం తలపూడి మీదుగా జిల్లా సరిహద్దులు దా టిస్తున్నారు. ఎక్కడైనా పోలీసులు దాడి చేసి పశువులను రవాణా చేసు ్తన్న వాహనాలు సీజ్ చేస్తే దగ్గరలోని గో శాలకు తరలించి అక్కడి నుంచి రాత్రికి రాత్రే తెలంగాణాకు తరలిస్తున్నారు. గతంలో దేవరపల్లి వద్ద పట్టుకున్న గోవులు సకాలంలో గోశాలకు తరలించకపోవడంతో 40 వరకూ హృదయవిదారక పరిస్థితిలో మృతి చెందడం వివాదం అయ్యింది. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం అ క్రమ రవాణాకు కూడా మాఫియా ఈ రూట్‌నే ఎంచుకోవడం గమనార్హం. తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇదే రూట్లో కాకినాడ పోర్టుకు ఈ బి య్యం చేరుతున్నాయి. మధ్యలో తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని రైస్ మిల్లుల్లో వీటిని రీసైక్లింగ్, పాలిష్ చేసి ఏదొక బ్రాండ్ పేరుతో 25 కేజీల బ్యాగ్‌ల్లో నింపుతున్నారు. ఇలా చేసిన బ్యాగ్‌లను కాకినాడ పోర్టు నుంచి బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నారు. ఈ రూట్లో పోలీసుల సహకా రం ఉండటంతో ఇంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకే రోజు జిల్లాలో రెండు దొంగనో ట్ల కేసులు నమోదు కావడం విశేషం. దేవరపల్లి, నరసాపురంలో దొంగనోట్ల ముఠాలను పట్టుకున్నారు. ఇద్దరు నిరాయుధులను పట్టుకోవడం కోసం దేవరపల్లిలో కాల్పులదాకా వెళ్లాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం డిపార్టుమెంట్లోనే వ్యక్తమైంది. ఇటీవల యర్నగూడెం వద్ద దొం గనోట్ల ముఠా పోలీసులపై దాడికి ప్రయత్నించి తప్పించుకుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారన్నది తెలియాల్సి ఉంది. దేవరపల్లి–జీలుగుమిల్లి మార్గంలోని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు దేవరపల్లిలో.. గంజాయి కేసులు 4 గోవుల రవాణా 3 రేషన్ బియ్యం 2 దొంగనోట్ల మార్పిడి 1 గోపాలపురంలో.. గంజాయి కేసు 1 గోవుల రవాణా 1 నల్లజర్లలో.. గోవుల రవాణా 2 లింగపాలెంలో.. రేషన్ బియ్యం 2 కామవరపుకోటలో.. గోవుల రవాణా 1 కొయ్యలగూడెంలో.. గోవుల రవాణా 6 గుట్కా, ఖైనీ రవాణా 1 జంగారెడ్డిగూడెంలో.. గోవుల రవాణా 2 రేషన్ బియ్యం 1 బుట్టాయిగూడెంలో గోవుల రవాణా 1 జీలుగుమిల్లిలో.. గంజాయి రవాణా 1 రేషన్ బియ్యం 1 చింతలపూడిలో.. గంజాయి కేసు 1 రేషన్ బియ్యం 1 -
దెబ్బకు ఠా.. దొంగల ముఠా
నరసాపురం: స్మగ్లింగ్ బంగారం తక్కువ ధరకు ఇస్తామని చెప్పి నమ్మించి.. కొందరికి చాకచక్యంగా నకిలీ కరెన్సీని అంటగడుతున్న అంతరజిల్లాల దొంగనోట్ల ముఠా సభ్యులు నలుగురిని నరసాపురం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ 1.82 లక్షల నకిలీ 2 వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ టీటీ ప్రభాకర్‌బాబు స్థానిక విలేకరులకు గురువారం వివరించారు. పాలకొల్లు మండలం పామూరు గ్రామానికి చెందిన పంచదార లక్ష్మితో యలమంచిలి మండలం గొల్లవారిపాలెంకు చెందిన గుబ్బల వీరాస్వామి పరిచయం పెంచుకున్నాడు. తాను గతంలో గల్ఫ్‌లో పనిచేసి వచ్చానని నమ్మబలికాడు. గల్ఫ్ నుంచి స్మగ్లింగ్ బంగారం తమ దగ్గరకు వస్తుందని, సగానికి సగం తక్కువ ధరలకు ఇస్తామన్నారు. దీంతో లక్ష్మి మూడు నెలలుగా వీరికి బంగారం నిమిత్తం దఫదఫాలుగా రూ.1.40 లక్షలు ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో.. బంగారం ఎంతకీ ఇవ్వకపోవడంతో లక్ష్మి నిలదీయడం ప్రారంభించింది. దీంతో బంగారం రావడంలో ఆలస్యమైంది, నీవు ఇచ్చిన సొమ్ము తిరిగి ఇచ్చేస్తామని గత నెలలో లక్ష్మిని నరసాపురం రప్పించారు. మరోవ్యక్తితో కలిసి వచ్చిన వీరాస్వామి కొంతసొమ్ము ఇచ్చి ఉడాయించారు. అయితే వారు తిరిగి ఇచ్చిన రూ.2 వేలు నోట్లు నకిలీవని గుర్తించిన లక్ష్మి నరసాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో వారి కదలికలపై నిఘా పెట్టినట్టు డీఎస్పీ చెప్పారు. గురువారం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరిలో గుబ్బల వీరాస్వామిని అదుపులోకి తీసుకోగా అతని వద్ద నకిలీ రూ.2 వేల నోట్లు 5 దొరికాయి. యలమంచిలిలోని అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా ప్రింటర్, నకిలీ రూ.2 వేల నోట్లు 91(రూ1.82 లక్షలు), రూ.20 వేల అసలు నోట్లు దొరికాయి. వీరాస్వామితో పాటుగా అక్కడ ఉన్న తూర్పుగోదావరి జిల్లా కడియపు సావరం గ్రామానికి చెందిన గుత్తుల వెంకటరమణ, ఆత్రేయపురం గ్రామానికి చెందిన ఉమ్మిది సత్యనారాయణ, పెద్దాపురం మండలం గోరంటకు చెందిన పిడుగుల శ్రీనివాస్‌లను అరెస్ట్ చేశారు. నలుగురూ కూడా వివిధ జిల్లాల్లో దొంగనోట్ల మార్పిడి చేస్తున్నట్టుగా గుర్తించామని చెప్పారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సీఐ ఎం.సుబ్బారావు, టౌన్ ఎస్సై కె.చంద్రశేఖర్, ఐడీ పార్టీ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. దేవరపల్లిలో ఇద్దరి అరెస్ట్ దేవరపల్లి: దేవరపల్లిలో దొంగ కరెన్సీ నోట్లు మార్పిడి చేస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను గురువారం దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొవ్వూరు డీఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన పోలేపల్లి కిశోర్ ఎలియాస్ జోషి, తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చీకట్లపాలెంకు చెందిన శృంగాకారపు చిట్టిబాబు దొంగనోట్ల మార్పిడి చేసే ముఠాలో సభ్యులుగా ఉన్నారు. వీరిద్దరూ బుధవారం దేవరపల్లి–గోపాలపురం రోడ్డులోని టుబాకో బోర్డు సమీపంలోని గురుప్రీత్ డాబా హోటల్ వద్ద కొయ్యలగూడెం మండలం రాజవరంకు చెందిన సండ్ర వెంకటేశ్వరరావుకు రూ.2,10,900 విలువైన దొంగ కరెన్సీ నోట్లు అందజేయడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్సై పి.వాసు అప్రమత్తమై సిబ్బందితో ముఠా సభ్యులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దొంగనోట్లు తీసుకోవడానికి వచ్చిన వెంకటేశ్వరరావు గట్టిగా అరుస్తూ ఎస్సై వాసును బెదిరిస్తూ ప్రతిఘటనకు ప్రయత్నించగా ఎస్సై గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టు డీఎస్పీ తెలిపారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు ముఠా సభ్యులను విచారించగా విజయవాడకు చెందిన వారాడ సింహాద్రి నాయుడు తమకు దొంగ కరెన్సీనోట్లు ఇచ్చి రాజవరానికి చెందిన సండ్ర వెంకటేశ్వరరావుకు అప్పగించమని చెప్పినట్టు తేలిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. పరారీలో ఉన్న ముఠా సభ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో కొవ్వూరు రూరల్ సీఐ సి.శరత్‌రాజ్‌కుమార్, ఎస్సై పి.వాసు, సిబ్బంది పాల్గొన్నారు. -
దొంగనోట్ల ముఠా అరెస్ట్
నల్లగొండ క్రైం/మిర్యాలగూడ రూరల్ : నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను బుధవారం మిర్యాలగూడ రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,97,500 నకిలీ నోట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. మిర్యాలగూడెం మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన కొలపొలి పెద్ద ఆంజనేయులు కుండల వ్యాపారం చేస్తుంటాడు. కారులో వచ్చిన ఐదుగురు రూ.290కి కుండను కొనుగోలు చేసి ఆంజనేయులుకి రూ.రెండు వేల నోటును ఇచ్చారు. వారికి ఆంజనేయులు మిగతా డబ్బు తిరిగి ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆ నోటును పరిశీలించగా.. దొంగనోటగా అనుమానం వచ్చింది. వెంటనే మిర్యాలగూడ రూరల్ పోలీసులకు సమాచారం అందించాడు. కారు నంబర్ ఆధారంగా పోలీసులు తనిఖీలు నిర్వహించి నకిలీ నోట్ల ముఠా సభ్యులను గుర్తించారు. వారిని విచారించగా కర్నూల్‌కు చెందిన రాము, మిర్యాలగూడకు చెందిన కర్నాటి మల్లయ్య నోట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ముఠా సభ్యులు వీరే.. గుంటూరుకు చెందిన దర్శనపు అశోక్, తనసూరి జానకిరామయ్య, చేలువారి మధు, వెంకట నాగస్వామి, కుమారికొటం సాయిశ్రీ, పబ్బాటి మురళితో పాటు మరో ఇద్దరు ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకుంటే నోట్లు ఎక్కడ ముద్రిస్తున్నారు.. అనే విషయాలు తెలిసే అవకాశం ఉంది. నిందితులను పట్టుకున్న ఎస్ఐ శ్రీకాంత్, వైజినాయుడు, హెడ్ కానిస్టెబుల్ మట్టయ్య, హోంగార్డు శ్రీనివాస్‌కు ఎస్పీ రివార్డ్ అందజేసి అభినందించారు -
నకిలీ 2వేల నోట్లు ముద్రిస్తూ..
-
నకిలీ 2వేల నోట్లు ముద్రిస్తూ..
కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత రిజర్వు బ్యాంకు కొత్తగా విడుదల చేసిన 2000 రూపాయల నోట్లకు నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిసరాల్లో ఈ ముఠాకు చెందిన ఆరుగురు వ్యక్తులను రాచకొండ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 3 లక్షల రూపాయల విలువైన నకిలీ 2వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కొత్తగా విడుదలైన నోట్లలో పెద్దగా అదనపు సెక్యూరిటీ ఫీచర్లు ఏమీ పెట్టలేదని సాక్షాత్తు రిజర్వు బ్యాంకు వర్గాలు, ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలే చెప్పడంతో ఎక్కడికక్కడ దొంగనోట్ల ముఠాలు విజృంభిస్తున్నాయి. కొత్తవాటికి కూడా దొంగనోట్లను ముద్రించి చలామణిలోకి తేవాలని ప్రయత్నిస్తున్నాయి. అఇయతే రాచకొండ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎల్బీనగర్ పరిసరాల్లో ఉన్న ఒక ముఠా పట్టుబడింది. -
సూర్యాపేటలో నకిలీనోట్ల ముఠా అరెస్ట్
నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని సూర్యాపేటలో నకిలీనోట్ల ముఠాకు చెందిన నలుగురిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1.10 లక్షల నకిలీ నోట్లు, ల్యాప్‌టాప్, ప్రింటర్, కర్ణాటక వర్సిటీకి చెందిన నర్సింగ్ నకిలీ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
దొంగనోట్ల ముఠా అరెస్ట్
పాడేరు రూరల్ : విశాఖ జిల్లా పాడేరు పోలీసులు శనివారం ఐదుగురు సభ్యులు గల ఓ దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలకు చెందిన ఐదుగురు సభ్యుల ముఠా పాడేరు మండలం నక్కలపుట్టు మామిడి తోటల వద్ద దొంగనోట్లను మార్పిడి చేసేందుకు వేచి ఉండగా.. సమాచారం అందుకున్న పాడేరు ఎస్ఐ సూర్యప్రకాశ్ సిబ్బందితో కలసి శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.95 లక్షల విలువైన దొంగనోట్లు, ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఉన్న ఓ రాగి నాణెం, ఐదు సెల్ఫోన్లు, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో బి.వెంకట సత్యనారాయణ, కె.దుర్గారావు, బి. ప్రభాకర్‌రావు, బి.వెంకటరవికుమార్, ఆర్. అనిల్‌కుమార్ ఉన్నట్టు ఎస్ఐ సూర్యప్రకాశ్ తెలిపారు. -
నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నకిలీ నోట్లను చెలామణీ చేస్తున్న ముఠాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం, విశాఖపట్నం, రాజమండ్రికి చెందిన 11మంది సభ్యులు బృందంగా ఏర్పడి రాజమండ్రిలో నకిలీ నోట్లు మార్పిడి చేస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అయితే వారిలో ఏడుగురు పరారవ్వగా, నలుగురు పోలీసులకు దొరికారు. వీరి నుంచి రూ. 6లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి నకిలీ కరెన్సీని రాజమండ్రికి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి చేశారు.