సాక్షి, హైదరాబాద్ : దొంగ నోట్ల ప్రింటింగ్ పరిసరాలు ఎలా ఉంటాయో ఎప్పుడైనా చూశారా ? అప్పుడే ప్రింటింగ్ పూర్తి చేసుకొని కట్టలు కట్టలుగా పేర్చిన కొత్త నోట్లను గుట్టలు గుట్టలుగా ఓ వ్యక్తి పేరుస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దొంగ నోట్లు చలామణివంటి చట్టవ్యతిరేక ఆర్థిక కార్యకలాపాలు మన దేశానికి అతిపెద్ద ముప్పుగా మారాయి. భారత దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేసే స్థాయిలో దొంగనోట్లను పాకిస్తాన్, బంగ్లాదేశ్లు భారత్ లోకి డంప్ చేస్తున్నాయనేది ఓ వాదన. అయితే ఎన్నో ప్రమాణాలతో తయారైన కొత్త నోట్లకు కూడా ఫేక్ నోట్లను బంగ్లాదేశ్ లో తయారు చేస్తున్నారంటూ ఓ వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.
Wow! Is this true or fake? Just wow!https://t.co/UKkkx4syxg
— Vishnu Manchu (@iVishnuManchu) 10 January 2018
పాత రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ. 50, 200, 500, 2000 నోట్లను ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే రూ.50, రూ.200 ల నోట్లను ప్రింట్ చేసిన అనంతరం ఓ వ్యక్తి కట్టలు కడుతూ పేరుస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన హీరో మంచు విష్ణు వామ్మో, ఇది నిజమా అబద్దమా అంటూ ఓ ట్వీట్ చేశారు.
అయితే వీడియోలోని నోట్లు అచ్చు ఒరిజినల్ నోట్లలా ఉన్నా.. కొద్దిగా తీక్షణంగా పరిశీలిస్తే అందులో ఓ చిన్న మార్పు గమనించవచ్చు. సాధారణంగా నోట్ల పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని రాసి ఉంటుంది. అయితే వీడియోలో చూపించిన నోట్లలో మాత్రం భారతీయ చిల్డ్రన్ బ్యాంక్ అని రాసి ఉంది. అంటే వీడియోలో చూపించింది చిన్న పిల్లలు ఆడుకోవడానికి తయారు చేసే నోట్ల ఫ్యాక్టరీ అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుంటే, మరికొందరు చిన్న పిల్లలు ఆడుకోవడానికైతే మరీ అంత పెద్ద ఫ్యాక్టరీలో ప్రింట్ చేస్తారా, కాదు కాదు.. అవి దొంగనోట్లు తయారు చేసే ఫ్యాక్టరీనే అంటూ వాదిస్తున్నారు. అయితే అది నిజంగానే బంగ్లాదేశ్ లో దొంగ నోట్ల తయారీ కేంద్రమా లేక చిన్న పిల్లలు ఆడుకోవడానికి తయారు చేసే ఓ మామూలు ఫ్యాక్టరీనా అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment