
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నకిలీ నోట్లు చలామణీ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.7 కోట్ల విలువైన నకిలీ నోట్లు, రెండు కార్లను ఖమ్మం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేసిన ట్లు సీపీ తఫ్సీర్ ఇక్బాల్ శనివారం మీడియాకు తెలిపారు. సత్తుపల్లి మండలం గౌరిగూడెం గ్రామానికి చెందిన షేక్ మదార్ గత 20 ఏళ్లు గా నకిలీ నోట్లు చలామణీ చేస్తున్నాడని, తన వద్ద నకిలీ నోట్లున్నాయని చెబుతూ, అసలు నోట్లకు 5 రెట్ల నకిలీ నోట్లు ఇస్తానని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నాడని వివరించారు. ప్రజల నుంచి డబ్బులు తీసుకున్నాక నకిలీ నోట్లు ఇవ్వకుండా మోసం చేస్తూ.. ఎదురు తిరిగితే కత్తులు, చాకులతో బెదిరించేవాడని తెలిపారు. ఈ తరహా మోసాలు చాలా కాలం గా తన భార్య మస్తాన్‌బీ, కొడుకు రమీజ్, మే నల్లుడు నౌషద్, తోట హన్మంతరావు, అఖిల్, గాయం వెంకటనారాయణ, మోడెం సాయమ్మలతో కలసి చేస్తూ అక్రమంగా సంపాదించాడని సీపీ వివరించారు.
భారీగా మోసాలు
రూ. 2 వేల నోట్లు రద్దవుతాయన్న ఊహాగానాల నేపథ్యంలో మదార్ భారీగా నకిలీ 2 వేల రూపాయల నోట్లను నిల్వ చేశాడని, వాటిని బ్లాక్ మనీగా ప్రచారం చేసి వైట్ మనీగా మా ర్చే ప్రయత్నం చేసేవాడన్నారు. ఇతడికి అంతర్రాష్ట్ర ముఠాలతో కూడా సంబంధాలున్నట్లు విచారణలో వెల్లడైందని సీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment