సాక్షి, హైదరాబాద్: అస్సాం కేంద్రంగా సాగిన నకిలీ కరెన్సీ రాకెట్‌లో కీలక పాత్రధారిగా ఉన్న పశ్చిమ బెంగాల్ వాసి సద్దాం హుసైన్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఈ ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు 2015లో విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో రట్టు చేశారు. రూ.5,01,500 కరెన్సీతో వెళుతున్న హోసేన్‌ను పట్టుకున్నారు. అతని సహచరుడైన సద్దాం హుసైన్ అప్పటి నుంచీ వాంటెడ్‌గా మారాడు.
ఈ కేసు డీఆర్‌ఐ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కి వచ్చింది. రెండున్నరేళ్ల పాటు వేటాడిన ఎన్‌ఐఏ హైదరాబాద్ యూనిట్ ఎట్టకేలకు సద్దాం హుసైన్‌ను బుధవారం బెంగళూరులో పట్టుకుంది. నిందితుడిని అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై గురువారం విజయవాడకు తరలించింది. అస్సాం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రుస్తుం ఈ రాకెట్ సూత్రధారి. కాగా హుసైన్ నుంచి రూ.26 వేల నకిలీ కరెన్సీ, రెండు రద్దైన రూ.1,000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి తీసుకోవాలని ఎన్‌ఐఏ అధికారులు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment