దేవరపల్లిలో కాల్పుల కలకలం | Fake Currency Gang Arrested in West Godavari | Sakshi
Sakshi News home page

దేవరపల్లిలో కాల్పుల కలకలం

Published Wed, Feb 21 2018 5:27 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

Fake Currency Gang Arrested in West Godavari - Sakshi

సాక్షి, దేవరపల్లి : పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగనోట్ల ముఠా ఆగడాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. తమ అక్రమాలకు అడ్డు తగులుతున్నారని పోలీసులపై తుపాకులతో దాడులకు దిగారు. విషయం పసిగట్టిన పోలీసులు వారి దాడులను తిప్పికొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి దేవరపల్లిలో దొంగనోట్ల ముఠా అక్రమాలకు పాల్పడుతోందన్న సమాచారంతో పోలీసులు దొంగనోట్ల గ్యాంగ్‌ను చుట్టుముట్టారు.

అయితే యాక్షన్‌ సినిమాల్లో మాదిరి ముఠా సభ్యులు తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు. అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. వారి దాడులను తిప్పికొట్టేందుకు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇందులో ముఠాలోని కొందరు పారిపోగా ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా దొంగనోట్లులతో పాటు అసలు కరెన్సీని స్వాధీన పరచుకున్నట్లు ఎస్‌ఐ వాసు మీడియాకు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement