
నకిలీ కరెన్సీతో భారత్‌కు వచ్చి!
పాకిస్తాన్ కు చెందిన వ్యక్తిని గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
అహ్మదాబాద్: పాకిస్తాన్ కు చెందిన వ్యక్తిని గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లతో రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుండగా అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అతడి పేరు బహ్రాఉద్దీన్ వోరా అని పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చాడు. సూరత్‌లోని రైల్వేస్టేషన్లో పాత 500 రూపాయల నోట్లతో సంచరిస్తుండగా అనుమానించి పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
అతడి వద్ద ఉన్న 50 వేల విలువ చేసే రద్దయిన 500 రూపాయల నోట్లు నకిలీ కరెన్సీ అని నిర్ధారించారు. తాను అమృత్ సర్ నుంచి ఇక్కడికి వచ్చానని పోలీసుల విచారణలో బహ్రాఉద్దీన్ వెల్లడించాడు. నిందితుడి పాస్ పోర్ట్ సీజ్ చేశామని, కేసు నమోదుచేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టినట్లు పోలీసులు వివరించారు. నకిలీ నోట్ల మార్పిడి ముఠాతో ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.