
నకిలీ కరెన్సీ ముఠాకు చెక్ : విద్యార్థుల అరెస్ట్
హైదరాబాద్ : నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున‍్న ముఠా ఆటకట్టించారు హైదరాబాద్ పోలీసులు. రాజేంద్రనగర్ హిమాయాత్ సాగర్ వద్ద గురువారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో లభించిన ఆధారాలతో లార్డు ఇంజనీరింగ్ కాలేజీ క్యాంటీన్‌లో ఎస్‌వోటీ పోలీసులు మెరుపు దాడులు చేపట్టారు. నకిలీ కరెన్సీ మార్పిడికి పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.36 లక్షల విలువైన రూ.2 వేల నోట్లు, కలర్ ప్రింటర్, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. నలుగురిని ఎస్‌వోటీ పోలీసులు రాజేంద్రనగర్ పోలీసులకు అప‍్పగించారు. వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.