ఎమ్మిగనూరులో దొంగనోట్లు
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలో రూ.500 నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు సమాచారం ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏది నకిలీదో.. ఏది ఒరిజినలో తెలియక అసలు రూ. 500 నోట్లు తీసుకునేందుకే జంకుతున్నారు. నకిలీ కరెన్సీగా చెబుతున్న రూ. 500 నోట్లు ఒరిజినల్ నోటుకు ఏమాత్రం తీసిపోకుండా ఉండడంతో గుర్తించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యాపారం రద్దీగా సాగుతున్న పశువుల మార్కెట్, కూరగాయల మార్కెట్, కిరాణం షాపుల వద్ద దొంగ నోట్ల మార్పిడి జరుగుతున్నట్లు తెలుస్తోంది.