దొంగనోట్ల చెలామణి: నటి అరెస్టు
దొంగనోట్ల చెలామణి: నటి అరెస్టు
Published Thu, Jun 8 2017 6:04 PM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM
బనశంకరి: నకిలీనోట్ల చెలామణికి పాల్పడుతున్న శాండిల్‌వుడ్ ఆర్టిస్ట్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన గురువారం కర్ణాటకలోని డాబస్‌పేటే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు...కన్నడ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన జయమ్మ గురువారం డాబస్‌పేటే వద్ద రూ. 2 వేల నకిలీనోట్లు చెలామణి చేస్తుండగా అనుమానం వచ్చిన ఓ షాపు యజమాని ఆమెను ప్రశ్నించాడు.
దీంతో జయమ్మ అక్కడ నుంచి ఉడాయించడానికి ప్రయత్నించింది. తక్షణం స్దానికులు జయమ్మ ను వెంబడించి పట్టుకోగా ఆమె వద్ద భారీగా నోట్లు లభించాయి. దీనిపై వారు డాబస్‌పేటే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు జయమ్మతో పాటు ఆటోడ్రైవరు గోవిందరాజును అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
నిర్మాతలు, కొందరు నటులు నకిలీనోట్లు చెలామణికి పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పోలీసులు జయమ్మ సెల్‌ఫోన్ ఆధారంగా కేసు విచారణ చేపడుతున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement