వీఆర్‌ఓల సమక్షంలో గణపతిరెడ్డి ఇంటిని సోదా చేస్తున్న పోలీసులు
కాశీబుగ్గ డిగ్రీ కళాశాల రోడ్డులో గల గణేష్ సప్లయర్స్ యజమాని గణపతిరెడ్డి ఇంటిలో శనివారం సాయంత్రం టెక్కలి పోలీసులు తనిఖీలు చేశారు. ఇటీవల టెక్కలిలో దొంగనోట్లు, దొంగ బంగరాం, తదితర కేసుల్లో అమిత్‌రెడ్డి అతని గ్యాంగ్ సభ్యులు ఐదుగురు అరెస్టయిన విషయం తెలిసిందే. వీరిపై జిల్లాలో వివిద చోట్ల పలు కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నౌపడ, టెక్కలి పోలీసులు అమిత్‌రెడ్డి బావ గణపతిరెడ్డి ఇంట్లో సోదాలు చేశారు.
పలాస: కాశీబుగ్గ డిగ్రీ కళాశాల రోడ్డులో గల గణేష్ సప్లయర్స్ యజమాని గణపతిరెడ్డి ఇంటిలో శనివారం సాయంత్రం టెక్కలి పోలీసులు తనిఖీలు చేశారు. ఇటీవల టెక్కలిలో దొంగనోట్లు, దొంగ బంగరాం, తదితర కేసుల్లో అమిత్‌రెడ్డి అతని గ్యాంగ్ సభ్యులు ఐదుగురు అరెస్టయిన విషయం తెలిసిందే. వీరిపై జిల్లాలో వివిద చోట్ల పలు కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నౌపడ, టెక్కలి పోలీసులు అమిత్‌రెడ్డి బావ గణపతిరెడ్డి ఇంట్లో సోదాలు చేశారు.
పోలీసు కస్టడీలో ఉన్న అమిత్‌రెడ్డిని తీసుకొచ్చి ఆ ఇంట్లో ఎస్‌ఐ మంగరాజుతో పాటు పోలీసులు, వీఆర్‌ఓలు జి.కోటేశ్వరరావు, కామరాజు సమక్షంలో సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఉన్న పలు బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. టెక్కలి సీఐ భవానీప్రసాద్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మంగరాజు చెప్పారు. ఈ సందర్భంగా గణపతిరెడ్డి తల్లి పోలీసు వాహనాన్ని అడ్డగించి ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయంపై కాశీబుగ్గ డీఎస్పీ వివేకానందను వివరణ కోరగా జిల్లాలో వివిధ కేసుల్లో అమిత్‌రెడ్డి నిందితుడిగా ఉన్నాడని, దొంగనోట్లు, దొంగ బంగారం అమ్మకాలు చేస్తూ నేరస్తులుగా పట్టుబడ్డారన్నారు. పలాసలో కూడా రూ.10 లక్షలు దొంగనోట్లు పేరుతో కొంతమంది వ్యక్తుల నుంచి తీసుకున్నారని, హైదరాబాదులో కూడా రూ.30 లక్షలు మోసాలకు పాల్పడ్డాడని, అమిత్‌రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకే కాశీబుగ్గలోని గణపతిరెడ్డి ఇంటిని అతని సమక్షంలోనే సోదా చేశామని చెప్పారు.