
భారీగా రూ.2000, రూ.500 ఫేక్‌నోట్లు..
కొత్త నోట్లు మార్కెట్‌లోకి విడుదలైన(నవంబర్ 10) తర్వాత కిలీ కరెన్సీ భారీ మొత్తంలో పట్టుబడటం మాత్రం ఇదే మొదటిసారి..
ఢిల్లీ: నకిలీ కరెన్సీని అంతం చేయడానికి ప్రభుత్వం కొత్త కరెన్సీ తీసుకొస్తే.. దానికి కూడా నకిలీవి సృష్టిస్తున్నారు కేటుగాళ్లు! విడుదలైన రెండో రోజే రూ.2000 నోటుకు డూప్లికేట్ తయారుచేసినా, భారీ మొత్తంలో ఫేక్ కరెన్సీ బయటపడిన సందర్భాలు మాత్రం అరుదుగా వెలుగులోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం ఓ ముఠాను పట్టుకున్న పోలీసులు.. వారి నుంచి ఏకంగా రూ.6.1 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ వీధుల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని, బ్యాగులు పరిశీలించగా భారీగా కొత్త నోట్లు కనిపించాయని, అయితే అదంతా నకిలీ కరెన్సీయేనని నిర్ధారించుకున్న వెంటనే ఇద్దరినీ అరెస్ట్ చేశామని పోలీసులు మీడియాకు వెల్లడించారు. సెక్యూరిటీ ఫీచర్లతో తయారైన కొత్త నోట్లు మార్కెట్‌లోకి విడుదలైన(నవంబర్ 10) ఢిల్లీలో నకిలీ కరెన్సీ ఇంత మొత్తంలో పట్టుబడటం ఇదే మొదటిసారి.
మొహాలీకి చెందిన ఓ ఇంజనీర్ నుంచి స్వాధీనం చేసుకున్న రూ.42లక్షలే ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన భారీ నకిలీ రాకెట్. రాజ్‌కోట్‌లోనూ రూ.26 లక్షల నకిలీ ‘కొత్త’ కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. ఈ రెండింటి తర్వాత నేడు ఢిల్లీలో లభ్యమైన రూ.6.1 లక్షలే భారీ ఫేక్ కరెన్సీ.
(చదవండి: మోదీ మెచ్చిన ఇంజనీరు.. దొంగనోట్ల వీరుడు!)
(రూ. 2000 నోటును కలర్ జిరాక్స్ తీసి...)