
ఇక మూడేళ్లకోసారి కొత్త నోట్లు!
- రూ. 2 వేలు, రూ.500 నోట్ల భద్రతా ప్రమాణాల్లో మార్పులు
న్యూఢిల్లీ: కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 2 వేల నోటుకు కూడా నకిలీలు పుట్టుకురావడంతో.. వాటికి చెక్ పెట్టేందుకు కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మూడు, నాలుగేళ్లకోసారి రూ. 2వేల, రూ. 500 నోట్లలో భద్రతా ప్రమాణాల్ని మార్చాలని భావిస్తోంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడడంతో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గురువారం జరిగిన ఆర్థిక, హోం శాఖ ఉన్నతాధికారుల భేటీలో దీనిపై చర్చించారు. అభివృద్ధి చెందిన దేశాలు 3–4 ఏళ్లకోసారి కరెన్సీ నోట్ల భద్రతా ప్రమాణాలు మార్చుతున్నాయని.. భారత్‌లో ఆ పద్ధ్దతిని అనుసరించాలని హోం శాఖ సూచించింది.
కరెన్సీ పేపర్ నాణ్యతలో తేడా తప్ప: రూ. 2 వేల నకిలీ నోటులో భద్రతా ప్రమా ణాల్ని చూసి అధికారులు ఆశ్చ ర్యపోయారు. అసలు నోటులో ని 17 ప్రమాణాల్లో 11 ప్రమా ణాలు ఒకేలా ఉన్నాయి. పార దర్శక ప్రాంతం, నోటుకు ఎడమవైపు రూ. 2000 అక్షరాలు, ఆర్‌బీఐ గవర్నర్ సంతకం తదితరాలను అసలు నోటులో ఉన్నట్లుగానే ముద్రించారు. అయితే నకిలీ కరెన్సీ పేపర్ నాణ్యత నాసిరకంగా ఉంది. నకిలీ కరెన్సీని ఐఎస్‌ఐ సాయంతో పాకిస్తాన్‌లో ముద్రిస్తున్నా రని, బంగ్లాదేశ్ ద్వారా భారత్‌లోకి తీసు కొస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 1987లో రూ. 500 నోటు ప్రవేశపెట్టగా... దశాబ్దం క్రితం నమూనా, భద్రతా ప్రమా ణాల్లో మార్పులు చేశారు.