
భ్రమలు కల్పించినందునే మౌనం
పెద్ద నోట్ల నిర్ణయం తర్వాత వెలుగులోకొచ్చే కోట్లాది రూపాయల నల్లధనాన్ని మోదీ ప్రభుత్వం పేదలకు
- నోట్ల రద్దు తర్వాత అవినీతి మరింత పెరిగింది: ఏచూరి
- నల్లధనాన్ని పేదలకు పంచిపెడతారని ప్రచారం చేశారు
- అయితే ప్రజలు క్రమంగా వాస్తవాలు తెలుసుకుంటున్నారు
సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల నిర్ణయం తర్వాత వెలుగులోకొచ్చే కోట్లాది రూపాయల నల్లధనాన్ని మోదీ ప్రభుత్వం పేదలకు పంచిపెడుతుందంటూ లేనిపోని భ్రమలు కల్పించినందువల్లే అనేక కష్టాలు పడుతున్నా ప్రజలు మౌనంగా ఉంటున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విశ్లేషించారు. అయితే జరుగుతున్న సంఘటనలను చూస్తున్న ప్రజలు క్రమంగా వాస్తవాలను తెలుసుకుంటున్నారని చెప్పారు. మంగళ వారం విజయవాడలో జరిగిన మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ప్రారం భోత్సవ కార్యక్రమం సందర్భంగా ఏచూరి మాట్లాడారు.
పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో నకలీ కరెన్సీని, నల్లధనాన్ని వెలికి తీస్తానని, అవినీతిని అరికడతానని, దేశం లో ఉగ్రవాదమే లేకుండా చేస్తాన ని మోదీ చెప్పారని, అయితే అందులో ఏ ఒక్క లక్ష్యమూ నెరవేరే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చలామణీలో ఉండాల్సిన నోట్లకన్నా ఎక్కువ మొత్తం నోట్లు డిసెంబర్ 31 నాటికి బ్యాంకులకు జమ కాబోతున్నా యన్నారు. నల్లధనం వెలికితీసే ప్రయత్నంలో నకిలీ నోట్లు బ్యాంకుల్లో జమవడంద్వారా అవి వైట్‌మనీగా మార్చుకునే వెసులు కల్పించిన ట్టయిందన్నారు.
పేదలు రూ.రెండువేలకోసం రోజుల తరబడి ఏటీఎంల వద్ద క్యూలలో నిలబడుతుంటే.. కొందరి వద్ద రూ.70–80 కోట్ల కొత్త కరెన్సీ పట్టుబడడం చూస్తుంటే.. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత అవినీతి స్థాయి మరింత పెరిగిందన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. పెద్దనోట్ల రద్దు తరువాత దేశవ్యాప్తంగా 111 మంది చనిపోయారని ఏచూరి గుర్తు చేశారు. దేశం నుంచి అత్యధిక ఎగుమతులు జరిగే మూడు ప్రధాన రంగాలైన వస్త్రాలు, తోలు, ఆభరణాల రంగాల్లో పనిచేసే లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్పారు.
మోదీ పార్లమెంట్‌కు వస్తే కదా..
నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ప్రతిపక్షాలు తనను పార్లమెంటులో మాట్లాడనీయట్లేదని మోదీ ఆరోపిస్తున్నారని, అసలు ఆయన పార్లమెంట్‌కు వస్తేగా తాము మాట్లాడనీయకపోవడానికి? అని ఏచూరి అన్నారు. రాజ్యసభలో రెండు రోజులపాటు ఈ అంశంపై చర్చ జరిగితే ప్రధాని గంటసేపు కూర్చొనిÐð వెళ్లిపోయారని.. తర్వాత రాలేదని తెలిపారు. అమెరికాతో రక్షణ ఒప్పందం చేసుకోవడం, నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో మోదీ మన దేశాన్ని అమెరికా జూనియర్‌గా తీర్చిదిద్దుతున్నారని ఏచూరి ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీనియర్ నాయకులు పాటూరి రామయ్య, గఫూర్ తదితరులు పాల్గొన్నారు.
పేదల్ని కష్టపెడుతూ క్యాష్‌లెస్ లావాదేవీలా?
దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరగడం వల్ల ప్రధానంగా లబ్ధి పొందేది విదేశీ బహుళజాతి సంస్థ లే తప్ప పేదలకు ఏం లాభం ఉంటుం దని ఏచూరి ధ్వజమెత్తారు. దేశంలో చిల్లర వ్యాపారుల్ని దెబ్బతీయడానికి రిటైల్ వాణిజ్యంలో ఎఫ్‌డీఐలను పోత్స హించాలన్న ప్రయత్నాలను కమ్యూని స్టు పార్టీలు గతంలో అడ్డుకుంటే, అలాంటి సంస్థలు ఈ కామర్స్ పేరుతో ఆన్‌లైన్ వ్యాపారం మొదలు పెట్టాయని.. నగదు రహిత లావాదేవీల వల్ల ఇప్పుడలాంటి సంస్థలే బాగుపడ బోతున్నాయని చెప్పారు. నగదురహిత లావాదేవీలపై అవగాహనుండి, అందరూ చదువుకున్న వారుండే అమెరికాలోనే 48 శాతం నగదు లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. అలాంటిది మనదేశంలో ఇంతమంది పేదప్రజల్ని కష్టపెడుతూ నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించడం అవసరమా? అని ఏచూరి ప్రశ్నించారు.