
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కశ్మీరీగేట్ మెట్రో స్టేషన్ వద్ద ఓ బ్యాగ్‌లో రూ 4.6 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్) స్వాధీనం చేసుకుంది. కశ్మీరీగేట్ మెట్రో స్టేషన్ వద్ద శనివారం సాయంత్రం పెట్రోలింగ్ చేస్తున్న సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి ఓ బ్యాగ్ కంటపడగా, దాన్ని తెరిచిచూస్తే భారీ మొత్తంలో రూ 500 నోట్లతో కూడిన నకిలీ కరెన్సీని గుర్తించారు. సీఐఎస్‌ఎఫ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఈ విషయాన్ని సీఐఎస్‌ఎఫ్ ఇన్‌ఛార్జ్‌తో పాటు సీఐఎస్‌ఎఫ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. ఘటనా ప్రాంతాన్ని సీఐఎస్‌ఎఫ్ బృందం స్వాధీనంలోకి తీసుకుని బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. తదుపరి చర్యల నిమిత్తం నకిలీ కరెన్సీతో కూడిన బ్యాగ్‌ను ఢిల్లీ మెట్రో రైల్ పోలీసులకు సీఐఎస్‌ఎఫ్ అధికారులు అప్పగించారు.