హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వం పర్సనల్ ఇన్‌చార్జిలను నియమించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్సనల్ ఇన్‌చార్జిలను నియమించే అధికా రం సహకార శాఖ రిజిస్ట్రార్‌కు అప్పగించింది. ఉత్తర్వుల్లో ప్రస్తుత పాలకవర్గాలను ఆరునెలల పాటు పర్సన్ ఇన్‌చార్జిలుగా కొనసాగించాలని ఉన్నా.. తుది నిర్ణయాన్ని సహకార శాఖ రిజిస్ట్రార్‌కు వదిలేయ డంతో ప్రస్తుత పాలకవర్గాల్లో కొన్నింటిని తప్పించే అవకాశం లేకపోలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 91 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటి కాలపరిమితి జనవరి 30తో ముగియగా, మరికొన్ని సంఘాల పాలకవర్గాల కాల పరిమితి శనివారానికి ముగియనున్నాయి. ప్రభుత్వం సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదు. మరోవై పు సహకార ఎన్నికల నిర్వహణలో మార్పులు తీసు కురావాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో పాలకవర్గాల కాల పరిమితి ముగిసిన సంఘాలకు ప్రస్తుతం ఉన్న చైర్మన్లను పర్సనల్ ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగిస్తూ మరో ఆరు నెలలు పొడిగింపు ఇచ్చింది. అయితే ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలతోనే వీరి కాల పరిమితి ముగియనుంది. వీటితో పా టు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, మార్కెటింగ్ సహకార సంఘాలకు ప్రస్తుత చైర్మన్‌లే పర్సనల్ ఇన్‌చార్జిలుగా కొనసాగే అవకాశాలున్నాయి. వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అక్రమాలు జరిగా యని ప్రభుత్వం డీసీసీబీ పాలక వర్గాన్ని సస్పెండ్ చే సింది. అప్పటి నుంచి వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ను ఆఫీసర్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. దీంతో కలెక్టర్ పర్సన్ ఇన్‌చార్జిగా కొనసాగనున్నారు. ఓరుగల్లు సహకార మార్కెటింగ్ సంస్థ చైర్మన్‌గా ప్రస్తుతం నూకల వేణుగోపాల్‌రెడ్డి కొనసాగుతున్నారు.
వివరాల సేకరణలో అధికారులు..
పీఏసీఎస్‌లు, డీసీసీబీలు, సహకార మార్కెటింగ్ సంస్థల పాలక వర్గాలకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్ల వివరాలను జిల్లా సహకార అధికారులు సేకరిస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 13 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఈ డైరెక్టర్లలో ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. వీరిని మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించిన క్రమంలో సహకార శాఖ వీరి వివరాలు సేకరిస్తుంది. సహకార సంఘాల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు బకాయిలు ఉన్నారా? అక్రమాలకు పాల్పడ్డారా తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఈ వివరాలు రెండు రోజుల్లో రాష్ట్ర సహకార శాఖ రిజిస్ట్రార్‌కు పంపనున్నారు. బకాయిలు, అవకతవకలకు పాల్పడినవారిని పర్సన్ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించే అవకాశముంది. ఓరుగల్లు జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ పాలకవర్గం విషయంలోను ఇదే నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు పర్సన్ ఇన్‌చార్జిల నియామకాల ముందు జిల్లా మంత్రుల అభిప్రాయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ఎవరు పర్సన్ ఇన్‌చార్జిలుగా కొనసాగుతారో.. ఎవరు తొలగించబడుతారోననే సందిగ్ధంలో పాలవర్గాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment