బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌: తెలంగాణలో తరుణ్‌చుగ్‌ ఔట్‌.. బన్సాల్‌ ఇన్‌ | BJP Appoints Sunil Bansal As General Secretary For Telangana | Sakshi
Sakshi News home page

తరుణ్‌ చుగ్‌కు షాక్‌.. తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్‌గా సునీల్‌ బన్సాల్‌

Published Wed, Aug 10 2022 7:58 PM | Last Updated on Wed, Aug 10 2022 8:50 PM

BJP Appoints Sunil Bansal As General Secretary For Telangana - Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించిన బీజేపీ ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో..   తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న తరుణ్‌ చుగ్‌ను తొలగించి ఆయన స్థానంలో సునీల్‌ బన్సాల్‌కు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నత కల్పించింది. అలాగే.. తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలకు ఇంఛార్జ్‌గా నియమించింది. ఈ మూడు విపక్ష పాలిత రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయటంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు సునీల్‌ బన్సాల్‌ నియామకాన్ని బుధవారం ప్రకటించారు. బీజేపీ ప్రధాన వ్యూహకర్తల్లో బన్సాల్‌ ఒకరు. 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీని అధికారంలోకి తేవటంలో కీలకంగా వ్యవహరించారు. 2022లోనూ యోగి ఆదిత్యనాథ్‌ సీఎం అయ్యేందుకు సాయపడ్డారు. మరోవైపు.. బీజేపీ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శిగా ధరంపాల్‌ను నియమించింది. ఆయనను ఝార్ఖండ్‌ నుంచి యూపీకి మార్చింది. ప్రస్తుతం యూపీలో బన్సాల్‌కు సహాయకుడిగా వ్యవహరించిన కరంవీర్‌ సింగ్‌ను ఝార్ఖండ్‌ ఇంఛార్జ్‌గా నియమించింది బీజేపీ.

ఇదీ చదవండి: మునుగోడులో మరో ట్విస్ట్‌.. ఉప ఎన్నిక బరిలో వామపక్షాలు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement