general secratary
-
సీతారాం ఏచూరి పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి చికిత్స కొనసాగిస్తున్నా, గురువారం ఆయన ఆరోగ్యం మరింత తీవ్రంగా క్షీణించింది. ఇబ్బందికర పరిస్థితి ఎదురుకావడంతో వైద్యులు ఆయనకు ఐసీయూకి తరలించారు. తొలుత ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు. అనంతరం ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. -
పార్టీ నాయకుడిపై లాలు యాదవ్ కొడుకు ఫైర్.. సమావేశం మధ్యలోనే...
న్యూఢిల్లీ: ఆర్జేడీ నేత లాలు యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తరుచు ఏదో ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలుస్తుంటారు. ఈ మేరకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఢిల్లీల జరిగిన రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడి) సమావేశానికి హజరయ్యారు. ఐతే ఆ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్యామ్ రజాక్‌ని దుర్భాషలాడుతూ...సమావేశం మధ్యలోంచే బయటకు వచ్చేశారు. ఈ విషయమై తేజ్ ప్రతాప్‌ని మీడియా ప్రశ్నించగా...ఆయన సమావేశంలో ఏం జరిగిందో చెప్పేందుకు నిరాకరించారు. తాను బలహీనమైన వ్యక్తిని అని, చాలా ఒత్తిడిలో ఉన్నానని అన్నారు. అదీగాక రెండు రోజుల క్రితమే తన మేనల్లుడు చనిపోయాడని అయినప్పటికీ సమావేశానికి వచ్చానంటూ ఏదేదో చెప్పుకొచ్చారు. తాను సమావేశం షెడ్యూల్ గురించి అడిగితో కార్యదర్శి శ్యామ్ రజాక్ తన సోదరిని, వ్యక్తిగత సహాయకుడి దుర్భాషలాడరని, ఆడియో రికార్డు కూడా ఉందంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇలానే ఇటీవల తన తండ్రి కోసం మధురలో పూజలు చేసే విషయమై వచ్చి నిబంధనలు ఉల్లంఘించి పోలీసులకు చిక్కి మీడియాలో నిలిచారు. (చదవండి: దేశంలోనే తొలి ‘సోలార్’ గ్రామంగా మొధేరా.. ప్రధాని మోదీ ప్రకటన) -
బీజేపీ మాస్టర్ ప్లాన్: తెలంగాణలో తరుణ్‌చుగ్ ఔట్.. బన్సాల్ ఇన్
న్యూఢిల్లీ: తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించిన బీజేపీ ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న తరుణ్ చుగ్‌ను తొలగించి ఆయన స్థానంలో సునీల్ బన్సాల్‌కు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నత కల్పించింది. అలాగే.. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఇంఛార్జ్‌గా నియమించింది. ఈ మూడు విపక్ష పాలిత రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయటంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు సునీల్ బన్సాల్ నియామకాన్ని బుధవారం ప్రకటించారు. బీజేపీ ప్రధాన వ్యూహకర్తల్లో బన్సాల్ ఒకరు. 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీని అధికారంలోకి తేవటంలో కీలకంగా వ్యవహరించారు. 2022లోనూ యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యేందుకు సాయపడ్డారు. మరోవైపు.. బీజేపీ ఉత్తర్‌ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ధరంపాల్‌ను నియమించింది. ఆయనను ఝార్ఖండ్ నుంచి యూపీకి మార్చింది. ప్రస్తుతం యూపీలో బన్సాల్‌కు సహాయకుడిగా వ్యవహరించిన కరంవీర్ సింగ్‌ను ఝార్ఖండ్ ఇంఛార్జ్‌గా నియమించింది బీజేపీ. भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने श्री सुनील बंसल, प्रदेश महामंत्री (संगठन) उत्तर प्रदेश को पार्टी का राष्ट्रीय महामंत्री नियुक्त किया है। श्री सुनील बंसल को पश्चिम बंगाल, ओडिशा एवं तेलंगाना की प्रदेश प्रभारी के रूप में जिम्मेदारी रहेगी। pic.twitter.com/1b4eYlq1ei — BJP (@BJP4India) August 10, 2022 ఇదీ చదవండి: మునుగోడులో మరో ట్విస్ట్.. ఉప ఎన్నిక బరిలో వామపక్షాలు? -
బాహుబలి క్లైమాక్స్ కూడా తక్కువే.. అన్నాడీఎంకే పగ్గాలు పళనికే..!
ఆరోపణలు.. ప్రత్యారోపణలు, సభలు.. సమావేశాలు, దాడులు.. దౌర్జన్యాలు, ఎత్తులు.. పై ఎత్తులతో గత పక్షం రోజులుగా సాగిన అన్నాడీఎంకే ఆధిపత్య పోరుకు తెరపడింది. పార్టీ పగ్గాలు ప్రస్తుతానికి పళనిస్వామికే దక్కాయి. అయితే సోమవారం క్లైమాక్స్ మాత్రం బాహుబలి, కేజీఎఫ్, విక్రమ్ సినిమాలకు తక్కువ కాదన్నట్లుగా సాగింది. సర్వసభ్య సమావేశంలో వానగరం వేదికగా ఎడపాడి పార్టీ పగ్గాలు అందుకున్నారనే సమాచారంతో.. పన్నీరు సెల్వం వర్గం ఆగ్రహంతో ఊగిపోయింది. ఓపీఎస్ తన మద్దతుదారులతో రాయపేటలోని పార్టీ కార్యాలయం తలుపులను బద్దలు కొట్టి.. దాన్నిస్వాధీనంలోకి తెచ్చుకున్నారు. సమాచారం అందుకున్న ఎడపాడి వర్గం అక్కడికి వచ్చి వీరంగం సృష్టించింది. దాడులు.. ప్రతిదాడులతో పార్టీ కార్యాలయ ప్రాంగణం దద్దరిల్లింది. పోలీసులు లాఠీచార్జీ చేసినా ఫలితం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. అన్నాడీఎంకే కార్యాలయానికి సీలు వేసి పలువురు ఆందోళన కారులను అరెస్ట్ చేసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: గత కొంతకాలంగా అన్నాడీఎంకేలో సాగుతున్న ఆధిపత్యపోరులో ఎట్టకేలకూ ఎడపాడి పళనిస్వామి పైచేయి సాధించారు. పన్నీర్ కల్పించిన అడ్డంకులను అధిగమించి పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి ఎంపికయ్యారు. దీంతో ప్రత్యర్థి వర్గం ఎడపాడి మద్దతుదారులపై విరుచుకుపడగా జరిగిన అల్లర్లు, వాహనాల ధ్వంసం, పరస్పర ముష్టిఘాతాలు, కత్తివేట్లతో పార్టీ కార్యాలయ పరిసరాలు యుద్ధభూమిని తలపించాయి. అమ్మ మరణంతో ఖాళీగా మారిన ప్రధాన కార్యదర్శి పదవిని చేజిక్కించేందుకు తొలుత శశికళ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఆమె జైలుకెళ్లగా, సమన్వయ కమిటీ కన్వీనర్, కో కన్వీనర్లుగా పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామి జయస్థానాన్ని భర్తీ చేశారు. అయితే ఇద్దరికీ పొసగకపోవడంతో చాపకిందినీరులా ఉన్న అంతఃకలహాలు అసెంబ్లీ ఎన్నికల తరువాత బట్టబయలయ్యాయి. పార్టీ సారథులుగా ఇద్దరు వద్దు, ఒక్కరే ముద్దు అంటూ ఏక నాయకత్వ నినాదం తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో సుమారు 80 నుంచి 90 శాతం మంది నాయకులు, కార్యకర్తలు ఎడపాడి వైపు నిలువడంతో పన్నీర్‌సెల్వం కోపం కట్టలు తెంచుకుంది. ఎడపాడికి అన్నీ మంచి శకునాలే.. ఇదిలా ఉండగా, ఈనెల 11వ తేదీన ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యేందుకు ఎడపాడి అన్నీ సిద్ధం చేసుకున్నారు. సమావేశంపై స్టే కోసం పన్నీర్‌సెల్వం కోర్టు కెక్కడంతో ఎడపాడి శిబిరం తీవ్ర ఉత్కంఠకు లోనైంది. అయితే సోమవారం వెలువడిన తీర్పు ఎడపాడికి అనుకూలమైంది. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోబోమని న్యాయమూర్తి తమ తీర్పులో పేర్కొన్నారు. దీంతో యధావిధిగా సర్వసభ్య సమావేశం జరిగింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి, కోశాధికారిగా దిండుగల్లు శ్రీనివాసన్ ఎంపికయ్యారు. కన్వీనర్, కో కన్వీనర్ పదవులు రద్దు, పార్టీ నుంచి పన్నీర్ బహిష్కరణ, ప్రధాన కార్యదర్శి పదవికి నాలుగు నెలల్లోగా ఎన్నికలు తదితర 16 తీర్మానాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏకగ్రీవ ఆమోదం పొందాయి. అంతేగాక శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత అనే పదవిని రద్దు చేస్తూ పార్టీ బైలాను సవరించారు. కాగా అన్నాడీఎంకేను మళ్లీ అధికారంలోకి తెస్తామని సర్వసభ్య సమావేశంలో ఎడపాడి ధీమా వ్యక్తం చేశారు. రెచ్చిపోయిన ఇరువర్గాలు ఎడపాడి ఎత్తులకు చిత్తయిన పన్నీర్‌సెల్వం పార్టీ ప్రధాన కార్యాలయంలో పాగా వేశారు. ఎడపాడి మద్దతుదారులంతా వానగరంలో జరుగుతున్న సర్వసభ్య సమావేశంలో ఉండగా, పన్నీర్‌సెల్వం తన అనుచరులతో కలిసి రాయపేట పార్టీ కార్యాలయంలోకి తలుపులను బద్దలు కొట్టి మరీ వెళ్లారు. అక్కడున్న ఎడపాడి ఫొటోలను చించివేసి తగులబెట్టారు. ఈ సమాచారం అందుకున్న ఎడపాడి వర్గం పార్టీ కార్యాలయంలోకి జొరబడి వీరంగం సృష్టించింది. ఇందుకు ప్రతిగా పన్నీర్ అనుచరులు సైతం ముష్టిఘాతాలకు దిగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. కత్తులు, కర్రలు ఇతర మారణాయుధాలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఒకరినొకరు వెంటాడారు. ఫలితంగా కొందరికి గాయాలయ్యాయి. శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో.. దాడుల కారణంగా అనేక వాహనాలు ధ్వంసమై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి.. శాంతిభద్రతల సమస్య తలెత్తింది. పోలీసులు భారీగా మొహరించి లాఠీచార్జీ చేసినా పార్టీ శ్రేణులను నిలువరించడం సాధ్యం కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని 144 సెక్షన్ విధించి పార్టీ కార్యాలయానికి సీలు వేసి పలువురిని అరెస్ట్ చేసింది. ఇందుకు నిరసన తెలుపుతూ పన్నీర్ తన మద్దతుదారులతో ధర్నాకు దిగారు. పార్టీ కార్యాలయంలో విధ్వంసానికి పాల్పడ్డారని, ముఖ్యమైన డాక్యుమెంట్లను తీసుకెళ్లారని ఆరోపిస్తూ ఎడపాడి వర్గీయులు పన్నీర్‌సెల్వం తదితరులపై పోలీసు కేసు పెట్టారు. పార్టీ నుంచి తనను ఎడపాడి బహిష్కరించడం కాదు, తానే ఎడపాడి, కేపీ మునుస్వామిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు పన్నీర్‌సెల్వం మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. చదవండి: సీఎంకు చల్లటి చాయ్: అధికారికి నోటీసులు.. కఠిన చర్యలు! -
లోక్‌సభ జనరల్ సెక్రటరీగా ఉత్పల్ కుమార్ సింగ్
డెహ్రాడూన్: సీనియర్ ఐఏఎస్ అధికారి ఉత్పల్ కుమార్ సింగ్ లోక్‌సభ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాజీ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాత్సవ స్థానంలో ఉత్పల్ కుమార్ సింగ్‌ను ఎన్నిక చేసిన్నట్లు సచివాలయం సోమవారం ప్రకటన వెలువరించింది. ఉత్తరాఖండ్ కేడర్ 1986 ఐఏస్ బ్యాచ్‌కు చెందిన ఆయన డిసెంబర్ 1వ తేదీన లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టానున్నారు. కేబినెట్ సెక్రటరీ హోదాలో లోక్‌సభ జనరల్ సెక్రటరీగా ఉత్పల్ సింగ్‌ను కొనసాగుతారని సచివాలయం తన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఉత్పల్ కుమార్ సింగ్‌ను లోక్‌సభ సచివాలయంలో కార్యదర్శిగా ఉన్నారు. రెండేళ్లకు పైగా ఆయన ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయనకు 34 ఏళ్ల అనుభవం ఉందని సచివాలయం తన ప్రకటనలో వెల్లడించింది. అంతేగాక ఉత్పల్ కుమార్ సింగ్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు పలు రంగాల్లో మెరుగైన సేవలు అందించారని, ఆయన హయాంలో రాష్ట్రం ఆయా రంగాల్లో అభివృద్దిని సాధించిందని సచివాలయం తెలిపింది. -
ఏబీవీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక
సాక్షి, అమరావతి బ్యూరో: ఏబీవీపీ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డా. ఎస్ సుబ్బయ్య (తమిళనాడు), ఆశీష్ చౌహాన్(హిమాచల్‌ప్రదేశ్)లు మళ్లీ ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల్లో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎలక్షన్ ఆధికారి మమతా యాదవ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 27న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరగనున్న ఏబీవీపీ జాతీయ సమావేశాల్లో వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ఏడాదిపాటు బాధ్యతలు నిర్వహించనుంది. -
సి రామచంద్రయ్యకు కీలక బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి సి రామచంద్రయ్య ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన రామచంద్రయ్య 1981లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పలు పార్టీల్లో కీలక పదవులను అలంకరించిన ఆయన రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించారు. ఇటీవల వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన సేవలను తగువిధంగా వినియోగించుకుంటామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాటిచ్చారు. చదవండి : వైఎస్సార్ సీపీలో చేరిన రామచంద్రయ్య -
చిన్నమ్మే మమ్మల్ని నడిపించాలి: సీఎం
చెన్నై: చిన్నమ్మ శశికళే పార్టీ ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి అన్నాడీఎంకేను ముందుకు నడిపించాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆదివారం కోరారు. ఈ విషయంలో మరో ఆలోచన లేదని, అలాంటిది ఏదైనా ఉంటే వారు నిజమైన అన్నాడీఎంకే కార్యకర్తలు కారని సెల్వం అన్నట్లు జయ ప్లస్ టీవీ పేర్కొంది. జయలలిత బాధల్లో శశికళ అండగా నిలబడ్డారని సెల్వం అన్నట్లు చెప్పింది. 30 ఏళ్లకు పైగా అమ్మతో కలిసి పనిచేసిన శశికళకు పార్టీని ఎలా నడపాలో తెలుసునని సెల్వం అన్నారు. అంతేకాకుండా అమ్మ లాగే శశికళ పార్టీలోని ప్రతి కార్యకర్తకు తెలుసని చెప్పారు. పార్టీలో పరిపాలన సజావుగా సాగాలంటే కచ్చితంగా చిన్నమ్మే పగ్గాలు అందుకోవాలని పేర్కొన్నారు. కాగా, పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టాలని శనివారం పలువురు అన్నాడీఎంకే నేతలు శశికళను కలిసి మొరపెట్టుకున్న విషయం తెలిసిందే.