విష్ణుపై తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు
విష్ణుపై తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు
Published Tue, Jan 10 2017 11:53 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
- ప్యాలకుర్తి జన్మభూమి గ్రామసభ గందగోళం
- అర్ధంతరంగా ముగిసిన కార్యక్రమం
కోడుమూరు రూరల్ : టీడీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డిపై తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు చేశారు. మండలంలోని ప్యాలకుర్తిలో మంగళవారం సర్పంచ్ మునిస్వామి అధ్యక్షతన నోడల్ అధికారి భాస్కర్‌రెడ్డి..జన్మభూమి గ్రామ సభ నిర్వహించారు. రేషన్‌కార్డులు, ఇళ్లు, పింఛన్ల మంజూరు కోసం జన్మభూమి కమిటీ సభ్యులు డబ్బులు వసూలు చేస్తున్నారని, అక్రమాలకు పాల్పడే సభ్యులపై క్రిమినల్ కేసులు పెట్టిస్తానంటూ సభలో ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. విష్ణు వ్యాఖ్యలతో ప్యాలకుర్తికి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు ఉగాది వెంకటేశ్వర్లు, రంగన్న, మరికొందరు విభేదించారు. అక్రమ వసూళ్లు చేసివుంటే చూపించాలంటూ బహిరంగ సవాల్ విసిరారు. ఇరువర్గాల వాగ్వాదంతో సభ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇదిలా ఉండగా..సభను పంచాయతీ కార్యాలయం వద్ద కాకుండా..ప్రాథమిక పాఠశాలలో నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని భయపడి అధికారులు ఇలా చేశారనే ఆరోపణలు వచ్చాయి.
Advertisement