
వ్యవసాయ కార్మిక సంఘం భారీ ర్యాలీ
కరీంనగర్‌లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రథమ మహాసభలను పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహించారు.
కరీంనగర్: కరీంనగర్‌లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రథమ మహాసభలను పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ స్టేడియం నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో వేలాది మంది వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు. అనంతరం జరుగనున్న బహిరంగ సభలో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ప్రసంగించనున్నారు.