మొబైల్స్‌ ఎందుకు బ్యాన్‌ చేస్తానంటే..?: మోదీ | PM Modi Shares Why He Banned Mobile Phones In His Meetings | Sakshi
Sakshi News home page

మొబైల్స్‌ ఎందుకు బ్యాన్‌ చేస్తానంటే..?: మోదీ

Published Fri, Apr 21 2017 3:38 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

మొబైల్స్‌ ఎందుకు బ్యాన్‌ చేస్తానంటే..?: మోదీ - Sakshi

మొబైల్స్‌ ఎందుకు బ్యాన్‌ చేస్తానంటే..?: మోదీ

న్యూఢిల్లీ: తన సమావేశాల్లో మొబైల్‌ ఫోన్లను నిషేధించడానికి గల కారణాలను ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. అలా తానెందుకు చేస్తానో అనే విషయాన్ని పంచుకున్నారు. ‘ఈ మధ్యకాలంలో నేను చాలా సమావేశాలు చూస్తున్నాను. జిల్లా అధికారులంతా తమ ఫోన్లల్లో బిజీ బిజీ బిజీగా ఉంటున్నారు.. అందుకే నేను సమావేశాల్లో మొబైల్‌ఫోన్లను బ్యాన్‌ చేశాను. ప్రజలు ఈ గవర్నెన్స్‌ నుంచి మొబైల్‌ గవర్నెన్స్‌ మారారు. అది ఈరోజు వాస్తవంలో కనిపిస్తుంది’ అని మోదీ చమత్కరించారు.

సివిల్‌ సర్వీస్‌ డే సందర్భంగా మాట్లాడిన మోదీ ప్రభుత్వ ఉద్యోగులు నిర్వర్తించాల్సిన విధుల విషయంలో ఎంత బాధ్యతగా ఉండాలనే విషయాన్ని మోదీ మరోసారి చెప్పారు. పనిచేసే పద్ధతిలో మార్పు కనిపించాలని, కొత్త నిర్వచనం చెప్పాలని మోదీ అన్నారు. సంస్కరణలు తీసుకురావాలనే రాజకీయ అభిలాష నాకుంది. కానీ, ఆ పథకాలను, విధానాలను సక్రమంగా అమలుచేసే ఉద్యోగులు మీరు’  అని మోదీ సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement