సాక్షి, అమరావతి : వైఎస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ కార్యక్రమాలతో పొదుపు సంఘాల మహిళలు రాష్ట్రమంతటా సంబరాలు చేసుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్రమంతటా 83 మండలాల్లో పొదుపు సంఘాల మహిళల లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయా ప్రాంత పొదపు సంఘ మహిళలకు ప్రభుత్వం మూడో విడతలో అందజేస్తున్న ఆర్థిక మొత్తం చెక్కులను అందజేసి, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సందేశాన్ని వారికి వినిపించారు.
మహిళలు సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ కృతజ్ఞతలు తెలియజేయగా, కొన్ని చోట్ల ‘థాక్యూ సీఎం సార్’ «‘థాంక్యూ జగనన్నా..’ అని రాసిన మట్టి కుండలను ప్రదర్శిస్తూ సంతోషాన్ని వ్యక్తంచేశారు. మార్చి 25న సీఎం వైఎస్ జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో ‘వైఎస్సార్ ఆసరా’ మూడో విడత పంపిణీని లాంఛనంగా ప్రారంభించగా, ఏప్రిల్ 5వ తేదీ వరకు మహిళలతో ముఖాముకి నిర్వహిస్తూ, వారికి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 346 మండలాల్లో పొదుపు సంఘాల మహిళలతో ముఖాముఖి సమావేశాలు జరిగినట్లు సెర్ప్ సీఈవో ఏఎండీ ఇంతియాజ్ ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment