నేటి నుంచి బీఆర్‌ఎస్‌ సమావేశాలు | BRS: Meeting with leaders of Adilabad segment on the first day | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బీఆర్‌ఎస్‌ సమావేశాలు

Published Wed, Jan 3 2024 2:11 AM | Last Updated on Wed, Jan 3 2024 2:11 AM

BRS: Meeting with leaders of Adilabad segment on the first day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా బుధవారం నుంచి సన్నాహక సమావేశా లు నిర్వహించేందుకు భారత్‌ రాష్ట్ర సమితి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండు విడతలుగా రోజుకో లోక్‌సభ నియో జకవర్గం చొప్పున భేటీలు జరుగుతాయి. తొలి రోజు బుధవారం ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజక వర్గం పరిధిలోని పార్టీ నేతలతో సమావేశం ఏర్పా టు చేశారు.

తెలంగాణ భవన్‌లో ఉదయం 10.30 కు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు అధ్య క్షతన  ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఆదిలా బాద్‌ మాజీ ఎంపీ గోడెం నగేశ్‌తో పాటు ఎమ్మెల్యే లు అనిల్‌ జాధవ్, కోవా లక్ష్మి, ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజక వర్గాల ఇన్‌చార్జిలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సుమారు 500 మంది పాల్గొంటారు. 

సీనియర్‌ నేతలకు సమన్వయ బాధ్యతలు 
సన్నాహక సమావేశాలను కేటీఆర్‌తో పాటు పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, మాజీ స్పీకర్లు పోచా రం శ్రీనివాస్‌ రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి తదితరులు సమన్వ యం చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో లోక్‌సభ నియోజ కవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించే అవకాశా లు ఉన్నాయి. కాగా ఈ సన్నాహక సమావేశాల్లో పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచర ణపై దిశానిర్దేశం చేస్తారు. 

కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీ
లోక్‌సభ సన్నాహక సమావేశాల ప్రారంభం నేపథ్యంలో కేటీఆర్‌ మంగళవారం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేయాల్సిన అంశాలను కేసీఆర్‌ వివరించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో తొలిసారిగా పార్టీ కీలక నేతలందరూ హాజరవుతుండటంతో ఈ సన్నాహక సమావేశాలపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement