రాజన్నా.. ఇటూ చూడండి | See .. the only thing Rajan | Sakshi
Sakshi News home page

రాజన్నా.. ఇటూ చూడండి

Published Thu, Jun 26 2014 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

See .. the only thing Rajan

  •      అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలకు ముంచుకొస్తున్న ముప్పు
  •      ఈ ఏడాది ప్రవేశాలపై నీలినీడలు
  •      వసతుల లేమిని గుర్తించిన సీసీఐఎం బృందం
  • పోచమ్మమైదాన్ : రాష్ర్ట ఉప ముఖ్యమంత్రిగానే కాదు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన డాక్టర్ టి.రాజయ్య ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే వరంగల్‌లోని కేఎంసీ, ఎంజీఎం ఆస్పత్రులను తనిఖీ చేసి సమస్యలను గుర్తించారు. వీటి పరిష్కారానికి నిధులు మంజూరు చేయిస్తానంటూ హామీ ఇచ్చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వరంగల్‌లోని అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాలకు అనుమతి లభించే అవకాశం లేదని ప్రచారం జరుగుతుండడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు.

    వసతుల లేమి, సిబ్బంది కొరత కారణంగా గతంలో రెండేళ్ల పాటు ప్రవేశాలకు సెంట్రల్ కౌన్సి ల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) అనుమతి నిరాకరించిన విషయం విదితమే. గత ఏడాది ఏదో ఓ విధంగా షరతులతో కూడిన అనుమతి(కండీషనల్) లభించింది. అప్పట్లో ఉన్న సమస్యల్లో హాస్టల్ సౌకర్యం మినహా మిగ తా ఏ ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఈసారి ప్రవేశాలకు అనుమతి లభిస్తుందా, లేదా అనేది సందేహంగా మారింది.
     
    1956లో ప్రారంభం

     
    వరంగల్‌లోని లేబర్ కాలనీలో 1956వ సంవత్సరంలో అ నంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలను ప్రారంభించారు. బీఏఎంఎస్ కోర్సు కోసం ఏటా 50మంది విద్యార్థులకు ఈ కళాశాలలో ప్రవేశాలు కల్పిస్తారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్‌లో ఉన్న ఈ కళాశాల అభివృద్ధిపై గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఎప్పటికప్పుడు సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి.
     
    సిబ్బంది కొరత...
     
    అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలను సి బ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) నిబంధనల ప్రకారం 35 మంది సిబ్బంది ఉండాలి. కనీసం 30మందిని అయినా ని యమించాల్సి ఉండగా.. ప్రస్తుతం 25 మందే ఉన్నారు. ఈ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న వారు బదిలీపై వెళ్తుండడం, ఉద్యోగ విరమణ చేస్తుండడమే తప్ప కొత్తగా వచ్చే వారు లేరు. ఫలితంగా అనాటమీ, కాయ చికిత్స, శాల్య, కౌమార భృతి, ద్రవ్యగుణ వంటి విభాగాల్లో ప్రొఫెసర్లు, అనాటమీ, ద్రవ్యగుణ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మౌలిక సిద్ధాంతాలు, అనాటమీ, శ్వస్త వృత్తం, కా య చికిత్స, పంచకర్మ విభాగాలకు అధ్యాపకులే లేరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

    ఇక కళాశాలకు బస్సు, సరైన ల్యాబ్, ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవని గుర్తించిన సీసీఐఎం బృందం 2011-12, 2012-13 విద్యాసంవత్సరా ల్లో ప్రవేశాలకు అనుమతి ఇవ్వలేదు. 2013-14లో మాత్రం ఇక్కడి ప్రజాప్రతినిధుల ఒత్తిడితో కండీషనల్ అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కేవలం హాస్టల్ వసతి మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
     
    ఇప్పటికే పూర్తయిన పర్యటన
     
    2014-15 విద్యాసంవత్సరానికి అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలకు ప్రవేశాల అనుమతి ఇచ్చేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో సీసీఐఎం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా వారు అనేక సమస్యలు గుర్తించారు. అంటే గత ఏడాది పర్యటన తర్వాత ఇప్పటి వరకు కళాశాల అభివృద్ధి, సౌకర్యాల కల్పన, సిబ్బంది నియామకంపై పా లకులు ఎలాంటి చొరవ చూపలేదని తేటతెల్లమవుతోంది. గత ఏడాది ప్రవేశాలకు అనుమతి ఇచ్చే సమయంలో అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్న టి.రాజయ్య ఈ కళాశాలను సందర్శించారు.

    ఇప్పుడు తెలంగాణ రాష్ర్టం ఏర్పడడమే కాకుండా టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. జిల్లాకే చెందిన టి.రాజయ్య రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పటికే కేఎంసీ, ఎంజీఎం ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన దరిమిలా... ప్రాచీన వైద్యమైన ఆయుర్వేదాన్ని బతికించుకునేందుకు అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలలోని సమస్యలను కూడా పరిష్కరించడమే కాకుండా ఈ ఏడాది ప్రవేశాలకు అనుమతి లభించేలా చొరవ చూపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. లేనిపక్షంలో మరో పదిహేను రోజుల్లో ప్రారంభం కానున్న బీఏఎంఎస్ ప్రవేశాల ప్రక్రియలో వరంగల్‌లోని అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాల పేరు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement