rajayya
-
తాటి వనంలో కళ్ళు తాగిన ఎమ్మెల్యే రాజయ్య
-
మనం గెలిస్తే కేసీఆర్ సీఎం
సాక్షి, జనగామ: ‘మనం గెలిస్తే రాష్ట్రంలో కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టంగా చెబుతున్నాం. అదే కాంగ్రెస్ పార్టీలో 40 మంది పోటీపడుతున్నారు. ఎవరు సీఎం అవుతారో చెప్పే దమ్ము ఆ పార్టీకి లేదు. ఢిల్లీ నుంచి పంపే సీల్డ్ కవర్ల సంస్కృతి ఆ పార్టీది’అని మంత్రి కల్వకంట్ల తారక రామారావు విమర్శించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కోర్టుల పేరుతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అడ్డుపడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని ప్రజాకోర్టులో తెలుసుకోవడం కోసమే ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్లు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ, కోదండరాం, సీపీఐ కూటమి కట్టి సీట్ల కోసం కుస్తీలు పడుతున్నారన్నారు. ‘వాళ్లు సీట్లు పంచుకునేలోపు మనం గెలిచి స్వీట్లు పంచుకోవడం పక్కా’అని అన్నారు. జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఈ ఎన్నికల్లో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు అప్పుడు అవకాశం కల్పిస్తామన్నారు. ‘కాబోయే లీడర్ కేటీఆర్ సాక్షిగా చెబుతున్నా.. మన పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తాను’అని ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన ఘన్పూర్ అభివృద్ధి కోసం పూర్తి పూచీకత్తును తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు. పార్టీ అభ్యర్థి టి.రాజయ్య తన పట్ల తప్పుగా ప్రవర్తించినా ఎప్పుడు నేను అసమ్మతి వ్యక్తం చేయలేదన్నారు. మహాకూటమికి ఘోర పరాభవం తప్పదు ఇబ్రహీంపట్నం రూరల్: ఈ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు ఘోర పరాభవం తప్పదని కేటీఆర్ అన్నారు. కూటమిలో సీట్ల కోసం కిందామీద పడుతున్నారని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం మంగళవారం బొంగుళూరు సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగింది. కేటీఆర్ మాట్లాడుతూ రోజూ వస్తున్నాం.. పోతున్నాం.. సీట్ల పంచాయితీ తెగడం లేదని కోదండరాం సార్ చెబుతున్నారని, ‘ఎల్లయ్యకు ఎడ్లులేవు.. మల్లయ్యకు బండి లేదు’అన్నట్లుగా.. టీడీపీకి కేడర్ లేదు, కాంగ్రెస్‌కు లీడర్లు లేరని ఎద్దేవా చేశారు. మహాకూటమి పొరపాటున అధికారంలోకి వస్తే నెలకొక ముఖ్యమంత్రి 60 నెలలు 60 మంది ముఖ్యమంత్రులు మారే పరిస్థితి దాపురిస్తుందన్నారు. లిపాప (కవర్) నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఊడిపడతారని, సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కావాలా.. సింహం లాంటి మన కేసీఆర్ సీఎం కావాలో మీరే ఆలోచించుకోవాలని కేటీఆర్ ప్రజలను కోరారు. సమావేశంలో భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, శాసన మండలి చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర విద్య, వనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్‌గౌడ్, టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ సమక్షంలో కార్యకర్తల నిరసన రాజయ్య మాట్లాడుతున్న సమయంలో ‘కడియం శ్రీహరి నాయకత్వం వర్ధిల్లాలి’అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. శ్రీహరి మాట్లాడానికి ఉపక్రమిస్తున్న సమయంలో కడియంకు అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాజయ్యకు మద్దతు వద్దంటూ నినదించారు. లేచి నిలబడి ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. కడియం వారిని శాంతింపచేయడానికి ప్రయత్నించారు. కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలోనూ రాజయ్య వద్దంటూ కార్యకర్తలు నిరసన తెలిపారు. కడియం, రాజయ్య మధ్య వర్గపోరు తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మాజీమంత్రి మల్యాల రాజయ్య కన్నుమూత
జోగిపేట /హైదరాబాద్: మాజీమంత్రి, పార్లమెంట్ మాజీ సభ్యుడు మల్యాల రాజయ్య(82) బ్రెయిన్ స్ట్రోక్‌తో కన్నుమూశారు. సికింద్రాబాద్‌లోని సీతాఫల్మండి మేడిబావిలో నివసిస్తున్న రాజయ్య గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతి చెందారు. 1936లో కరీంనగర్ జిల్లా వెదిర గ్రామంలో జన్మించిన రాజయ్యకు భార్య అనసూయదేవి, కుమారుడు, ఇద్దరు కుమా ర్తెలున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ, ఎల్.ఎల్.బి చేసిన రాజయ్య మొదట న్యాయవాదిగా పనిచేశారు. ఆ తరువాత జడ్జీగా చీరాల, కల్వకుర్తి, హైదరాబాద్, సిటీ సివిల్ కోర్టుల్లో పనిచేశారు. 1984లో రాజకీయాల్లోకి వచ్చిన రాజయ్య 1985, 1989, 1994లో టీడీపీ తరఫున అందోల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1998, 1999ల్లో సిద్దిపేట నుంచి ఎంపీగా గెలిచారు. 2006లో టీఆర్ఎస్లో చేరి కొంతకాలం తర్వాత తిరిగి టీడీపీలో చేరా రు. రాజయ్య అంత్యక్రియలను మంగళవారం ఉదయం 10 గంటలకు సీతాఫల్మండి శ్మశానవాటికలో నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సీతాఫల్మండి మేడిబావి గృహంలో రాజయ్య మృతదేహాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ సంతాపం రాజయ్య మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రజాప్రతినిధిగా ఆయన సేవలను స్మరించుకున్నారు. రాజయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
రాజయ్య పద్ధతి మార్చుకోవాలి : కడియం
సాక్షి, హైదరాబాద్ : స్టేషన్ ఘన్పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్య! పద్ధతి మార్చుకోవాలని, ‘నా నియోజకవర్గం’ అని అనకుండా మనది అనాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హితవు పలికారు. కలహాలు మాని కలిసి పనిచేయాల్సిందిగా రాజయ్యకు పిలుపునిచ్చారు. గురువారం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఓటు హక్కు వచ్చిన దగ్గరనుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని తెలిపారు. రూమర్లను పట్టించుకోకుండా కేసీఆర్ ఆదేశాల మేరకు రాజయ్య గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. టీఆర్ఎస్ బలపడాలన్నా, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్నా స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజయ్యను గెలిపించాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. రాజయ్య కూడా అందరిని కలుపుకునిపోవాలని, కేసీఆర్ పట్ల ఇష్టం ఉన్నవాళ్లు, కడియం శ్రీహరి అంటే అభిమానం ఉన్న వాళ్ళంతా రాజయ్య అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు. ఆయన తన ప్రసంగాన్నికొనసాగిస్తూ.. ‘‘జరిగిందేదో జరిగిపోయింది.. జరగాల్సింది చూడాలి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు తిరుగులేదు. మనమందరం కలిస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు. రాజయ్యకు నా పూర్తి సహాకారం ఉంటది, నన్ను అభిమానించే వారందరు పూర్తి స్థాయిలో రాజయ్యకు సహాకరించాలి. రాజయ్య వర్గీయులు, నా వర్గీయులు, ఉద్యమకారులు అంతా కలిసి స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఎగురవేయాల’ని అన్నారు. -
సారికది ఆత్మహత్యే కానీ..
♦ నిందితుల వేధింపుల వల్లే అఘాయిత్యానికి పాల్పడింది ♦ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు ♦ అనుమానాస్పద మృతిగా పేర్కొనే సెక్షన్ 174 తొలగింపు ♦ బెయిల్ కోసం రాజయ్య పిటిషన్.. 12కు వాయిదా పడ్డ విచారణ వరంగల్ లీగల్/సాక్షి, హన్మకొండ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల మృతి కేసులో పోలీసులు కోర్టుకు శనివారం రిమాండ్ రిపోర్టు సమర్పించారు. సారికది ఆత్మహత్యగానే భావిస్తున్నామని, అయితే భర్త అనిల్, మామ రాజయ్య, అత్త మాధవి, అనిల్ రెండో భార్య సనా వేధింపుల వల్లే జీవితంపై విరక్తి చెంది ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. వేధింపులు తాళలేక సారిక తన బెడ్రూమ్లోకి గ్యాస్ సిలిండర్లు, పిల్లలను తీసుకువెళ్లిందని, లోపలి నుంచి గడియ పెట్టుకొని గ్యాస్ లీక్ చేసి నిప్పంటించుకుందని తెలిపారు. ఘటన వెలుగుచూసిన తర్వాత పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 498 ఏ(వరకట్న వేధింపులు), 306(ఆత్మహత్యకు ప్రేరేపించడం), సీఆర్పీసీ సెక్షన్ 174(అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదు చేశారు. కానీ తాజాగా కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో మాత్రం సెక్షన్ 174ను చేర్చకపోవడం గమనార్హం. సారిక తల్లి లలిత, సోదరి అర్చనతో సహా చుట్టుపక్కల నివసించే ముగ్గురు వ్యక్తులు, రాజయ్య కారు డ్రైవర్లు ముగ్గురు, వివిధ గ్రామాలకు చెందిన రెవెన్యూ అధికారులను కలిపి మొత్తం 24 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. అనిల్, రాజయ్య, మాధవి.. సారికను ఒంటరిని చేసి వేధించారని వివరించారు. అనిల్ సనా అనే మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. రాజయ్య బెయిల్ పిటిషన్ రాజయ్య, ఆయన భార్య మాధవి శనివారం జిల్లా కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ నిమిత్తం కేసును రెండో అదనపు జిల్లా కోర్టుకు కేటాయించారు. పోలీసులు పేర్కొన్న విధంగా సారికపై తామెలాంటి వేధింపులకు పాల్పడలేదని రాజయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు... ఘటన జరిగిన ఇంట్లో తాము ఉండటం లేదని పేర్కొన్నారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా ఈ నెల 3న సాయంత్రం ఇంట్లోకి వచ్చామని, వేధింపులకు గురిచేసే అవకాశం గానీ, ఆత్మహత్యకు ప్రేరేపించే అవకాశం గానీ లేదని పేర్కొన్నారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 12కు వాయిదా పడింది. సనాను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం సంఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా కేసులో కీలక నిందితురాలైన అనిల్ రెండో భార్య సనాను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. ప్రత్యేక పోలీసు బృందాలతో ఆమె కోసం గాలిస్తున్నామని చెబుతున్నా.. పురోగతి కనిపించడం లేదు. అలాగే ఫోరెన్సిక్, క్లూస్‌టీమ్‌కు సంబంధించిన నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. ఇవేవీ రాకుండానే సారికది ఆత్మహత్య అన్నట్టుగా పోలీసులు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రాజయ్యూ.. వారు మారలేదయ్యూ...
పరిష్కారానికి నోచుకోని కేఎంసీ సమస్యలు నిర్దేశించిన గడువు దాటినా.. కానరాని మార్పు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజయ్య తొలిసారిగా జూన్ 16న వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి, కాకతీయ మెడికల్ కళాశాలలో పర్యటిం చారు. అధికారులతో సమీక్షించి సమస్యల పరిష్కారం దిశగా పలు సూచనలు చేశారు. 15 రోజుల గడువు కూడా విధించారు. నిర్దేశించిన గడువు దాటినా... ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కేఎంసీలో పరిస్థితులు ఉన్నారుు. సాక్షి, హన్మకొండ : డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజయ్య తొలిసారిగా జూన్ 16 కేఎంసీ, కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఎంజీఎం, కేఎంసీలలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేకంగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కేఎంసీలో స్వయంగా తిరిగి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. సమస్యలు పరిష్కరించాలంటూ అక్కడికక్కడే ఆదేశాలు జారీచేశారు. మంత్రి నిర్దేశించిన పదిహేను రోజుల గడువు పూర్తయినా సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. డిప్యూటీ సీఎం ఆదేశాలను అమలుచేయడంలో ఎంజీఎం, కేఎంసీ పరిపాలనా అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో పక్షం రోజులు గడిచినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. అధ్వానంగా హాస్టళ్ల నిర్వహణ కాకతీయ మెడికల్ కళాశాలలో పరిశుభ్రత మచ్చుకైనా కానరావడం లేదు. మెస్‌లు, బాత్రూంలు, టాయిలెట్లు.. ఇలా ప్రతీదీ కంపుకొడుతోంది. కాలం చెల్లిన ఫ్రిడ్జ్‌లు, పెచ్చులు ఊడుతున్న భవనాలు, దుమ్ముతో పేరుకుపోయిన మెస్, తలుపులు లేని టాయిలెట్లు, దుర్వాసన వెదజల్లుతున్న మూత్రశాలలు ఇప్పటికీ యథాస్థితిలోనే ఉన్నాయి. హాస్టల్ గదులకు రంగులు వేయడంతోపాటు శానిటేషన్ పనులు చేపట్టాలని మంత్రి రాజయ్య పర్యటన సందర్భంగా ఆదేశించారు. అయినా వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందంగా ఉంది. హాస్టల్ భవనం, అందులోని గదులు భూత్బంగాళాను తలపిస్తున్నాయి. కాలేజీలో డ్రైనేజీ వ్యవస్థే లేకపోవడం గమనార్హం. మెస్‌లో భోజనం చేశాక చేతులు కడుక్కునే ఏర్పాటు కూడా లేకపోవడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. మెస్ కిచెన్‌లో గ్యాస్ మాత్రమే ఉపయోగించాలన్న ఆదేశాలూ బుట్టదాఖలవుతున్నాయి. అన్నింటికీ ఇబ్బందులే.. కేఎంసీలో మూడు బాయ్స్ హాస్టళ్లున్నాయి. వీటిలో పాత హాస్టల్‌కు నీరు సక్రమంగా అందకపోవడంతో మరో హాస్టల్‌కి వెళ్లి స్నానం చేయాల్సి వస్తోందని కేఎంసీకి వచ్చిన డిప్యూటీ సీఎంకు విద్యార్థులు అప్పట్లో మొరపెట్టుకున్నారు. దీంతో కళాశాలకు అదనంగా తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను రాజయ్య ఆదేశించారు. అదేవిధంగా లోవోల్టేజీ కారణంగా హాస్టల్లోని రీడింగ్ రూముల్లో లైట్లు సక్రమంగా పనిచేయడం లేదని, దీనివల్ల పరీక్షల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మెడికల్ విద్యార్థులు విన్నవించారు. స్పందించిన మంత్రి.. కేఎంసీ ఆవరణలోని అరెకరం స్థలంలో సబ్‌స్టేషన్‌కు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. కానీ ఇంతవరకు వీటికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మంత్రి వచ్చి వెళ్లిన తర్వాత ఒక్క అధికారి కూడా హాస్టల్‌ను సందర్శించిన దాఖలాలు లేవని విద్యార్థులు చెబుతున్నారు. సమస్యల్లో నర్సింగ్ విద్యార్థులు రీడింగ్ రూంకు ఫర్నిచర్ కావాలని నర్సింగ్ విద్యార్థులు.. మంత్రి రాజయ్యను కోరడంతో పీజీ హాస్టల్లో లక్షల రూపాయల విలువచేసే టేకు ఫర్నిచర్‌కు మర్మతులు చేయించి నర్సింగ్ విద్యార్థులకు అప్పగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అయితే అధికారులు మాత్రం కిందిగదిలో ఉన్న ఫర్నిచర్‌ను పై గదుల్లోకి తరలించి చేతులు దులుపుకున్నారు తప్పితే రీడింగ్ రూం సంగతి పట్టించుకోలేదు. అంతేకాక విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాల్సి ఉండగా ఆ ఊసెత్తేవారే కరువయ్యారు. కానరాని హెల్ప్‌డెస్క్ నిత్యం వేలాదిమంది రోగులు, వారి బంధువులు వచ్చే ఎంజీఎం ఆస్పత్రిలో ఏ రోగి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని ఎంపీ సీతారాంనాయక్ కోరారు. ఇందుకోసం పీఆర్ఓలుగా కొనసాగుతున్న ఉద్యోగులను ఉపయోగించుకోవాలని సూచించారు. కాస్త శ్రద్ధ పెడితే పరిష్కారం లభించే సమస్య అయినా సరే అధికారులు హెల్ప్‌డెస్క్ ఏర్పాటుకు ముందుకు రాలేదు. -
రాజన్నా.. ఇటూ చూడండి
అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలకు ముంచుకొస్తున్న ముప్పు ఈ ఏడాది ప్రవేశాలపై నీలినీడలు వసతుల లేమిని గుర్తించిన సీసీఐఎం బృందం పోచమ్మమైదాన్ : రాష్ర్ట ఉప ముఖ్యమంత్రిగానే కాదు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన డాక్టర్ టి.రాజయ్య ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే వరంగల్‌లోని కేఎంసీ, ఎంజీఎం ఆస్పత్రులను తనిఖీ చేసి సమస్యలను గుర్తించారు. వీటి పరిష్కారానికి నిధులు మంజూరు చేయిస్తానంటూ హామీ ఇచ్చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వరంగల్‌లోని అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాలకు అనుమతి లభించే అవకాశం లేదని ప్రచారం జరుగుతుండడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. వసతుల లేమి, సిబ్బంది కొరత కారణంగా గతంలో రెండేళ్ల పాటు ప్రవేశాలకు సెంట్రల్ కౌన్సి ల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) అనుమతి నిరాకరించిన విషయం విదితమే. గత ఏడాది ఏదో ఓ విధంగా షరతులతో కూడిన అనుమతి(కండీషనల్) లభించింది. అప్పట్లో ఉన్న సమస్యల్లో హాస్టల్ సౌకర్యం మినహా మిగ తా ఏ ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఈసారి ప్రవేశాలకు అనుమతి లభిస్తుందా, లేదా అనేది సందేహంగా మారింది. 1956లో ప్రారంభం వరంగల్‌లోని లేబర్ కాలనీలో 1956వ సంవత్సరంలో అ నంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలను ప్రారంభించారు. బీఏఎంఎస్ కోర్సు కోసం ఏటా 50మంది విద్యార్థులకు ఈ కళాశాలలో ప్రవేశాలు కల్పిస్తారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్‌లో ఉన్న ఈ కళాశాల అభివృద్ధిపై గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఎప్పటికప్పుడు సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. సిబ్బంది కొరత... అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలను సి బ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) నిబంధనల ప్రకారం 35 మంది సిబ్బంది ఉండాలి. కనీసం 30మందిని అయినా ని యమించాల్సి ఉండగా.. ప్రస్తుతం 25 మందే ఉన్నారు. ఈ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న వారు బదిలీపై వెళ్తుండడం, ఉద్యోగ విరమణ చేస్తుండడమే తప్ప కొత్తగా వచ్చే వారు లేరు. ఫలితంగా అనాటమీ, కాయ చికిత్స, శాల్య, కౌమార భృతి, ద్రవ్యగుణ వంటి విభాగాల్లో ప్రొఫెసర్లు, అనాటమీ, ద్రవ్యగుణ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మౌలిక సిద్ధాంతాలు, అనాటమీ, శ్వస్త వృత్తం, కా య చికిత్స, పంచకర్మ విభాగాలకు అధ్యాపకులే లేరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక కళాశాలకు బస్సు, సరైన ల్యాబ్, ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవని గుర్తించిన సీసీఐఎం బృందం 2011-12, 2012-13 విద్యాసంవత్సరా ల్లో ప్రవేశాలకు అనుమతి ఇవ్వలేదు. 2013-14లో మాత్రం ఇక్కడి ప్రజాప్రతినిధుల ఒత్తిడితో కండీషనల్ అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కేవలం హాస్టల్ వసతి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే పూర్తయిన పర్యటన 2014-15 విద్యాసంవత్సరానికి అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలకు ప్రవేశాల అనుమతి ఇచ్చేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో సీసీఐఎం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా వారు అనేక సమస్యలు గుర్తించారు. అంటే గత ఏడాది పర్యటన తర్వాత ఇప్పటి వరకు కళాశాల అభివృద్ధి, సౌకర్యాల కల్పన, సిబ్బంది నియామకంపై పా లకులు ఎలాంటి చొరవ చూపలేదని తేటతెల్లమవుతోంది. గత ఏడాది ప్రవేశాలకు అనుమతి ఇచ్చే సమయంలో అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్న టి.రాజయ్య ఈ కళాశాలను సందర్శించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ర్టం ఏర్పడడమే కాకుండా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. జిల్లాకే చెందిన టి.రాజయ్య రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పటికే కేఎంసీ, ఎంజీఎం ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన దరిమిలా... ప్రాచీన వైద్యమైన ఆయుర్వేదాన్ని బతికించుకునేందుకు అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలలోని సమస్యలను కూడా పరిష్కరించడమే కాకుండా ఈ ఏడాది ప్రవేశాలకు అనుమతి లభించేలా చొరవ చూపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. లేనిపక్షంలో మరో పదిహేను రోజుల్లో ప్రారంభం కానున్న బీఏఎంఎస్ ప్రవేశాల ప్రక్రియలో వరంగల్‌లోని అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాల పేరు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. -
ప్రతి వ్యక్తికీ వైద్యం
ఏజెన్సీలో మందుల కొరత లేకుండా చూడాలి మాత, శిశు మరణాలు అరికట్టాలి ముంపు గ్రామాలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలి ఏజెన్సీలో సర్కారు వైద్యం విస్తరించాలి అధికారులకు డిప్యూటీ సీఎం రాజయ్య ఆదేశం ఐటీడీఏలోని వైద్య, ఆరోగ్యశాఖ, జీసీసీపై సమీక్ష సివిల్ ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తనిఖీ ఏటూరునాగారం : ఏజెన్సీలోని ప్రతి వ్యక్తికీ సర్కారు వైద్యం అందాలని, అటవీ గ్రామాల్లోని ప్రతి వ్యక్తికి వైద్య సేవలు అందించే విధంగా వైద్య, ఆరోగ్యశాఖ సేవలు విస్తరించాలని డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య అధికారులను ఆదేశించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) కార్యాలయంలో సోమవారం గిరిజన సంక్షేమం, వైద్య, ఆరోగ్యశాఖల అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీలో మాత, శిశు మరణాలు అరికట్టేందుకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల గోడలపై వైద్యులు, సిబ్బంది పేర్లు, సెల్ నంబర్లు తప్పకుండా రాయాలన్నారు. స్థానికంగా ఉండని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 53 ముంపు గ్రామాలకు ముందస్తుగా మందులు వర్షకాలంలో 53 గ్రామాల ముంపు బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముందస్తుగానే మందులను నిల్వ ఉంచాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులను విడివిడిగా సమస్యలు, సౌకర్యాలు, అందించిన సేవల విషయాలను అడిగి తెలుసుకున్నారు. క్లోరినేషన్, శానిటేషన్, జ్వరాల నిర్మూల కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని డీఎంహెచ్ఓ పిల్లి సాంబశివరావు డిప్యూటీ సీఎంకు తెలిపారు. గత ఏడాదిలో జిల్లాలో 10520 పైలేరియా కేసులు నమోదయ్యూనని చెప్పారు. జవహర్ ఆరోగ్య రక్ష పథకంలో భాగంగా 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. ములుగులో బ్లడ్ బ్యాంక్, ట్రామా కేర్ సెంటర్, ఇంకా 15 సబ్‌సెంటర్లు, 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యేవిధంగా చూడాలని ఉప ముఖ్యమంత్రికి విన్నవించారు. తాడ్వాయి మండలం మేడారంలో 30 పడకాల ఆస్పత్రి కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. జీసీసీ ద్వారా మరింత సేవలు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా ముంపు గ్రామాలకు మూడు నెలల పాటు సరిపడే నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలని జీసీసీ డీఎం జోగేశ్వర్రావును డిప్యూటీ సీఎం ఆదేశించారు. జీసీసీ ద్వారా పెట్రోల్ బంక్‌లు, తేనెశుద్ధి, సబ్బు కర్మాగారం, గిరిజన సూపర్ బజార్లు, జనరిక్ మందులు, ఎల్పీజీ గ్యాస్‌ల గోదాం, మిర్చి కోల్డ్ స్టోరేజ్‌లను నిర్మిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని జోగేశ్వర్రావు వివరించారు. ఐటీడీఏ సెక్టార్ అధికారులతో రివ్యూ గిరిజన సంక్షేమం ఇంజినీరింగ్ విభాగంలో ఇప్పటి వరకు ఎన్ని భవనాలు పూర్తయ్యాయి, ఇంకా పూర్తి కావాల్సిన పనులపై ఈఈ వసంత డిప్యూటీ సీఎంకు వివరించారు. ఇంజనీరింగ్ విభాగం నుంచి 29 పథకాల ద్వారా 876 పనులకు గాను 496 పనులు పూర్తి కాగా, 225 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈజీఎస్ కింద మారుమూల అటవీ గ్రామాలకు అనుసంధానం చేస్తూ 101 మెటల్ రోడ్లు నిర్మాణాలు పూర్తయ్యాయని, ఐఏపీ కింద 64 సీసీ రోడ్లు పూర్తి చేసినట్లు వసంత పేర్కొన్నారు. మైనర్ ఇరిగేషన్ ద్వారా 68 పనులు చేపట్టగా.. 24 పూర్తి చేశామని, 44 పురోగతిలో ఉన్నాయని మైనర్ ఇరిగేషన్ ఈఈ సుధీర్ వివరించారు. రోడ్డు విస్తరణ ఎప్పుడు? ఏటూరునాగారం నుంచి పస్రా వరకు ఉన్న సింగిలేన్ ఎందుకు విస్తరణ జరగడం లేదని ఎన్‌హెచ్ ఈఈ సత్యనారాయణను రాజయ్య ప్రశ్నించారు. సమీక్ష సమావేశంలో ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే చందూలాల్, కలెక్టర్ కిషన్, ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావు, డిపూటీ డీఎంహెచ్ఓ దయానందస్వామి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్‌కుమార్, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ కృష్ణజ్యోతి, డీఎఫ్ఓ లింగారావు, ములుగు ఆర్డీఓ మోతీలాల్, డిప్యూటీ డెరైక్టర్ సావిత్రి, ఎంపీడీఓ, తహసీల్దార్లు, సీడీపీఓలు, ఐటీడీఏ మేనేజర్ సురేందర్, డీఎస్ఓ సురేష్‌బాబు పాల్గొన్నారు. ఆస్పత్రుల తనిఖీ అంతకుముందు మంత్రి రాజయ్య ములుగు సివిల్ ఆస్పత్రి, తాడ్వారుు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా కొందరు రోగులను పరీక్షించారు. ఆస్పత్రులలో మాజీ ముఖ్యమంత్రి ఫొటోలు ఉండడం చూసిన రాజయ్య..అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పెద్ద సార్ ఆశయాల కనుగుణంగా...తెలంగాణ
బంగారు తెలంగాణే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషిచేయాలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలంగాణ జాతిపితకుఘన నివాళి హన్మకొండ సిటీ : ‘పెద్ద సార్ చూపిన మార్గంలో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అందరం భాగస్వాములై కొత్త పల్లి జయశంకర్ ఆశించిన తెలంగాణను నిర్మిం చుకుందాం. బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగాలి.’ అని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ మూడో వర్ధంతిని పురస్కరించుకుని హన్మకొండ ఏకశిల పార్కులోని ఆయన విగ్రహానికి డిప్యూటీ సీఎంతోపాటు శాసన సభా స్పీకర్ సిరికొండ మధుసూద నాచారి, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, కలెక్టర్ జి.కిషన్ పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ ఊపిరి పోశారన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, తెలంగాణ దార్శనికుడని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు నిరంతరం ఉద్యమించారన్నారు. మలిదశ ఉద్యమం ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించడంలో.. హింసకు తావులేకుండా పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఆయన మార్గదర్శకంగా నిలిచారన్నారు. ఏకశిల పార్కును జయశంకర్ సార్ స్మృతి వనంగా తీర్చిదిద్దుతామన్నారు. కొత్తగా భూపాలపల్లి కేంద్రంగా ఏర్పాటు చేయనున్న జిల్లాకు జయశంకర్ పేరును పెడతామని పునరుద్ఘాటించారు. జయశంకర్ వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహిస్తోందని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి తెలిపారు. ఈ రోజు ఆయన లేకపోవడం దురదృష్టకరమన్నారు. వారు కోరుకున్న తీరులో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని... ప్రజలు ఆశించిన తెలంగాణను నిర్మించుకుందామన్నారు. వరంగల్ నగరంలోని ప్రధాన కూడలిలో జయశంకర్ కాంస్య విగ్రహాన్ని ఆరు నెలల్లో ఏర్పాటు చేయనున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు. దీంతోపాటు అధ్యయన కేంద్రం, గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మర్రి యాదవరెడ్డి, లలితా యాదవ్, లింగంపల్లి కిషన్‌రావు, నాగేశ్వర్రావు, గుడిమల్ల రవికుమార్, కమరున్నీసా బేగం, వాసుదేవరెడ్డి, నయూమొద్దీన్, మరుపల్లి రవి పాల్గొన్నారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో... ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉద్యోగ జేఏసీ నాయకులు పరిటాల సుబ్బారావు, జగన్మోహన్రా వు, కోల రాజేష్‌కుమార్, రత్నవీరాచారి, హసన్, రత్నాకర్ రెడ్డి, ధరంసింగ్, శ్యాం సుందర్, రమేశ్, శ్రీనివాస్, షేక్‌హుస్సేన్, శ్యామల రమేశ్ పాల్గొన్నా రు. కాగా, జయశంకర్ విగ్రహానికి కవులు, రచయితలు అంపశయ్య నవీన్, పొట్లపల్లి శ్రీనివాస్, నాగిళ్ల రామశాస్త్రి, అశోక్‌తోపాటు పలువురు సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
తెలంగాణ ఎంపీల మధ్య జల జగడం