సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ది దిశగా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 'మన నగరం' కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. నగరంలోని కుత్భుల్లాపూర్‌లో ప్రారంభించిన 'మన నగరం / ఆప్నా షెహర్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లను 50 కి పెంచుతున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఇకపై ప్రజల వద్దకే అధికారులు వస్తారని.. స్థానికంగా ఉన్న సమస్యలను వారికి చెప్పాలని సూచించారు.
సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు జరుగుతాయని.. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలతో నేరుగా అధికారులు చర్చిస్తారన్నారు. మనం మారుదాం - నగరాన్ని మారుద్దాం అనే నినాదంతో అప్నా షహర్ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు. కాగా, మెట్రో రైలును అపరిశుభ్రంగా మారుస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment