town hall
-
16న విద్యార్థులతో మోదీ ‘టౌన్ హాల్’ భేటీ
న్యూఢిల్లీ: పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా, సన్నద్ధమవ్వాల్సిన అవసరాన్ని వివరించేందుకు ప్రధాని∙మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులతో సమావేశం కానున్నారు. ఈ నెల 16న ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో లేదా ఇందిరా గాంధీ మైదానంలో విద్యార్థులతో ముచ్చటించనున్నారు. విద్యార్థుల ప్రశ్నలకు సామాజిక మాధ్యమాలు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ సమాధానాలిస్తారు. -
'మన నగరం' కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ది దిశగా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 'మన నగరం' కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. నగరంలోని కుత్భుల్లాపూర్‌లో ప్రారంభించిన 'మన నగరం / ఆప్నా షెహర్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లను 50 కి పెంచుతున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఇకపై ప్రజల వద్దకే అధికారులు వస్తారని.. స్థానికంగా ఉన్న సమస్యలను వారికి చెప్పాలని సూచించారు. సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు జరుగుతాయని.. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలతో నేరుగా అధికారులు చర్చిస్తారన్నారు. మనం మారుదాం - నగరాన్ని మారుద్దాం అనే నినాదంతో అప్నా షహర్ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు. కాగా, మెట్రో రైలును అపరిశుభ్రంగా మారుస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని సూచించారు. -
'మన నగరం' పేరుతో టౌన్‌హాలు సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇకపై నేరుగా ప్రజలు, వెల్ఫేర్ అసోసియేషన్లు, ఎన్జీవోలతో సమావేశాలు నిర్వహించి, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందు కోసం మన నగరం/ అప్నా చహర్ పేరుతో టౌన్‌హాలు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వచ్చే వారం నుంచి నగరంలో సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు జరిపి.. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలతో నేరుగా చర్చించనున్నట్టు ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. 'మన నగరం' పేరుతో పాటు అందులో చార్మినార్ ఉన్న లోగోలను మంత్రి ఈ సందర్భంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
టౌన్‌హాల్‌కు మహర్దశ...
అభివృద్ధి పనులు ప్రారంభం రూ. ఐదు కోట్లతో అత్యాధునికంగా నవీకరణ పనులు ప్రారంభించిన కట్టె పేరు మార్చాలని మనవి బెంగళూరు : నగరంలో ప్రసిద్ది చెందిన పుట్టణ్ణచెట్టి పురభవన (టౌన్‌హాల్) మరమ్మతులకు బుధవారం శ్రీకారం చుట్టారు. రూ. ఐదు కోట్ల వ్యయంతో పురభవనను అత్యాధునికంగా తీర్చిదిద్ది ప్రజలకు అంకితం చేస్తామని బీబీఎంపీ మేయర్ కట్టె సత్యనారాయణ అన్నారు. బుధవారం పురభవనలో ప్రత్యేక పూజలు చే సి మరమ్మతు పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నగరంలో ప్రఖ్యాతి గాంచిన కట్టడాలలో పుట్టణ్ణ చెట్టి పురభవనం ఒకటి అని అన్నారు. అనివార్య కారణాల వల్ల, నిధులు లేక ఇంత కాలం ఈ పురభవనం అభివృద్ధికి నోచుకోలేకపోయిందని అన్నారు. బీబీఎంపీ నిధులతో పనులు చేపట్టామని, త్వరలో నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. నగరంలోని ప్రసిద్ధి చెందిన కట్టడాలను తాకట్టు పెట్టినట్లు పాలికెపై ఉన్న చెడ్డపేరును తుడిచి పెట్టుకునే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. టౌన్‌హాల్ పేరు మార్చండి బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో పుట్టణ్ణశెట్టి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుట్టణ్ణ శెట్టి మనుమడు విశ్వనాథ్ మాట్లాడుతూ ‘మా తాత పేరు పుట్టణ్ట శెట్టి... అయితే పుట్టణ్ణ చెట్టి అని పెట్టారు. దయచేసి టౌన్‌హాల్‌కు మరోసారి పుట్టణ్ణ శెట్టి పురభవన అని నామకరణం చేయండి’ అని మనవి చేశారు. ఇందుకు మేయర్ అంగీకరించారు. 15 రోజులకు ఒక సారి పనుల పరిశీలన బీబీఎంపీ వార్డు భారీ పనుల స్థాయీ సంఘం అధ్యక్షుడు బసవరాజ్ మాట్లాడుతూ టౌన్‌హాల్ పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ పనుల పరిశీలనకు 15 రోజులకు ఒకసారి మా స్థాయీ సంఘం సభ్యులు, అధికారులు వచ్చి వెళుతుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలికె కమిషనర్ లక్ష్మినారాయణ, డిప్యూటీ మేయర్ ఇందిరా, పాలన విభాగం నాయకులు అశ్వత్థ నారాయణగౌడ, స్థాయి సంఘం అధ్యక్షులు గౌరమ్మ, రేఖా కదిరేషన్ పాల్గొన్నారు. -
టౌన్‌హాల్ నవీకరణకు పచ్చజెండా
న్యూఢిల్లీ: నగరంలోని చారిత్రక కట్టడాల్లో ఒకటైన టౌన్‌హాల్ త్వరలో కొత్త హంగులతో దర్శనమివ్వనుంది. ఈ భవనం నవీకరణకు కేంద్ర పర్యాటకశాఖ రూ. 50 కోట్లను మంజూరు చేసింది. మరింతమంది పర్యాటకులను ఆకట్టుకోవాలన్న లక్ష్యంతోనే పర్యాటకశాఖ ఈ నిర్ణయం తీసుకుందని ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎమ్సీ) అధికారి ఒకరు తెలిపారు. ఎన్డీఎమ్సీ పరిధిలోని 150 సంవత్సరాల ఈ పురాతన భవనాన్ని నవీకరించేందుకు రూ. 50 కోట్లతో సంబంధిత అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనల వివరణాత్మక నివేదికను మంత్రిమండలికి పంపడంతో ఎట్టకేలకు ఆమోదముద్రపడిందని ఎన్డీఎమ్సీ ప్రజాసంబంధాల అధికారి యోగేంద్రసింగ్ మాన్ తెలిపారు. నగరంలోని పురాతన కట్టడాల్లో ఒకటైన ఈ టౌన్‌హాల్ చాందినీచౌక్‌లో ఉంది. ఇందులో మ్యూజియం, గ్రంథాలయం, కాన్ఫరెన్స్ హాలు, చిల్డ్రన్స్ కార్నర్, బొటిక్ హోటల్, మల్టీ క్యూసిన్ రెస్టారెంట్, ఆడియో విజువల్ అండ్ మీటింగ్ రూమ్ తదితర సౌకర్యాలున్నాయి. ఈ భవనంలోని మెట్లు కూడా సంగీతాన్ని పలికిస్తాయని, ఇదంతా నిర్మాణనైపుణ్యమని చెబుతారు. ఇందులోని మ్యూజియం ఢిల్లీ చరిత్రను చాటిచెబుతుంది. ఈ భవనంలోని మెయిన్ బ్లాక్‌ను హెరిటేజ్ బొటిక్ హోటల్‌గా తీర్చిదిద్దనున్నారు. ఇందులోకి అడుగుపెట్టే పర్యాటకులకు 1860 నాటి రోజులను గుర్తుకుతెచ్చేలా నవీకరిస్తామన్నారు. ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ విభజన తర్వాత ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి ఈ భవనం వెళ్లడంతో నవీకరణ పనులను కూడా ఎన్డీఎమ్సీనే చూస్తుందన్నారు. -
పర్యాటక కేంద్రంగా టౌన్‌హాల్
సాక్షి, న్యూఢిల్లీ: చాందినీ చౌక్‌లోని చారిత్రాత్మక టౌన్‌హాల్ రూపురేఖలు మారనున్నాయి. దీన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చాలనే ప్రాథమిక ప్రతిపాదనను ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) సోమవారం ఆమోదించింది. టౌన్‌హాల్‌ను ఢి ల్లీ చరిత్ర, సంస్కృతిలకు అద్దంపట్టే సామాజిక, సాంస్కృతిక కేంద్రంగా మార్చాలని ఎన్డీఎంసీ యోచిస్తోంది. సకుటుంబ సమేతంగా వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా టౌన్‌హాల్‌ను తీర్చిదిద్దాలని, ఆ విధంగా దీనికి వైభవాన్ని తీసుకురావాలని కసరత్తు చేస్తోంది. మొఘల్‌కాలం నాటి కళాకృతులు, ఆభరణాలు, దుస్తులు, ఆయుధాల ప్రదర్శనకు ఉంచేలా మ్యూజియం ఏర్పాటు, గ్రంథాలయంతో పాటు పిల్లల కోసం రకరకాల సృజనాత్మక కార్యకలాపాలతో కూడిన యాక్టివిటీ రూములు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఆడిటోరియం, లైట్ అండ్ సౌండ్ షోలు, రెస్టారెంట్లతో టౌన్ హాల్‌ను పర్యాటక ఆకర్షక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళిక రూపొంది స్తోంది. సందర్శకులకు మ్యూజియంలో ప్రదర్శించే దుస్తులు, ఆభరణాలు నచ్చితే వాటి నకళ్లను తయారుచేయించుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. టౌన్‌హాల్ గ్రౌండ్ ఫ్లోర్లో మ్యూజియం, పిల్లల కోసం యూక్టివిటీ రూములు, బొటీక్ షాపులు మొదలైనవి ఉంటాయి. మొదటి అంతస్తులో నాలుగు రెస్టారెంట్లు ఉంటాయి. టౌన్‌హాల్ పునరాభివృద్ధికి 50 కోట్లు వ్యయమవుతుందని ఎన్డీఎంసీ అధికారులు అంచనా వేశారు. టౌన్‌హాల్ చరిత్ర సిపాయిల తిరుగుబాటు తర్వాత షాజహానాబాద్లో బ్రిటిష్‌వారు నిర్మించిన తొలి కట్టడాలలో టౌన్‌హాల్ ఒకటి. ఢిల్లీ మున్సిపల్ అధికారులు దీనిని ఏ గ్రేడ్ వారసత్వ క ట్టడాల జాబితాలో చేర్చి సంరక్షిస్తున్నారు. టౌన్‌హాల్ నిర్మాణానికి పూర్వం ఇక్కడ బేగమ్కీ సరాయ్, బేగమ్ కీ బాగ్ ఉండేవి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ పెద్ద కుమార్తె జహనారా బేగమ్ ఇక్కడ ఉద్యానవనాన్ని ఏర్పాటుచేశారు. దీనిని బేగమ్కీ బాగ్ 1857 తిరుగుబాటు తర్వాత ఈ ఉద్యానవనాన్ని, సరాయ్‌ని తొలగించి 1860లో టౌన్‌హాల్‌ను నిర్మించారు. జహనారా ఏర్పాటుచేసిన ఉద్యానవనం స్థానంలో కొత్త ఉద్యానవనాన్ని రూపొందించారు. అంతకుముందు కం పెనీ బాగ్గా పిలిచిన ఉద్యానవనాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆజాద్ పార్క్‌గా పిలుస్తున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సివిక్ సెంటర్‌కు తరలించేంత వరకు టౌన్‌హాల్ ఎమ్సీడీ ప్రధాన కార్యాలయంగా ఉండేది.