
అభిమానులకు అభివాదం చేస్తున్న పవన్ కళ్యాణ్
బొబ్బిలి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం అంతా హోటల్‌కే పరిమితమయ్యారు. పట్ట ణంలోని సూర్యరెసిడెన్సీలో బస చేసిన ఆయన్ను చూసేందుకు ఎంతగానో అభిమానులు వేచి చూ డగా ఉదయం ఎనిమిది గంటల సమయంలో హోటల్ నుంచి బయటకు వచ్చి అభివాదం చేసి రూమ్‌లోకి వెళ్లిపోయారు. ఆయన పర్యటనపై ఎలాంటి ప్రకటన విడుదల కాకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో జనసేన మీడియా వింగ్ పేరిట ఓ షెడ్యూల్‌ను ప్రకటించారు.
పవన్‌కళ్యాణ్ బస్సు యాత్రలో భాగంగా గురువారం నుంచి బహిరంగ సభలు చేపట్టనున్నట్టు అందులో వివరించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కురుపాం సంత జంక్షన్‌లో, నాలుగున్నరకు పార్వతీపురం పాత బస్టాండ్ వద్ద, సాయంత్రం ఆరు గంటలకు బొబ్బిలి రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద బహిరంగ సభలు ఉంటాయని తెలిపింది. కాగా హోట ల్ గదిలో వామపక్ష నాయకులతో చర్చించి బొబ్బి లి, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లోని సమస్యలపై వివరాలు సేకరించినట్టు తెల్సింది.
Comments
Please login to add a commentAdd a comment