సాక్షి, ఢిల్లీ: త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం అధికార బీజేపీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 15, 16 తేదీల్లో జరిగే పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికలపైనే ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు అవసరమైన వ్యూహాలపై జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ అగ్ర నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ సహా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర ముఖ్య నేతలు, జాతీయ కౌన్సిల్ సభ్యులు హాజరవనున్నారు.
ఇదీచదవండి.. భారత విద్యార్థులకు మాక్రాన్ రిపబ్లిక్ డే కానుక
Comments
Please login to add a commentAdd a comment