National Council
-
బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు.. తెలంగాణపై నడ్డా కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపినడ్డా తెలంగాణ విషయాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలోని ప్రగతిమైదాన్ భారత్ మండపంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో నడ్డా ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణలో గతంలో 7 శాతం ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతానికి పెరిగిందని చెప్పారు. ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఐదేళ్లలో బలం పెంచుకుని తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో మూడోసారిఅధికారంలోకి రానున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గత పదేళ్లలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రతినిధులకు నడ్డా వివరించారు. సమావేశాలకు ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదీ చదవండి.. ఇండియా కూటమి కథ ముగిసింది.. నితీశ్ కుమార్ -
వచ్చే నెలలో బీజేపీ కీలక సమావేశాలు.. ఎంపీ ఎన్నికలపైనే ఫోకస్!
సాక్షి, ఢిల్లీ: త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం అధికార బీజేపీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 15, 16 తేదీల్లో జరిగే పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికలపైనే ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు అవసరమైన వ్యూహాలపై జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ అగ్ర నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ సహా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర ముఖ్య నేతలు, జాతీయ కౌన్సిల్ సభ్యులు హాజరవనున్నారు. ఇదీచదవండి.. భారత విద్యార్థులకు మాక్రాన్ రిపబ్లిక్ డే కానుక -
ఆ ఇద్దరికీ అపూర్వ సన్మానం
సాక్షి, హైదరాబాద్: సీపీఎం 22వ జాతీయ మహాసభల ప్రాంగణం అరుదైన ఘటనకు వేదికైంది. అవిభక్త కమ్యూనిస్టు పార్టీ నుంచి సీపీఎం ఆవిర్భావం కోసం అప్పటి సీపీఐతో విభేదించి బయటకు వచ్చిన ఇద్దరు కమ్యూనిస్టు యోధులను ఘనంగా సన్మానించారు. ఆ ఇద్దరు.. పార్టీ తొలి కేంద్ర కమిటీ సభ్యులైన కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ (95), తమిళనాడుకు చెందిన పార్టీ నేత శంకరన్ (96). పార్టీ మహాసభలకు వీరిని అతిథులుగా ఆహ్వానించిన సీపీఎం నేతలు మహాసభల వేదికపై సత్కరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వారి మెడలో దండలు వేశారు. పార్టీ మూలస్తంభాలైన ఈ ఇద్దరు నేతల కృషి మరువలేనిదని కొనియాడారు. అచ్యుతానందన్, శంకరన్‌లు కనీసం నడవలేని స్థితిలో ఉన్నా.. సహాయకులను వెంటబెట్టుకుని సభలకు హాజరవడం విశేషం. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మాణిక్ సర్కార్ సాక్షి, హైదరాబాద్: దేశాన్ని ప్రజావ్యతిరేక ప్రభుత్వం పాలిస్తోందని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆరోపించారు. బుధవారం ప్రారంభమైన పార్టీ జాతీయ మహాసభల్లో ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. మతతత్వ విధానాలతో నేరుగా ప్రజాస్వామ్యంపై దాడికి బీజేపీ, సంఘ్ పరివార్లు తెగబడుతున్నాయని ఆరోపించారు. వామపక్ష, ప్రజాతంత్ర కూటమి మాత్రమే దేశ ప్రజల నిజమైన కూటమి అని అన్నారు. మార్క్సిస్టు యోధులకు సంతాపం మహాసభల్లో తొలిరోజు పలువురు మార్క్సిస్టు యోధులకు నివాళి అర్పించారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ప్రవేశపెట్టిన ఈ సంతాప తీర్మానంలో ఖగేన్‌దాస్, పుకుమోల్‌సేన్, నూరుల్‌హుడా, సుబో«ధ్ మెహతాలతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పులువురు నేతలకు సంతాపం ప్రకటించారు. తెలంగాణ నుంచి మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి, ట్రేడ్ యూనియన్ నేతలు పర్సా సత్యనారాయణ, తిరందాసు గోపిలకు కూడా మహాసభ నివాళి అర్పించింది. బెంగాల్, త్రిపుర, బిహార్, మహారాష్ట్రల్లో హత్యలకు గురైన పార్టీ నేతలను సంస్మరించుకున్నారు. -
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా రవీందర్రావు
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా మంచిర్యాలకు చెందిన వెరబెల్లి రవీందర్రావు నియామకం అయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్‌గా ఉన్న రవీందర్రావు జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా నియామకం కావడంతో గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మల్లేశ్, బీజేపీ నాయకులు చుంచు శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి మద్దెర్ల కృష్ణమూర్తి, జిల్లా మహిళామోర్చా ప్రధాన కార్యదర్శి బోడకుంట ప్రభ, బీజేవైఎం పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొద్దున మల్లేశ్, మేరుగు ఆంజనేయులు, కిషాన్ మోర్చా మండల అధ్యక్షుడు నరెడ్ల పోచమల్లు పాల్గొన్నారు.